S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

08/04/2016 - 21:10

ఒక అడవికి దగ్గరగా వున్న గ్రామంలో ఒక కట్టెలు కొట్టి అమ్ముకునేవాడు వుండేవాడు. అతడు శివభక్తుడు. ప్రతిరోజూ కట్టెలు కొట్టి ఇంటికి వెళ్ళేముందు శివాలయానికి వెళ్లి దేవుణ్ణి దర్శించుకొనేవాడు. ఒక రోజు అతడు ఆలయానికి వెళ్ళేసరికి అక్కడ ఒక స్వామీజీ ఉపన్యాసం ఇస్తున్నాడు. కట్టెలవాడు ఆ ఉపన్యాసాలను శ్రద్ధగా విన్నాడు.

08/04/2016 - 03:59

స్నేహానికి హద్దులు ఉండవు. పరిమితులు ఉండవు. స్నేహం ఒక గొప్ప ప్రవాహం లాంటిది. అనిర్వచనీయమైనది. త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమను కురిపిస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. తృప్తిని కలిగిస్తుంది. అసంతృప్తిని దూరం చేస్తుంది. ఆశలను చిగురింపజ్తేంది. ఆశయాలను గుర్తుచేస్తుంది. స్వార్థాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తుంది. కపటాన్ని, మోసాన్ని కాఠిన్యాన్ని దరిచేరనీయదు. వృద్ధిని కోరుకుంటుంది.

08/02/2016 - 21:14

ఒక మతం వీడి మరొక మతంలో చేరేవారి గురించి సద్గురు శ్రీ శివానందమూర్తిగారు ఇలాగన్నారు. ‘‘ఒక మతం వదిలిపెట్టి, మరొక మతంలోనికి వెళ్లినవాడు, తన వంశంలోని పెద్దలను, తాత ముత్తాతలను తప్పు పట్టి తిరస్కరించినవాడే అవుతాడు. నూతనంగా స్వీకరించిన మతంలో తనకు పూర్వులు లేనివాడవుతాడు. అలా చూస్తే ఏ మతంలో పుట్టాడో, ఆ మతంలోనే మరణించేవరకు విధిగా జీవించక తప్పదు. పుట్టిన నాటి మతమే పోయిననాడు ఉండి తీరుతుంది. ఉండి తీరాలి.

07/31/2016 - 00:42

మానవ జీవితం నమ్మకం చుట్టూ పరిభ్రమిస్తుంది. విశ్వాసంపై ఆధారపడి మానవుడు జీవన యాత్ర సాగిస్తున్నాడు. పుట్టిన దగ్గరనుంచి గిట్టేవరకు సాగే జీవన ప్రయాణానికి నమ్మకమే జవసత్వం. సకల మానవ సంబంధాలకు పరస్పర విశ్వాసమే ప్రాతిపదిక. పుట్టగనే తల్లిదండ్రులు, ఇతర స్వీయ కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే బాంధవ్యానికి ప్రేమ పూర్వకమైన విశ్వాసమే ఊపిరి పోస్తుంది. ఎవరికైనా నమ్మకంలోనుంచే ప్రేమాభిమానాలు పుట్టుకొస్తాయి.

07/29/2016 - 22:05

శరీరం క్షీణిస్తుంది, నడక మందగిస్తుంది, దంతాలు ఊడిపోతాయి, చూపు మందగిస్తుంది, వినికిడి తగ్గుతుంది, బంధువులు మాట పట్టించుకోరు, భార్య సేవ చేయడానికి ఇష్టపడదు. పుత్రులు శత్రువులుగా ప్రవర్తిస్తారు. అయ్యో! వార్థక్యం ఎంత దుర్భరం. అప్పుడు మృత్యుభయం వెంటాడుతుంది. బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం, మరణం- ఇవి మానవుడి పరిణామ దశలు, జీవిత చక్రం.

07/28/2016 - 21:03

జీవితం నలుగురితో కలసి బతికే వీలును కలిగిస్తుంది. ఏ ఒక్కరూ ఒక్కరుగా బతకలేరు. కనుకనే మనిషి సంఘజీవి అన్నారు. ప్రకృతి, పురుషుడు ఇద్దరూ పరస్పర పోషకాలు. ప్రతి మనిషి మరో మనిషితో అవసరం చేతనో లేక మరింకేదైనా పని వల్లనో మాట్లాడి వారి సహకారం తీసుకోవాలి అపుడే జీవన యానాన్ని సాగించ గలుగుతారు. ఈ క్రమంలో ఎందరో స్నేహితులు వస్తారు. మరెందరో శత్రువులు కలుస్తారు.

07/27/2016 - 22:56

రాయబారాలు రాచరికాలు కట్టబెట్టడానికి, ప్రేమ వ్యవహారాలు చక్కబెట్టడానికి జరిగేవి. ఆ కాలంలో వ్యక్తులే కాక, పక్షులు కూడా రాయబారాలు నడిపేవి. రాయబారికి కావలసింది ఎదుటివాణ్ణి నొప్పించే మాట కాదు, ఎదుటివాణ్ణి మెప్పించే మాట.

07/26/2016 - 20:59

ఈ మిథ్యారూప జగత్తునందు మనుజుడు జనన మరణమనే భ్రాంతి చక్రములో పరిభ్రమించుచున్నాడు. కాని సర్వకాల సర్వావస్థలయందు ఆత్మరూపుడై అనుభవించుచున్నాడు. వర్ణాశ్రమ ధర్మములలో నిర్దేశించిన కర్మలు చేపట్టి నిర్వర్తించుట దైవ నిర్ణయం. లౌకిక ప్రపంచ జీవనములో సమస్త పదార్థాములు ఉత్తమ పురుష పయత్నముచే జనించుచున్నవని యోగ వాసిష్ఠములోని ముముక్షు ప్రకరణము తెలియచేయుచున్నది.

07/25/2016 - 00:19

సముద్రంలో ఎగసిపడే అలలతో కేరింతలు కొడుతాం కానీ సమస్యలు అనే అలలు జీవితంలోకి వస్తే అధైర్యంతో వెనకడుగు వేస్తాం. ఒక్కొక్క పరిస్థితిలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన చెయ్యడానికి కూడా ధైర్యం చాలదు. అటువంటప్పుడు మనం ఎంతగా క్రుంగిపోతాం అంటే చెప్పనక్కరలేదు. మానసికంగా కృంగిపోవడంతోపాటు శారీరకంగా బలహీనపడతాం.

07/23/2016 - 22:45

అనేక అవకతవకలతో, మనుషుల నడతలు అస్తవ్యస్తంగా సాగడానికి కారణం కలియుగ ప్రభావం. వినాశకాలానికి మార్గం చూపే మానవయానం, అవినీతి, అబద్ధం, క్రూరత్వం, కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, స్వార్థం వంటి బుద్ధులతో సాగుతూ ఉంటుంది. కన్నవారికి కడు దూరంగా, వారికి ఏ ఆసరా అందివ్వకుండా, కేవలం తమ కుటుంబానికే పరిమితం అయే పిల్లలతో వృద్ధుల జీవితం దుర్భరం అవుతుంది. మానుగానే పుట్టే పిల్లలు మొక్కలుగా వంచశక్యం కాదు.

Pages