S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/21/2017 - 00:21

జడ్చర్ల, జనవరి 20: ద్విచక్ర వాహన చోదకులు తప్పని సరిగ్గా హెల్మేట్లు ధరించాలని మహబూబ్ నగర్ డిఎస్పీ బాస్కర్ తెలిపారు. శుక్రవారం రోడ్డు భధ్రత వారోత్సవాలను పురస్కరించుకొని 44 వనెంబర్ జాతీయ రహాదారిపై కావేరమ్మపేట దగ్గర వాహన చోదకులకు సేఫ్టీ డ్రైవింగ్ పై అవగాహాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

01/21/2017 - 00:20

జడ్చర్ల, జనవరి 20: కార్పోరేట్ శక్తుల నుండి రైతులను ప్రభుత్వం కాపాడాలని రాజకీయ ఐకాస చైర్మన్ ప్రొఫేసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్థానిక యజేష్ విరాట్ రీజేన్సీలో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కార్పోరేట్ శక్తులు ప్రవేశించడం వల్ల రైతుల ఉనికికి ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

01/21/2017 - 00:20

మానవపాడు, జనవరి 20: ప్రభుత్వాలు కూలీలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ఉపాధిహామీ పధకం అమలు చేయటంలో నిర్లక్షం తగదని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌షైని అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపిడిఓ సమావేశ మందిరంలో అలంపూర్, మానవపాడు, వడ్డెపల్లి, ఇటిక్యాల మండలాల పరిధిలోని ఎంపిడిఓలు, టిఏలతో ఉపాధి హామీ పధకం పనితీరుపై సమావేశం నిర్వహించారు.

01/21/2017 - 00:19

కొత్తకోట, జనవరి 20: డ్రైవర్లకు, ప్రయాణికులకు ఇంటికి భద్రంగా చేరాలని వనపర్తి డిఎస్పీ జోగుల చెన్నయ్య పూలు ఇచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని మధర్ థెరిస్సా జంక్షన్ వద్ద 28వ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను ప్రయాణికులకు ఆయన పలు సూచనలు చేశారు.

01/21/2017 - 00:19

జడ్చర్ల, జనవరి 20: గ్యాస్ పొయ్యి వెలిగించి టీ వేడి చేయబోయి ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం జడ్చర్ల మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనకు సంబందించిన వివరాలు ఎస్సై లక్ష్మినర్సింహా కథనం మేరకు ఇలా ఉన్నాయి.

01/21/2017 - 00:17

వరంగల్, జనవరి 20: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రతి మూడు కిలోమీటర్ల పరిధిలో మూడువేల జనాభా ఉన్న గ్రామాల్లో పోస్ట్ఫాసుల ఏర్పాటు చేయాలనే ఆలోచన కేంద్రానికి ఉందని మహబూబాబాద్ ఎంపి ప్రొఫెసర్ సీతారాంనాయక్ తెలిపారు. ఈ విషయంలో మండల పరిషత్ అధ్యక్షులు ప్రతిపాదనలు పంపిస్తే అవసరమైన ప్రాంతాల్లో పోస్ట్ఫాసుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.

01/21/2017 - 00:17

వడ్డేపల్లి, జనవరి 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధ్వర్యంలో నడుస్తున్న వివిధ పథకాలలో పనిచేస్తున్న కార్మికులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి యాదా నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

01/21/2017 - 00:16

నక్కలగుట్ట, జనవరి 20: ప్రపంచంలోనే అత్యుత్తమం మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అని, భారత ప్రజలకు ప్రాతినిథ్యం వహించే ఉన్నతమైన సభ లోక్‌సభ అని ఎంపి సీతారాం నాయక్ అన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రాజనీతిశాస్త్ర విభాగం అధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు.

01/21/2017 - 00:16

మహబూబాబాద్, జనవరి 20: పెద్దనోట్ల రద్దు, విద్యారంగంపట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోర్టు సెంటర్‌లో ప్రదాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

01/21/2017 - 00:14

వీణవంక, జనవరి 20: మండలంలోని ఘన్ముక్ల గ్రామం వద్దగల మోడల్ స్కూళ్లో శుక్రవారం కరీంనగర్ డిఆర్‌ఓ ఆయేషా మస్రత్ ఖానం ఓటు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహశీల్దార్ బావుసింగ్, ఎంపిడిఓ భాస్కర్, ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్ల ధర్నా

Pages