S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2017 - 22:13

సర్వ ప్రాణికోటి జీవనాధారం ఆహారమే! మనలోని ఆకలిని చల్లబరిచి, శరీరంతోపాటు పంచ ప్రాణాలకూ ఆధారమై, పంచభూతాల సాక్షిగా శక్తిని సమకూర్చే అన్నం సృష్టి యజ్ఞానికే ఆలంబన. ఈ ఆహారం వల్లనే మనిషిలో సత్వరాజస తామస గుణాలు ఏర్పడుతాయని అంటారు.

01/22/2017 - 22:09

తొమ్మిదేళ్ల విరామం అనంతరం తాజాగా 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ సంక్రాంతికి విడుదలై భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాతో మళ్లీ మెగాస్టార్ తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. పది రోజుల్లో 100 కోట్ల మార్కెట్‌ను క్రాస్ చేశాక జోరు మీదున్న చిరు ఇపుడు తన 151వ చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు.

01/22/2017 - 22:08

‘అ ఆ’ సినిమాతో కమర్షియల్ విజయాన్ని అందుకుని, 50 కోట్ల క్లబ్‌లో చేరాడు యువ హీరో నితిన్. ఆ సినిమా తర్వాత ఆచితూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తున్నాడు. విభిన్నమైన కథలతో సినిమాలు చేసేందుకు డిసైడైన నితిన్ ప్రస్తుతం అను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. పాతబస్తీకి చెందిన మిడిల్ క్లాస్ కుర్రాడిగా సరికొత్త గెటప్‌లో నితిన్ కనిపించనున్నాడు.

01/22/2017 - 21:01

నవదీప్, కావ్యాశెట్టి జంటగా ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో లెజెండ్ పిక్చర్స్ పతాకంపై రమేష్‌బాబు కొప్పుల నిర్మిస్తున్న చిత్రం ‘నటుడు’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలవుతున్న సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడుతూ, ‘ఈ చిత్రం నటుడిగా నా కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది. అన్నిరకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు.

01/22/2017 - 20:59

ఈమధ్య సమంతకు టాలీవుడ్‌లో అవకాశాలు బొత్తిగా రావడం లేదు. కాబోయే భర్త నాగచైతన్యతో చెట్టపట్టాలు వేసుకొని విదేశాల్లో షికార్లు చేస్తోంది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంతకు ఈ మధ్య సినిమా అవకాశాలు రాకపోవడం ఏంటనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అక్కినేని కుటుంబానికి కోడలు అవుతోందన్న కారణంగానా? లేక మరే కారణమో గానీ సినిమాలు మాత్రం చేతిలో లేవు.

01/22/2017 - 20:55

సూర్య, అనుష్క, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సింగం-3’. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా వస్తున్న సింగం-3 భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ అందిస్తున్నారు.

01/22/2017 - 20:53

దక్షిణాదిలో స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకుని, యాక్షన్ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు అడపాదడపా దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యే సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టిన ఆయన మరోసారి దర్శకత్వం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈసారి యాక్షన్ సినిమాతో కాకుండా ప్యూర్ లవ్ స్టోరీతో సినిమా చేస్తాడట.

01/22/2017 - 20:50

జి.ఆర్.కె. ఫిలిమ్స్ పతాకంపై గరళకంఠ మద్దేటి శ్రీనివాస్ దర్శకత్వంలో డికొండ దుష్యంత్‌కుమార్, జి.రామకృష్ణ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం గీతాపురి కాలనీ. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. పాటల రచయిత చంద్రబోస్ తొలి సీడీని విడుదల చేశారు.

01/22/2017 - 20:49

రాహుల్, మహిమా మఖ్వానా జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై రూపొందుతున్న చిత్రం వెంకటాపురం. ఇటీవలే సెకండ్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. హ్యాపీడేస్‌లో టైసన్ పాత్రలో నటించిన రాహుల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా అతనికి భిన్నమైన ఇమేజ్‌ని తీసుకురానుంది.

01/22/2017 - 20:47

ఒంపుసొంపులు తెరపై ప్రదర్శించమంటే ఎంతైనా చేయగలం. నటన అంటేనే కొంచెం వెనకాముందూ ఆలోచించాలి. ఎందుకంటే నటనంటే ఏంటో నాకు తెలుసు అంటూ చెబుతోంది సన్నీలియోన్. హాట్ హాట్ అందాలతో బాలీవుడ్‌లో కాసుల వర్షం కురిపిస్తున్న ఈ భామ ‘నటించే సత్తా ఉన్న పాత్రలు’ కావాలని కోరుకుంటోంది. ది డర్టీ పిక్చర్ లాంటి సినిమా చేయాలని తనకూ ఉందని అంటోంది.

Pages