S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

07/22/2016 - 21:40

ఆవేశం అన్ని అనర్థాలకు మూలం. ఈ భూ ప్రపంచంలో అన్ని జీవరాశులకన్నా మనిషి చాలా తెలివిమంతుడు. మంచి చెడు విచక్షణా జ్ఞానం కలిగిన ఏకైక జీవి. అంతరిక్షానికి అవలీలగా ఎగిరిపోయాడు. అధఃపాతాళం అంతు చూశాడు. నిరంతరం ఏదో కనుగొనాలన్న తపనతో అనే్వషణ కొనసాగిస్తూనే ఉన్నాడు. అలాంటి మనిషి ఒక్కొక్కసారి తనే అన్నీ మర్చి అశాశ్వతమైన భౌతిక సుఖాలకోసం అనవసరంగా ఆవేశానికి లోనై మానవత్వం మర్చి మనిషిగా మాయమైపోతున్నాడు.

07/21/2016 - 22:48

జ్ఞానమనగా తెలివి. ముఖ్యంగా మోక్ష సంబంధమైన విషయము తెలుసుకొను బుద్ధి. ఇది తెలిసికొన్నవారు ‘జ్ఞాత’. శ్రద్ధగలవాడు, జ్ఞానమునందాసక్తిగలవాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు జ్ఞానము పొందును. జ్ఞానము పొందిన తర్వాత అనతికాలములోనే శాంతిని పొందగలడని భగవానుడు గీతలో తెలియజేశాడు.

07/21/2016 - 04:12

ఏకం సత్ విప్ర బహుధా వదంతి. ఇది అందరూ ప్రవచిస్తున్న ఆర్యోక్తి, వేదోక్తి. వేదాలు ఏ జాతికి ఏ మతానికి ఏ సంప్రదాయానికి చెందినవి కావు. సర్వమత సామరస్యానికి సమన్వయానికి చెందిన జీవన ధర్మం, విజ్ఞాన సర్వస్వం. ఈ వేదోక్తి భావం సవివరంగా తెలుసుకుందాం. స్థూలంగా దీని అర్థం ఇది. సత్యం ఒక్కటే. విప్రులు అనగా పండితులు ఈ సత్యమును బహు విధాలుగా చెప్పుదురు అని అర్థం.

07/20/2016 - 00:49

అన్ని జన్మలకంటే మానవ జన్మ ఉన్నతమైనది. ఈ మానవ జీవితంలో మానవులు సాధించాల్సిన పురుషార్థములు నాలుగు ఉన్నాయని పెద్దలు చెపుతుంటారు. పెద్దల మాట సద్దిమూటలాంటిదిగదా! ఈ చతుర్విధ పురుషార్థములే ధర్మం, అర్థం, కామం, మోక్షం. చతుర్విధ పురుషార్థములు పూలుగా పూచిన పుణ్య భారతదేశం మనది. భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధించిన విధంగానే ఆధ్యాత్మిక రంగంలో కూడా మహోన్నతంగా ఎదిగింది.

07/17/2016 - 21:09

ఆర్ష వాఙ్మయానికి ఆద్యుడు వేదవ్యాసుడు. సనాతన ధర్మమును ప్రతిష్ఠింపజేయడంలో ఆయన సృజించని తాత్త్వికాంశమే లేదు. వేదాలను విభజించిన వ్యాస మహర్షి జ్ఞాన ప్రధానమైన రచనలను ఎన్నో చేశారు.

07/17/2016 - 04:24

ఉన్నది ఒక్కటే. దృష్టిని బట్టి దృశ్యము పలురకాలుగా ఉంటుంది. సత్యం ఒక్కటే కాని విపులీకరించే విశే్లషించే విధానాలు పలురకాలు. సత్యా సత్యాలలోకాని, ధర్మాధర్మాలలో కాని వ్యత్యాసం లేశమాత్రమే ఉంటుంది. దాన్ని గుర్తించే నైపుణ్యం సాధారణ మానవులకు అంతగా ఉండదు. అందుకే మంచి త్రోవను చూపి, దైవం పట్ల ఆరాధనను, ధర్మం పట్ల, సత్యం పట్ల నిర్ధిష్టమైన దృష్టిని కలిగించడానికి సద్గురువు కావాల్సి ఉంటుంది.

07/15/2016 - 21:08

మంచి హృదయం నుంచి వెలువడే శుభకామన దీవెన. ఇదియే హృదయపూర్వకమైన ఆశీర్వచనం. దీవెన, ఆశీర్వాదం అన్న వ్యవహారాలకు చాలా ప్రాధాన్యత వుంది. మానవ జీవితంలో పుట్టిన దగ్గరనుంచి జీవి మట్టిలో కలిసేవరకు సర్వ సృష్టికారకుడైన పరమాత్ముని కరుణా కటాక్షాలతోనే మనగలుతున్నాననే ప్రగాఢ విశ్వాసము విశ్వమంతా విస్తరించి ఉన్నది.

07/14/2016 - 21:17

ప్రతీ సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలిఏకాదశి’గా అంటారు. పూర్వకాలమందు ఈ తొలి ఏకాదశితోనే సంవత్సర ప్రారంభంగా చూసేవారు. ఈ రోజును ‘శయన ఏకాదశి’ అని కూడా పిలుస్తారు.

07/13/2016 - 22:16

భక్తి శాస్త్రంలో శ్రవణ, కీర్తన, స్మరణ, పాదసేవన, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన అను నవవిధ భక్తిమార్గాలనే గాక వాత్సల్యభక్తి మధురభక్తి అనే మరో రెండు భక్తి విధానాలను వివరించడం జరిగింది.

07/12/2016 - 21:11

పుట్టిన ప్రతి జీవి సుఖసంతోషాలను, కష్టనష్టాలను అనుభవించడమనేది చాలా సహజం. కొంత కాలం సంతోషం ఉంటే మరికొంత కాలం దుఃఖం అనుభవానికి వస్తుంది. కాని సాధారణంగా ఈలోకంలో జీవన క్రమంలో దుఃఖానికి లోను అయ్యేవారు ఉంటుంటారు. అంటే కేవలం అశాశ్వతమైన క్షణభంగురమైన వాటి గురించి ఎక్కువగా బాధపడతుంటారు సామాన్యులు. భౌతిక సుఖం కోసం విలపిస్తారు. దీనివల్ల వీరి విషాదం భవబంధాలను పెంచేది అవుతుంది.

Pages