S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

06/30/2016 - 04:26

ప్రపంచంలో వున్న మనుషులలో ఉన్న మంచిని చూపించి దాని ద్వారా జీవితకాలం నిలిచే అనుబంధాలను ఏర్పరచుకోవడంలో కృతజ్ఞత ఎంతగానో సహాయపడుతుంది. మన రోజువారీ పనితీరును మెరుగుపరుస్తుంది. మంచిని పెంచి పోషిస్తుంది. మానవుని మనసు అంతు తెలియని చిక్కుముడి. బయట ప్రపంచాన్ని జయించడం కంటే అంతరికపు లోతును అంచనా వేయడం ఎంతో కష్టం.

06/28/2016 - 22:52

సమర్థత, అసమర్థత.. ఈ రెండూ మనిషిలో దాగి వుండటం సహజం. వాస్తవ లోతుల్లోకి తొంగి చూసినపుడు సమర్థత మాత్రమే మానవుని ఆత్మలో నిగూఢంగా వున్న సహజ ధర్మం. ప్రాపంచిక బంధాలు ఆత్మాభిమానమునకు అడ్డుగోడలుగా నిలుస్తాయనేది నిజం. లక్ష్యము, లక్షణాలు.. ఈ రెండూ సాధకునికి ప్రగతిబాటగా నిలుస్తాయి.

06/27/2016 - 03:24

భాగవతం మోక్షగ్రంథం. సంసార తరుణోపాయంగా స్మరించదగిన నిత్యపారాయణ గ్రంథం. భక్తుల గాథలేభాగవతం. భక్తితత్పరతతో శ్రీకైవల్యపథాన్ని చేరుకున్న స్ర్తి పాత్రల్లో ‘దేవహూతి’ విశిష్టమైనది. దేవహూతి ఆదర్శ స్ర్తిమూర్తి. పోతన భాగతంలోని మూడవ స్కంధంలో దేవహూతి వ్యక్తిత్వం, మనస్తత్వం ఏ కాలంలోనివారికైనా ఆదర్శప్రాయం. దేవహూతి వృత్తాంతం ద్వారానే లోకానికి కపిలుని సాంఖ్యయోగశాస్తజ్ఞ్రానం అందించబడింది.

06/25/2016 - 21:29

ధర్మానికి గ్లాని సంభవించినప్పుడు పరమాత్మ తన అంశారూపములైన త్రిమూర్తులకు పరిస్థితులను చక్కదిద్దే పనిలో నియోగిస్తాడు. పురుష రూపంలో పరమేశ్వరుడుగాను,స్ర్తి రూపంలో పరాశక్తిగాను పరిగణిస్తారు. ఈ రెండు రూపములు ఒక్కటే. అదే పరమాత్మ.

06/24/2016 - 21:38

ఈ సకల చరాచర సృష్టికి కర్త కర్మ క్రియ అంతా భగవంతుడే. ఆ భగవంతుడు ఏమి చేసినా మన మంచికే. చేప రూపంలో వేదాలను కాపాడాడు. వరాహరూపంలో భూమిని కాపాడాడు. కూర్మ రూపాన లోక కళ్యాణంకై మేరు పర్వతాన్ని తన వీపుపై మోసి అమృత భాండాన్ని కల్పవృక్షాన్ని, కామధేనువు దేవతల పరం చేశాడు. రాక్షసరాజైన బలి చక్రవర్తిని వామన రూపంలో అధఃపాతాళానికి తొక్కివేశాడు. శ్రీరాముడిగా తన ఖ్యాతిని దిగంతాల అంచులు దాటించాడు.

06/23/2016 - 21:55

మనం మన ఆశయాలు సాధించేటప్పుడు ఎన్నో అవాంతరాలు ఆటంకాలు అడ్డువస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడి విజయం సాధించాలి. పట్టుదల కృషితో సాధించలేనిది అంటూ ఏది ఉండదు. అయితే మనం వాళ్ళవలె విజయం సాధించలేకపోతున్నాం అని ఆలోచించడం మొదలుపెట్టాలి. ఒక గెలుపు జీవితాన్ని ఎలా మార్చివేస్తుందో అలాగనే ఓటమి కూడా జీవితాన్ని మార్చేస్తుంది. మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు.

06/23/2016 - 05:32

భారతీయ సంప్రదాయంలో యోగ అంతర్భాగం. యోగా వేదకాలానికి ముందే ఆవిర్భవించింది అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. సింధూ నాగరికత నెలకొన్న మొహంజొదారో, హరప్పా త్రవ్వకాలలో లభించిన ముద్రికల మీద యోగాకృతిలో ఉన్న పశుపతి బొమ్మ ఇందుకు నిదర్శనం.

06/21/2016 - 21:36

జీవితం ఎత్తుపల్లాలు అనేకం ఉంటాయి.కష్టాలు వచ్చినపుడు కుంగిపోవడం సుఖాలు వచ్చినపుడు పొంగిపోవడం సాధారణుల లక్షణం. కాని ఉత్తములు, జ్ఞానులు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. వాళ్లకు సుఖదుఃఖాలు సమానం. వాటివలన వారిలో ఏమార్పు రాదు. రెండింటి యందు స్థిత ప్రజ్ఞత్వం ప్రదర్శిస్తారు. అట్లా స్థిత ప్రజ్ఞను చూపాలన్నదే పెద్దల మాట. కాని దీన్ని ఆచరించడానికి కొంత సాధన అవసరం.

06/19/2016 - 23:37

మన నిత్య జీవితంలో అమృతము అనే పదమును పలు పర్యాయములు పలు సందర్భములలో ఉపయోగించుట జరుగుతుంది. మన చెవికి నచ్చిన భాషణములు సోకితే వాటిని అమృత వాక్కులు అంటారు. ఏ పదార్థమైనా మన నోటికి నచ్చితే అమృతంలాగుంది అంటూ ఉంటాము. ఏదైనా మరచిపోలేని అనుభూతి జీవితంలో సంభవిస్తే దానిని అమృత ఘడియలు అంటాము. వాస్తవానికి అమృతం అంటే ఏమిటో ఎవరికి తెలియదు. కాని గుణము మాత్రం అందరికీ తెలుసు.

06/19/2016 - 07:28

వెనుకటిరోజుల్లో పిల్లలకు జ్వరం వస్తే పసరుమందు త్రాగేంచేవారు. అది చాలా చేదుగా వుండేది. ఆ పసరును బెల్లంతో కలిపి త్రాగించేవారు. యిష్టంగా తినేవారు. జ్వరం కూడా తగ్గుతూ, ఆరోగ్యంగా వుండేవారు. ఈ వర్తమాన కాలంలో దైవచింతన, పారమార్థికత కూడా అంతే. రోజంతా అనేక కార్య వ్యవహారాలలో నిమగ్నమై గుడికి వెళ్ళితే దైవదర్శనం, ప్రసాదం కూడా మనిషికి ఆనందాన్ని ఇవ్వడంలేదు.

Pages