S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/10/2019 - 20:09

శరీరము శైశవదశ నుండి వృద్ధినొంది చివరకు క్షీణించు దశలో కూడా మనస్సు మాత్రము కల్పనలు ఆపదు. ప్రతి క్షణమూ కాదుకాదు ప్రతి అరక్షణం కూడా వూరుకోక ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఇంకొంక క్షణంలో శరీరం శిథిలమవుతుంది అని తెలిసినా సరే మనసు మాత్రం మనో వేగంతో హిమాలయాల కన్నా ఉన్నతంగా నైనా, పాతాళం ఉన్న వరకు బిలం లోతు గానైనా ఆలోచనలు సాగిస్తూ ఉంటుంది.

06/09/2019 - 23:06

పరశురాముడు జమదగ్ని, రేణుకల కుమారుడు. ఇతడు తండ్రి మాటనువిని తల్లి తలను నరికివేశాడు. తనమాట విన్నందుకు ఆ తండ్రి మెచ్చుకుని ఏం వరంకావాలో కోరుకోమన్న తండ్రితో తల్లిని బతికించమని వేడుకున్నాడు. తల్లిదండ్రుల పైన అపారమైన భక్తి ప్రేమ గౌరవం ఉన్న మహర్షి పరశురాముడు.

06/09/2019 - 23:02

భాసురమైన భూసురుల వంశమూమాపతి వారమేము యా
వాసము జన్మభూమియును వాసిగడించిన సిద్దిపేట ప్రా
వాసము ధర్మభూమియను భాగమతీ నగరమ్ము దెల్పగన్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

06/06/2019 - 19:37

సంభూవ్యం సదపత్యవ ద్వర కరాద్రక్ష్యంచ సుక్షేత్రవత్
సంశోధ్యం వ్రణితాంగవత్ ప్రతి దినం వీక్ష్యంచ సన్మిత్రవత్
బధ్యం వధ్యవ దశ్లధం దృఢ గుణైః స్మర్యం హరే ర్నామవత్
నైవం సీదతి పుస్తకం ఖలు కదాప్యేత ద్గురుణాంవచః

06/05/2019 - 20:15

మనసుంటే మార్గముందని నానుడి. అంటే ఏ పనైనా చేయాలనే మనసుంటే- ఆ పని ఎలా పూర్తిచేయాలన్న మార్గం అదే చూపుతుందని దాని తాత్పర్యం. కనుక ‘మనసే’ అన్ని క్రియాశీలక చర్యలకు మూలం. కానీ, విచిత్రమేమిటంటే ఆ ‘మనసు’ బహు చంచలమైనది. పూదోటలో ఎగిరే సీతాకోక చిలుకలా నిరంతరం అలౌకిక విషయ విహారం చేస్తూనే ఉంటుంది. ఆశల ఊయలలో డోలాయమానంగా ఊగుతూనే ఉంటుంది.

06/04/2019 - 19:47

త్రేతాయుగంలోని రాముడిని నేడు కూడా సర్వ వేళలయందు స్మరిస్తూ ఉంటారు. ఈ రామశబ్దం కేవలం భారతదేశంలోనో, అందు లో తెలుగునాటలోనే కాదు ప్రపంచం అంతా ఆ రామశబ్దం వినిపిస్తూ ఉంటుంది. రామ రాజ్యం కావాలని కలలు కనేవారు ఉంటారు. పాలకుల చేతికి రాజ్యం లేదా రాష్ట్రం దక్కగానే రామరాజ్యాన్ని నా పాలన లో తెస్తాను అని ప్రజలకు చెప్పే పాలకులు ఉంటారు. ప్రతి వ్యక్తీ తాను రాముడిలాగా ధర్మాచరణను చేస్తానని చెబుతాడు.

06/02/2019 - 22:21

రామనామము ఎక్కడ జపిస్తుం టారో అక్కడ చిరంజీవి ఆంజనేయుడు పద్మాసనారూఢుడై కొలువుతీరి ఉంటాడు. రామకథాగానం చేస్తున్న ప్రతిచోటా హనుమంతునికి ఒక ఉచితాసనం ఏర్పాటుచేయడం మన సంప్రదాయం. కారణజన్ముడు చిరంజీవి హనుమ.

06/02/2019 - 22:17

దాసగుణమ్ము లేని బహుదాన గణమ్ము నిరర్థకమ్ము వి
శ్వాసము గల్గి యుండియును భక్తి పరత్వము లేని పూజలున్
దోసము , మూర్ఖతత్వమగు దుష్ఫల దాయి గదమ్మ రుూశ్వరీ
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని! శ్రీ సరస్వతీ!

05/31/2019 - 22:30

దాసియొకర్తి రాజునకు దారుణ మారణ కారణమ్ము యా
దాసియె రామచంద్రునకు దండక కానన వాసకారణం
బేసమయమ్మునందు మరియెవ్వరొ దేనికి మూల కారకుల్
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!

05/31/2019 - 22:21

చేసిన దెల్ల మంచియని జేసితి చెయములిన్ని నాళ్లు నే
వ్రాసిన దెల్ల కావ్యమని భ్రాంతిని జెందుచు నుంటి సద్గురో
పాసన లేక యేదియును పాదును పందిరి లేని తీగయే
వాసర వాసినీ ప్రధిత వాగ్వర దాయిని ! శ్రీసరస్వతీ!

Pages