S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

12/22/2015 - 23:20

‘యజ్ఞము’ అనగా దేవతలను పూజించి తృప్తిపరచడం. ఆ దేవతలను తృప్తి పరచడానికి కొన్ని వస్తువులను అగ్నికి ఆహుతి ఇవ్వడమే యజ్ఞము. ఈ యజ్ఞాన్ని యాగం, క్రతువు, హవనం అని కూడా అనవచ్చు. యజ్ఞమే బ్రహ్మ, యజ్ఞమే విష్ణువు, యజ్ఞమే రుద్రుడు, యజ్ఞమే సకల దేవతలు ఇక యజ్ఞవేదిక దేవేంద్రుని స్వరాజ్య పీఠం. అగ్ని దేవుని సువర్ణసింహాసనం. చంద్రుని విలాస భశనం. వరుణ దేవుని విశ్రాంతి భవనం. సమస్త దేవగణాలకు దివ్యక్షేత్రం.

12/22/2015 - 23:19

వెంటనే తన ఉద్వేగం ఉపసంహరించుకొని మానుషాకారంతో నురగ వస్త్రాలతో అరుత నిండా ఆణిముత్యాల మణిహారాలతో తరంగ భుజ కంకణాలతో (కేయూరాలతో) నా ముందు ప్రత్యక్షమైనాడు. నా మన్ననలు వేడుకోవటానికి అట్లా వచ్చాడు. అప్పుడాయన ఒక గొప్ప రాజులాగా నాకు కనపడ్డాడు. ఇంతలో కాగల దేవ కార్యం నా మనసులో తళుక్కున స్ఫురించింది.

12/22/2015 - 23:17

‘‘ఇట్లాంటివి యిప్పుడు లోకం మీద మస్తుగా నడుస్తున్నయిలే ఊకో’’ అంటూ భర్తకు భిన్నంగా మాట్లాడుకొచ్చింది.
భార్య మాటలతో ఒక్కసారిగా విస్తుపోయిన జగ్గయ్య ఆమె వంక నోరెళ్ళబెట్టి చూడసాగాడు.

12/22/2015 - 23:16

క. ధరణిసురమంత్ర హోమ
స్ఫురణను వివశులయి భూరి భుజగప్రభు లొం
డొరుఁ బిలుచుచు నధికభయా
తురులై కుండాగ్నులందుఁ దొరఁగిరి పిలుచన్

12/22/2015 - 04:53

అపుడు నేను రుధిర మాంస దుర్గంధపూరితనైనాను. రక్తపంకిలనైనాను. కేశ సంస్కారం లేని రజస్వలలాగా మైలపడ్డాను. దీనురాలినైనాను. పరశురాముడప్పుడొక గొప్ప యజ్ఞం చేసి సకల ధరిత్రిని కశ్యప మహర్షికి యజ్ఞదక్షిణగా ఇచ్చాడు. అపుడు నేను కశ్యప మహర్షిని ఆశ్రయించాను. ఆయనకు మొరపెట్టుకున్నాను. నన్ను రక్షించే పాలించే క్షత్రియులంతా హతులైనారు.

12/21/2015 - 03:56

మధుకైటభులు తమ బ్రహ్మాండమైన దేహాలతో అనేక యుగ కాలాలు ఏకార్ణవంలో సుప్తి చెందారు. తరువాత వాళ్ళకు మెలకువ వచ్చింది. తమ మహాకాయాలను చూసుకొని విర్రవీగిపోయారు. మదగర్వంతో ఉద్రేకించారు. చేతులతీట తీర్చుకోవాలని తెగ ఉబలాటపడ్డారు. కన్నూ మిన్నూ కానని అతిశయంతో ఎవరితో యుద్ధం చేయాలా? అని ఆ ఏకార్ణవంలో వెతుకులాట సాగించారు.

12/20/2015 - 03:52

శ్రీమహావిష్ణువు అధిరోహించటానికి అనుకూలంగా తన మూపును వినమితం చేశాడు. శ్రీహరి గరుడారూఢుడైనాడు. విష్వక్సేనుడు మొదలైన సేనానాయకులు జయ జయధ్వానాలు చేశారు. ముని సంఘాలు హర్షాతిరేకంతో స్తుతించారు. దిక్కులు పిక్కటిల్లే సంతోష ద్వానాలు చెలరేగాయి.

12/18/2015 - 22:52

అపుడు బ్రహ్మ, తన దగ్గరకు వచ్చిన దేవతా ప్రముఖులతో కలిసి వారందరూ పాల కడలిలో శేష తల్పంపై నిద్రిస్తున్న శ్రీమన్నారాయణ మూర్తి దగ్గరకు వెళ్లారు. ఇట్లా చతుర్ముఖ పురస్సరంగా పాల సముద్ర శేషతల్పం సన్నిధికి చేరిన ఆ దేవతలంతా విష్ణుమూర్తినుద్దేశించి స్తోత్రాలు చేశారు.

12/17/2015 - 04:35

అనఘాత్మా! క్రతువులలో అగ్రపూజితుడివి నీవు. వేద పురుషుడివి నీవు. తపోయజ్ఞాలు, యజన యాజనాదులు నీవే. రాక్షస సంహారం కోసం నీవు నిమగ్నుడివైనందువల్ల మేము మా అధ్వర క్రియలన్నీ చాలించి నినే్న తలచుకుంటూ వచ్చాము. ఇపుడు నీవు విజయుడవై మాకు సాక్షాత్కరించావు. మా సేవలు, మా పూజలు స్వీకరించవలసింది అన్నారు వాళ్ళు.

12/16/2015 - 04:01

అమిత వేగంతో పరమ రభసంతో మీదికి ఉఱుకుతున్న పెద్ద పులిని నివారించలేని జింక కదుపుల్లాగా ఆ రాక్షసులు విహ్వలించిపోయారు. తత్తరపాటు చెందారు. అపుడు మహాబాహుడైన శ్రీమహావిష్ణువు తన చక్ర, గదా, ఖడ్గాలు ప్రయోగించి ఆ రాక్షసులందరినీ చీల్చి చెండాడి చంపివేశాడు.

Pages