S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 01:29

విజయనగరం, ఏప్రిల్ 28: కల్యాణాలు, గృహప్రవేశాలు, గృహ నిర్మాణాలు ఇతర శుభకార్యక్రమాలకు శుక్రవారంతో తెరపడనుంది. శుక్రవౌడ్యమి ఈనెల 30నుంచి ప్రారంభమవుతుండటం, ఆ తరువాత ఆషాడమాసం వస్తున్న నేపథ్యంలో 29వ తేదీ ఒక్కటే చివర శుభముహుర్తంగా వేదపండితులు నిర్ణయించారు.

04/29/2016 - 01:28

విజయనగరం, ఏప్రిల్ 28: జిల్లాలో ఎంసెట్ 2016 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసారు. ఎంసెట్ పరీక్ష శుక్రవారం జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు ఏడు కేంద్రాలు విద్యార్థులకు ఏర్పాటు చేసారు. 6,502మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నారు.

04/29/2016 - 01:28

విజయనగరం (్ఫర్టు) ఏప్రిల్ 28: పట్టణంలో రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేసేందుకు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. పట్టణంలో కొత్తపేట నీళ్లట్యాంకు పరిధిలో ఉన్న 16 వార్డులలో మూడురోజులకు ఒకసారి మంచినీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు.

04/29/2016 - 01:28

మెరకముడిదాం, ఏప్రిల్ 28: రాష్ట్రంలో సొంత ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సామూహిక ఎన్‌టిఆర్ గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. గురువారం మండలంలో గల సాతాంవలస, గరుగుబిల్లిలో ఎన్‌టిఆర్ రెండు పడకల గృహ నిర్మాణాలకు ఆమె శంకుస్థాపన చేసారు.

04/29/2016 - 01:27

గజపతినగరం, ఏప్రిల్ 28: జిల్లాలోని మద్యం దుకాణదారులు మే 1 నుంచి ఈ-బిల్లు విధానాన్ని అమలు చేయాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటిండెంట్ ఎ శంభు ప్రసాద్ ఆదేశించారు. గురువారం స్థానిక ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో తనను కలసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు ద్వారా దీనిని అమలు చేయడానికి చర్యలు చేపట్టామని తెలిపారు.

04/29/2016 - 01:27

గజపతినగరం, ఏప్రిల్ 28: ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నెలకు 30 డెలివరీల చేయాలన్న లక్ష్యమని సిహెచ్‌ఎన్‌సి డిప్యూటీ డిఎం అండ్ హెచ్‌ఓ ఎం చామంతి ఆదేశించారు. గురువారం స్థానిక సిహెచ్ ఎన్‌సిలో ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సీనియర్ అసిస్టెంట్లుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పిహెచ్‌సిలో 30 డెలివరీలు కావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని స్పష్టం చేసారు.

04/29/2016 - 01:26

విజయనగరం, ఏప్రిల్ 28: జిల్లాలోని భోగాపురం మండల కేంద్ర సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని చంపావతి నదీ పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుకను కొందరు వ్యక్తులు తవ్వి జాతీయ రహదారి సమీపంలోని ప్రాంతాలలో నిల్వ చేస్తున్నారు. ఈ ఇసుకను సమీపంలోని విశాఖ నగరానికి తరలించి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.

04/29/2016 - 01:26

విజయనగరం, ఏప్రిల్ 28: జిల్లాలోని ఎస్.కోట, లక్కవరపుకోట, పెదమానాపురం పోలీసు స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడిన నేరాలకు సంబంధించి సొత్తును సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. సిసిఎస్ డిఎస్పీ చక్రవర్తి ఆదేశాలతో సి ఐ నర్సింహమూర్తి, సిబ్బంది ఎస్.కోట ఎస్సై రవికుమార్ సిబ్బంది సంయుక్తంగా నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.

04/29/2016 - 01:25

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 28: తూర్పుకాపుల సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని పట్టణ తూర్పు కాపు సంఘ అధ్యక్షుడు గొర్లె వెంకటరమణ ఆరోపించారు.

04/29/2016 - 01:25

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 28: పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్థానిక బహుళార్థక పశువైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంవిఎ నర్సింహులు అన్నారు. ప్రపంచ పశువైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానికంగా అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నర్సింహులు మాట్లాడుతూ వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మంది పాడిపరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

Pages