S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 07:28

కోల్‌కతా, జనవరి 21: పశ్చిమ బెంగాల్ మూడోసారి నిర్వహించిన రెండు రోజుల బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సదస్సులో వ్యాపార, పారిశ్రామిక రంగాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులకు హామీ లభించింది. 2.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. శుక్రవారం ఇక్కడ మొదలైన ఈ సదస్సు శనివారంతో ముగియగా, పెట్టుబడుల వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

01/22/2017 - 07:27

న్యూఢిల్లీ, జనవరి 21: నెదర్లాండ్స్ ఆధారిత టెలీనా హోల్డింగ్స్‌లో అక్కడి తమ అనుబంధ విభాగం (టాటా కమ్యూనికేషన్స్ నెదర్లాండ్స్) పెట్టుబడులు పెడుతున్నట్లు టాటా కమ్యూనికేషన్స్ శనివారం తెలిపింది. అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగానే ఈ వ్యూహాత్మక పెట్టుబడులని టాటా కమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది.

01/22/2017 - 07:25

అమెరికా అండతో ప్రపంచ మార్కెట్‌లోకి క్వినోవాను తెస్తున్న బహుళజాతి సంస్థలు
కిలో ధర రూ. 1,500 ౄ సంపన్న కుటుంబాల్లో విరివిగా వాడకం
దక్షిణ భారతంలోకి పెద్ద ఎత్తున దిగుమతులు ౄ కొన్నిచోట్ల సాగు చేస్తున్న రైతులు
కిలో రూ. 50 పలికే కొర్రలతో పోల్చితే పోషకాలు అంతంతమాత్రమే
కొర్ర సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అంటున్న వ్యవసాయ శాస్తవ్రేత్తలు

01/22/2017 - 07:24

ఆదిలాబాద్, జనవరి 21: పత్తి పంటపై ఆశలు పెట్టుకుని సాగుచేసిన రైతులకు ఈసారి మార్కెట్‌లో సిరుల పంట కురుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం క్వింటాలు మద్దతు ధర 4,060 రూపాయలుగా ప్రకటించగా, అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ ఉండదని పత్తి సాగు విస్తీర్ణం తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు వ్యవసాయ శాఖ చేసిన ప్రచారం పటాపంచలైంది.

01/22/2017 - 07:24

వారాంతపు సమీక్ష

01/22/2017 - 07:18

లక్నో, జనవరి 21: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితమైన అనుచరుడిగా పేరు పొందిన అంబికా చౌదరి శనివారం బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)లో చేరారు.

01/22/2017 - 07:16

న్యూఢిల్లీ, జనవరి 21: ‘ఇతర పార్టీలు డబ్బిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వేయండి’ అంటూ గోవాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ వ్యాఖ్యలు అవినీతిని ప్రోత్సహించే విధంగా ఉన్నాయని, ఇది కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఇసి స్పష్టం చేసింది.

01/22/2017 - 07:15

న్యూఢిల్లీ, జనవరి 21: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటుకు తెరపడింది. కాంగ్రెస్ అధిక సీట్లు డిమాండ్ చేసినందుకే పొత్తు కుదరటం లేదని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించగా, ఎస్పీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించటంతో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఆగిపోయాయి.

01/22/2017 - 07:30

చెన్నై, జనవరి 21: మూడేళ్ల నిషేధం తరువాత తమిళనాట జల్లికట్టుకు రంగం సిద్ధమైంది. రాష్టప్రతి సిహెచ్ విద్యాసాగర్‌రావు శనివారం ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. దీంతో జల్లికట్టు క్రీడ మదురైలో ఆదివారం నిర్వహించనున్నారు. తమిళుల సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిన ఈ క్రీడా నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి ఒ పన్నీర్ సెల్వం శనివారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిఎం మదురైలో పర్యటించి మరీ ఏర్పాట్లు పరిశీలించారు.

01/22/2017 - 07:13

వాషింగ్టన్, జనవరి 21: శుక్రవారం ఓ వైపు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా వాషింగ్టన్‌లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరిపారు. ఆందోళనకారులు పెద్దఎత్తున రాళ్లు రువ్వడం, వాహనాలకు నిప్పుపెట్టడం లాంటి చర్యలకు పాల్పడ్డంతో పోలీసులు 200 మందికిపైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు.

Pages