S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 23:01

సంగారెడ్డి, జనవరి 22: ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలై ఎల్‌సి పత్రాలను ఆదివారం తన నివాసంలో బాధితులకు అందజేసారు.

01/22/2017 - 22:59

నిజామాబాద్, జనవరి 22: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తెరాస పాలన పట్ల అన్ని వర్గాల ప్రజల్లోనూ ఎనలేని అసంతృప్తి వ్యక్తమవుతోందని కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ 2019 కంటే ముందుగానే ఎన్నికలు నిర్వహించినా, తమ పార్టీ అధికారాన్ని దక్కించుకోవడం తథ్యమని ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తపర్చారు.

01/22/2017 - 22:59

బాన్సువాడ, జనవరి 22: తెలంగాణ రాష్ట్రంలోని గొర్రెల పెంపకందారులైన కుర్మ, గొల్ల, యాదవుల సంక్షేమం కోసం వచ్చే బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించి, పెద్దమొత్తంలో సబ్సిడీతో పంపిణీ చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బాన్సువాడ నియోజవకర్గంలోని నాలుగు మండలాల గొర్రెల పెంపకందారులు, కుర్మ, యాదవ సంఘాల సభ్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

01/22/2017 - 22:58

నిజాంసాగర్, జనవరి 22: నిజాంసాగర్ ప్రాజెక్ట్ హెడ్‌స్లూస్ జలవిద్యుత్ కేంద్రానికి అనుసంధానంగా ఉన్న జలవిద్యుత్ కేంద్రం రెండు గేట్ల ద్వారా 1750 క్యూసెక్‌ల నీటిని ప్రధాన కాలువలోనికి విడుదల చేస్తున్నామని ప్రాజెక్డ్ డిప్యూటీ ఇఇ దత్తాత్రి ఆదివారం తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు కింద యాసంగిలో రైతులు పంటలు వేసుకునేందుకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.

01/22/2017 - 22:58

నాగిరెడ్డిపేట్, జనవరి 22: తెలంగాణలోనే హరితహారం పథకంలో కామారెడ్డి జిల్లాను మొదటి స్థానంలో ఉంచుతామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని మాల్తుమ్మెద గ్రామ శివారులో గల ఫారెస్టు రెంజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని ఆయన పరిశీలించారు.

01/22/2017 - 22:57

కామారెడ్డి, జనవరి 22: వాహనాలు జాగ్రత్తగా నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందని జిల్లా ఎస్పీ శే్వత అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్శిరాములు కల్యాణ మండపంలో నిర్వహించిన 28వ భద్రత వారోత్సవాల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆటోడ్రైవర్లు, భారీ వాహన డ్రైవర్లు నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో ప్రయాణికులను ప్రాణాలను కాపాడాలన్నారు.

01/22/2017 - 22:56

భీమ్‌గల్, జనవరి 22: రైతాంగ సమస్యలను ఎజెండాగా మల్చుకుని రైతాంగ పోరాటాలను తీవ్రతరం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు కె.గంగాధర్ పిలుపునిచ్చారు. ఆదివారం భీమ్‌గల్ మండల కేంద్రంలోని ఎఐకెఎంఎస్ కార్యాలయంలో ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ఎస్.సురేష్ అధ్యక్షతన డివిజన్ స్థాయి సమావేశం జరిగింది.

01/22/2017 - 22:55

నల్లగొండ, జనవరి 22: ఉపాధి హామీ పథకం లక్ష్యాల సాధనలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు సమర్ధవంతంగా పనిచేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. ఆదివారం టిటిడిసిలో నిర్వహించిన ఫీల్డ్, టెక్నికల్ అసిసెంట్ల శిక్షణా సమావేశంలో ఆయన మాట్లాడుతు ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు వెంటనే చేసేలా చొరవ తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయి పనులపై సిబ్బంది సరైన అవగాహాన పెంపొందించుకోవాలన్నారు.

01/22/2017 - 22:54

దేవరకొండ, జనవరి 22: జిల్లా కలెక్టర్ చైర్మెన్‌గా వ్యవహరించే టిబి విభాగంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. చింతపల్లి టిబి యూనిట్ కింద ఉన్న పది మండలాల్లో టిబి రోగులను గుర్తించిన ఆశ వర్కర్లకు పారితోషికం డబ్బులు ఇవ్వకుండా అక్కడ పని చేసే కాంట్రాక్ట్ సిబ్బంది బినామీ పేర్లను ఆశవర్కర్లుగా చూపించి పెద్ద మొత్తంలో డబ్బు స్వాహా చేశారు.

01/22/2017 - 22:53

యాదగిరిగుట్ట రూరల్, జనవరి 22: ప్రాచీన పుణ్యక్షేత్రమైన యాదాద్రిని ప్రభుత్వం ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చి దిద్దటం హర్షనీయమని మాజీ తమిళనాడు గవర్నర్ కొనిజేటి రోశయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మైలార్‌గూడెంలో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు.

Pages