S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 00:14

కరీంనగర్ టౌన్, జనవరి 20: కరీంనగర్ నగరంలో ఈనెల 27 నుండి సెటప్ బాక్స్‌లు ఉన్నవారికే కేబుల్ టివి ప్రసారాలు వస్తాయని జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కేబుల్ టివి ప్రసారాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

01/21/2017 - 00:13

ముకరంపుర (కరీంనగర్), జనవరి 20: నవసమాజ నిర్మాణంలో ఓటు హ క్కు కీలకమైనదని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ యువతకు తెలిపారు. శుక్రవారం యువజన సంఘాల స మితి ఆధ్వర్యంలో ఈనెల 25న జాతీ య ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఓటు హక్కు-యువత హక్కు’ అనే నినాదంతో ప్రచురించిన గోడ ప్ర తి పోస్టర్‌ను కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.

01/21/2017 - 00:13

గోదావరిఖని, జనవరి 20: సింగరేణి మేడిపల్లి ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్‌తో మా కాలనీకి ముంపు ఉందన్న పట్టించుకోరే... మా బతుకులంటే అంత నిర్లక్ష్యమా... సురక్షిత ప్రాంతానికి తరలిస్తారా... లేక చావమంటారా... ఏదో ఒక్కటి తేల్చి చె ప్పాలంటూ... అంతర్గాం మండలం లింగపూర్ దళిత కాలనీ కుటుంబాలు సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్టు ముందు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగుతోంది.

01/21/2017 - 00:12

కరీంనగర్, జనవరి 20: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బంగారు తెలంగా ణ చేస్తానని ఎన్నికల్లో అనేక హామీలి చ్చి వాటిని అమలుపర్చలేని కెసిఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.

01/21/2017 - 00:11

లక్సెట్టిపేట, జనవరి 20: రోడ్డు భద్రత నిబంధనలు తప్పకుండా పాటించినట్లయితే ప్రతి కుటుంబం క్షేమంగా ఉంటుందని జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య సూచించారు. 28వ జాతీయ భద్రత వారోత్సవాల సందర్బంగా పట్టణంలోని ప్రైవేట్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

01/21/2017 - 00:10

ఇచ్చోడ,జనవరి 20: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వౌలిక సమస్యలు పరిష్కరించడానికి గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అన్నారు. శుక్రవారం బజార్‌హత్నూర్ మండలం జాతర్ల గ్రామంలో జరిగిన గ్రామదర్శినిలో జిల్లా కలెక్టర్‌తో పాటు పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్‌లు పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

01/21/2017 - 00:09

ఇచ్చోడ,జనవరి 20: ఆయా ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లను వెంటనే కార్మికులుగా గుర్తించడంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

01/21/2017 - 00:09

ఆసిఫాబాద్, జనవరి 20: వాహనాలు తోలే సమయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించక తప్పదని కుమ్రం భీం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. జాతీయ రోడ్డుబద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని హెల్మెట్ల వాడకంపై శుక్రవారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుండి పోలీసులు చేపట్టిన మోటార్ సైకిల్ ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు.

01/21/2017 - 00:07

వినాయక్‌నగర్, జనవరి 20: వాహనదారుల్లో మార్పు వచ్చినప్పుడే రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చని నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో 28వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా యువతకు, వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

01/21/2017 - 00:07

కంఠేశ్వర్, జనవరి 20: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం తదితర పథకాల్లో పని చేస్తున్న కార్మికులు శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరిపారు.

Pages