S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 05:12

హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామిక వేత్తలు, కార్మికులు సంతోషంగా ఉన్నారని వారి మద్దతు టిఆర్‌ఎస్‌కేనని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. నగరంలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో పారిశ్రామిక వేత్తలు, కార్మికులు గురువారం సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సభలో కెటిఆర్ మాట్లాడుతూ, గతంలో హైదరాబాద్‌లో విద్యుత్ కోతలు నిత్యకృత్యంగా ఉండేవని తెలిపారు.

01/22/2016 - 05:04

చుండూరు, జనవరి 21: త్రిదండి శ్రీమన్నారాయణ పెద్దజీయర్ స్వామి పరమ పదోత్సవాన్ని గురువారం నడిగడ్డపాలెంలోని శ్రీ వాసుదాసాశ్రమంలో ఘనంగా జరిపారు. ఈ నేపథ్యంలో త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో గురువారం ఆష్టోత్తర శత నామార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 కలశాలతో శ్రీ జగద్గురు రామానుజ చార్యుల నిలువెత్తు విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు.

01/22/2016 - 05:02

గుంటూరు (కొత్తపేట), జనవరి 21: హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ బలవన్మరణానికి దారితీసిన పరిస్థితులపై హైకోర్టు మాజీ న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

01/22/2016 - 05:02

గుంటూరు (కొత్తపేట), జనవరి 21: తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్టర్రోడ్డు రవాణా సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పద్మాకర్ పేర్కొన్నారు.

01/22/2016 - 02:47

తాడేపల్లి, జనవరి 21: రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతుల పొలాల్లోనుండే ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ రూపొందించిందంటే రైతులను టార్గెట్ చేయటమేనని మంగళగిరి ఎంఎల్‌ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్లాన్‌ని నిరసిస్తూ గురువారం రైతులతోకలిసి పొలం పనిచేసి ఆయన నిరసన తెలిపారు.

01/22/2016 - 02:46

నాగార్జున యూనివర్సిటీ, జనవరి 21: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ చక్రవర్తి ఆత్మహత్యకు కారకులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గురువారం వారు భారీ ర్యాలీ తీశారు.

01/22/2016 - 02:45

గుంటూరు, జనవరి 21: రాష్ట్రప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే సంకల్పంతో 5,800 కోట్ల రూపాయలను వ్యయం చేయనుందని వైద్య, ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. స్థానిక మెడికల్ ఆసోసియేషన్ హాల్‌లో గురువారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మంత్రి కామినేని విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు.

01/22/2016 - 02:25

కాకినాడ, జనవరి 21: నిరుపేద రోగులు, వారి వెంట వచ్చే సహాయకుల సౌకర్యార్థం తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పది రూపాయలకే భోజనం పథకం ప్రారంభించారు. టచ్‌స్టోన్ ఛారిటీస్, అక్షయపాత్ర ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించే ఈ పథకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం ప్రారంభించారు.

01/22/2016 - 02:24

కడప,జనవరి 21: తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఓ శిశువుకు శాపంగా మారాయి. సాక్షాత్తు న్యాయమూర్తి ఎదుటే అభంశుభం తెలియని చిన్నారిని తమకు సంబంధం లేదంటూ తల్లిదండ్రులు వదిలివెళ్లిపోయారు. విడాకుల కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఈలోగా భరణంగా నెలకు 3వేల 500 రూపాయలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఇందుకు సంతృప్తిచెందని బాలిక తల్లి ఎన్.విజయభారతి జడ్జి ఎదుటే బిడ్డను వదిలివెళ్లింది.

01/22/2016 - 02:23

నెల్లూరు/గూడూరు, జనవరి 21: రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించిన ప్రజలనుంచి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి అధికారులకు సూచించారు.

Pages