S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/08/2017 - 07:09

భారతదేశంలో నూతన ఆర్థిక శకం ప్రారంభమవుతున్నది. ‘ఒకే దేశం- ఒకే పన్ను- ఒకే విపణి’ (్జశళ ఘోఆజ్యశ జశళ ఘన జశళ ఘూరీళఆ) విధానం భారత్‌లో 2017 జులై 1 నుంచి అమలులోకి వస్తుంది. వస్తు సేవా పన్ను (ద్య్యిజూఒ ఘశజూ డళ్పూజషళఒ ఘన) బిల్లు 6 ఏప్రిల్ 2017న రాజ్యసభ ఆమోదం పొందడంతో దేశ ఆర్థిక ప్రగతికి తలుపులు తెరుచుకున్నాయి. పన్నుల సంస్కరణల కోసం ఇప్పటివరకూ చేపట్టిన అన్ని చర్యల కంటే ఇది విప్లవాత్మకం.

04/07/2017 - 07:14

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో విద్యావ్యవస్థలో ‘నాన్ డిటెన్షన్’ విధానం ప్రవేశపెట్టారు. అన్ని తరగతులకూ పరీక్షలను ఎత్తివేస్తే విమర్శలు వస్తాయని ఏడవ తరగతికి, పదవ తరగతికి మాత్రం పబ్లిక్ పరీక్షలు ఉంచారు. కొంతకాలానికి ఏడవ తరగతికి కూడా రద్దుచేశారు.

04/06/2017 - 08:26

ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషాద గాథ 1987 నాటిది. దేవుడి గుళ్ళలో అర్చకత్వం చేసి, ఇతరత్రా సేవలు చేసి అర్ధాకలితో బొటాబొటీ జీవితాలు గడిపే అర్భకుల, ఉద్యోగుల కథ ఇది. సుప్రీం కోర్టు గడప కూడా తొక్కిన తరువాత రెండు కమిటీలను కోర్టు నియమించింది. అవి- వేతన స్కేళ్ళ కమిటీ, అర్చకుల సంక్షేమ కమిటీ. వీటి నివేదికలను కూడా ప్రభుత్వం ఆమోదించి కోర్టుముందుంచింది.

04/06/2017 - 08:25

నేను నారాయణపేటలో ఉన్నప్పుడు అప్పటి విద్యామంత్రి గోపాలరావు ఏక్బటే స్కూలుకు వచ్చాడు. నేను తరగతి గదిలో సైన్స్ పాఠం చెబుతున్నాను. ఆయన నా పాఠం విన్నాక- ‘ఈ పాఠం ఎందుకు చెప్పావు? ఇందులో నీ లక్ష్యం ఏమిటి? దీనికి కారణాలేమిటి?’ అని అడిగాడు. ‘దీన్ని సిలబస్‌లో పెట్టారు కాబట్టి చెప్పాన’ని మంత్రికి సమాధానమిచ్చాను. ‘నువ్వు టీచర్‌లా కాకుండా ఒక ప్రభుత్వ అధికారిలాగా మాట్లాడుతావేంది?

04/05/2017 - 01:34

‘సన్యాసి’ అనగానే సర్వ సంఘ పరిత్యాగి, ముక్కుమూసుకుని జపం చేసుకునే వాడన్న భావన చాలామందిలో కనిపిస్తుంది. ఆమాట కొంత నిజమే కానీ, అందరూ అలాంటివారు కాదు. కొందరు సన్యాసులు గొప్ప విప్లవకారులు కావడం గర్వించదగ్గ విషయం. అలాంటి వారివల్ల సమాజం సమయానుకూలంగా ముందడుగేసింది. సన్యాసం అంటే జడత్వం కాదు, చైతన్యమని నిరూపించిన మహాపురుషులు ఎందరో ఉన్నారు. ప్రాథమికంగా సన్యాసి జ్ఞానానే్వషి.

04/04/2017 - 00:19

ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో యు పి, ఉత్తరాఖండ్‌ల్లో భాజపా అఖండ విజయం సాధించడంతో దేశ రాజకీయాల్లో తమకు ఇక ఎదురే లేదని మోదీ, అమిత్ షా భావిస్తున్నారు. యుపి, ఉత్తరాఖండ్‌ల్లో అద్భుత విజయానికి వారి పనితనం ఎంత కారణమో, ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ప్రజావ్యతిరేకత కూడా అంతే కారణమన్న విషయాన్ని భాజపా నేతలు విస్మరించరాదు.

04/03/2017 - 00:24

చిన్న దేశమైన ‘రిపబ్లిక్ ఆఫ్ మాల్టీవ్స్’ వెయ్యి కన్నా ఎక్కువ దీవుల సముదాయం. ఇది సముద్ర మట్టానికి ఒక మీటరు ఎత్తులో ఉంటుంది. సముద్రమట్టం నానాటికీ పెరుగుతుండడం వల్ల ఈ శతాబ్దం (2100) అంతానికి ఈ దీవులన్నీ కనుమరుగయ్యే ప్రమాదం వుంది. ఈలోగా అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యంగా కనిపిస్తోంది.

04/02/2017 - 01:08

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తీరు, ఆయా పార్టీల ధోరణి చూసిన వారికెవరికైనా కలిగే భావనే ఇది. కోట్ల రూపాయల ప్రజాధనంతో నడిచే శాసనసభలు సమస్యల పరిష్కారానికి కాకుండా, అధికార, ప్రతిపక్షాల మధ్య ఆధిపత్యపోరుకు వేదిక కావడం విచారకరం. రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలు పాలనాపగ్గాలు చేపట్టి దాదాపు మూడేళ్లు కావస్తోంది.

04/01/2017 - 01:45

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ తత్వాన్ని అనాది కాలంగా అణువణువునా జీర్ణించుకున్న భారతీయ సమాజానికి తెచ్చిపెట్టుకున్న తెగులు పుట్టింది. జీవుల పుట్టుక, శరీర నిర్మాణం, పోషణకు మూలం అన్నం. జీవులన్నీ అన్నగత ప్రాణులే. ‘అన్నాద్భవన్తి భూతాని’ అన్న సత్యం తెలిసిన భారతీయుడు ఉద్దేశ పూర్వకంగా దీనిని విస్మరించడం దురదృష్టకరం.

03/30/2017 - 23:18

అయోధ్యలో దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్న ‘రామమందిరం సమస్య’ కేవలం అక్కడి ప్రజలదే గానీ, కోర్టులది కాదు. ఈ విషయంలో రాజకీయ పార్టీలకు కూడా ఎటువంటి సంబంధం లేదు. నిజానికి అయోధ్య అన్నది ‘రామజన్మభూమి’ అని పురాణాలు, చారిత్రక ఆధారాలు ఘోషిస్తున్నాయి. అయోధ్యలో రామమందిరం నిర్మించాలన్నది ప్రతి హిందువు మనోభీష్టం.

Pages