S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 20:15

నేటి ఆధునిక యుగంలో పనిఒత్తిడి కారణంగా వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాలవారూ మానసిక వేదనకు లోనవుతున్నారు. జీవనశైలిలో వేగం పెరిగినందున పనిలో ఒత్తిడి సర్వసాధారణమైంది. పనిలో నైపుణ్యం చూపాలన్నా, కొత్త బాధ్యతలతో సమర్ధత చాటాలన్నా ఏదో ఒక రూపంలో ఒత్తిడిని ఎదుర్కొనక తప్పదు. కొన్ని సులభ పద్ధతులను పాటిస్తే పనిఒత్తిడి నుంచి ఉపశమనం పొందే వీలుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

01/22/2016 - 20:13

ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి తెరతీస్తూ, వార్తల్లో ‘సంచలన వ్యక్తి’గా నిలిచే బాలీవుడ్ శృంగార భామ పూనమ్ పాండే ఇపుడు- ‘మహిళల పట్ల మర్యాద చూపే పద్ధతి ఇదేనా..?’ అంటూ నిరసన గళం విప్పింది. అభిమానుల కోసం తన అర్ధనగ్నచిత్రాలను, వీడియోలను తరచూ ‘ట్విట్టర్’లో పోస్ట్ చేసే ఈ ముద్దుగుమ్మ తన మనసు గాయపడిందని తాజాగా ఓ టీవీ చానల్‌పై విరుచుకుపడడం సంచలనం సృష్టించింది.

01/22/2016 - 19:54

సిరియా: సిరియా నుండి గ్రీస్ వలస వెడుతున్న ప్రజలు సముద్రంలో ప్రాణాలు కోల్పోతున్నారు. చలిగాలులు, పడవ ప్రమాదాలతో వారు చనిపోతున్నారు. తాజాగా జరిగిన రెండు పడవ ప్రమాదాల్లో 42మంది మరణించారు. గ్రీస్‌లోని కలోలిమ్నస్ ద్వీపంలో సముద్రంలో పడవ మునిగి 34మంది మరణించగా వారిలో 11మంది చిన్నారులున్నారు. ఫార్మాకోనిస్ దీవిలో మరో పడవ మునిగిపోగా 8మంది ప్రాణాలుకోల్పోయారు.

01/22/2016 - 19:53

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ కుటుంబానికి 8 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా యాజమాన్యం ప్రకటించింది. సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఐదుగురు విద్యార్థులలో రోహిత్ ఆత్మహత్య చేసుకోగా మిగిలిన నలుగురూ ఇంకా దీక్షలు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రోహిత్ ఆత్మహత్య దర్యాప్తు ముమ్మరం చేశారు.

01/22/2016 - 16:45

దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో పలు నగరాల్లో నిఘా బృందాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. దిల్లీ, ముంబయి, హైదరాబాద్, అహ్మదాబాద్,బెంగళూరు, చండీగఢ్, కోల్‌కత తదితర నగరాల్లో సోదాలు చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు నగరాల్లో కొందరిని అరెస్టు చేశారు.

01/22/2016 - 16:45

లక్నో: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఉదంతం తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ ఘటనపై రాజకీయాలు అనవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శుక్రవారం ఇక్కడ అంబేద్కర్ వర్సిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ, రోహిత్ తల్లిని ఓదార్చవలసిన సమయం ఇది అన్నారు. రోహిత్ మృతితో దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు.

01/22/2016 - 12:13

నెల్లూరు: వాస్తవాలు తెలుసుకోకుండా వైకాపా అధినేత జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని ఎ.పి. డిప్యూటీ సిఎం కె.ఇ.కృష్ణమూర్తి విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అరెస్టుతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు.

01/22/2016 - 12:13

హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్‌సియు నెలకొన్న పరిస్థితులకు నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రాజ్‌భవన్ ముట్టడికి యత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

01/22/2016 - 12:12

కైరో: ఈజిప్టులో ప్రఖ్యాతి చెందిన గిజా పిరమిడ్స్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన బాంబు పేలుడులో 4గురు పోలీసులు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తూండగా పేలుడు సంభవించింది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

01/22/2016 - 12:12

నిజామాబాద్: నవీపేట మండలం సిర్లపల్లి వద్ద గురువారం అర్ధరాత్రి ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు కూలీలు మరణించారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. రాత్రివేళ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నందున తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

Pages