S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 00:47

కందుకూరు, జనవరి 20: రాష్ట్రప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరు కారుస్తోందని వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలోని పిసిపల్లి మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్థులను ఆయన పరామర్శించారు.

01/21/2017 - 00:46

ఒంగోలు, జనవరి 20 : జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా ప్రకటించేందుకు కమిటీ తన వంతు కృషి చేస్తుందని రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరం హాలులో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఏడు జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

01/21/2017 - 00:46

పొదిలి, జనవరి 20 : పొదిలి పట్టణంలో ఒకరికి సైన్వ్ ఫ్లూ సోకడం కలకలం రేపింది. పొదిలి పట్టణంలో నివసిస్తున్న మహిళా కండెక్టర్ భర్త షేక్ మస్తాన్‌వలి వృత్తిరీత్యా లారీ డ్రైవర్. కాగా గత నాలుగురోజుల క్రితం అతను ఆకస్మికంగా అస్వస్థతకు గురి కావడంతో బంధువులు అతన్ని చికిత్స నిమిత్తం ఒంగోలుకు తరలించగా వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు సిఫార్సు చేశారు.

01/21/2017 - 00:45

ఒంగోలు అర్బన్,జనవరి 20:కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ప్రజ్యావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, ప్రజాసమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలం చెందాయని రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లాకాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్రాల్లో పరిపాలన పూర్తిగా గాడితప్పిందన్నారు.

01/21/2017 - 00:44

శ్రీకాకుళం, జనవరి 20: వంశధార, తోటపల్లి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకొని జూన్ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఉపాధి కార్మిక శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ నాటికి నీరు విడుదల చేసి రైతుల సాగునీటి కష్టాలు అధిగమించాలన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించారు.

01/21/2017 - 00:43

శ్రీకాకుళం(రూరల్), జనవరి 20: స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వ పథకాలకు బడ్జెట్‌లో నిధులు పెంచాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం జిల్లాలో నలుమూలల నుండి స్కీమ్ వర్కర్లు సమ్మెలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీ ఏడురోడ్ల జంక్షన్, పాతబస్‌స్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది.

01/21/2017 - 00:43

పలాస, జనవరి 20: బెంగుళూరు నుంచి బీహార్‌కు రైలులో ప్రయాణిస్తున్న తలాత్ పర్వాంగ్ ఆడ,మగ శిశువులకు జన్మనిచ్చింది. రైలు పలాస రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి ముందే ఆమెకు పురిటినొప్పులు రావడంతో ప్రయాణీకులు సహకరించడంతో రైలులోనే పండంటి కవలలకు జన్మించింది.

01/21/2017 - 00:42

సారవకోట, జనవరి 20: గ్రామాలలో విద్యుత్ వైర్లు క్రిందకు వేలాడుతూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని, విరిగిపోయిన స్తంభాలు ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయని కూర్మనాథపురం సర్పంచ్ సుధాకర్, ఎంపిటిసి రాము విద్యుత్ అధికారులపై ధ్వజమెత్తారు. శుక్రవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో విద్యుత్ శాఖ పనితీరుపై వీరు నిలదీశారు.

01/21/2017 - 00:42

ఎచ్చెర్ల, జనవరి 20: విధులే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజల్లో మంచి గుర్తింపుఇస్తాయని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ స్పష్టంచేశారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపిడిఓగా విధులు నిర్వహించి డుమా ఏపిడిగా డెపిటేషన్ బదిలీ అయిన పంచాది రాధ అభినందన సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగులకు అంకితభావం తప్పనిసరి అన్నారు.

01/21/2017 - 00:41

గార, జనవరి 20: యువతకు ఓటు హక్కు వినియోగం అంశాలపై అవగాహన తప్పనిసరని ఆర్డీవో బలివాడ దయానిధి స్పష్టం చేశారు. మండలం పోర్టుకళింగపట్నం(కె.మత్స్యలేశం)పంచాయతీ పరిధిలోగల కోకావారి ప్రభుత్వ జూనియర్, ఉన్నత పాఠశాలలతోపాటు శ్రీకూర్మంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థి, విద్యార్థ్ధులకు ఆయా పాఠశాలల ఉపాధ్యాయుల సమక్షంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన నిర్వహించారు.

Pages