S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 07:43

హైదరాబాద్, జనవరి 21: మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం మధ్యాహ్నంతో ముగిసింది. మొత్తం 150 డివిజన్లలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారన్న తుది జాబితా దాదాపు ఖరారైన నేపథ్యంలో అధికార టిఆర్‌ఎస్, విపక్షాలైన కాంగ్రెస్, టిడిపి, బిజెపి, మజ్లిస్ పార్టీలు ఇక ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు నేటినుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.

01/22/2016 - 07:39

వికారాబాద్, జనవరి 21: నేరస్థులపై నిఘా నిమిత్తం సమగ్ర సర్వే చేపట్టాలని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డిసెంబర్ మాస నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ రక్షక్ వాహనాల డ్రైవర్లకు, పోలీసు సిబ్బందికి నైపుణ్య మెరుగుకు శిక్షణ నిర్వహిస్తామని అన్నారు.

01/22/2016 - 07:37

హైదరాబాద్, జనవరి 21: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు చక్కటి సమన్వయంతో పనిచేస్తున్నాయని జిహెచ్‌ఎంసి కమిషనర్, ఎన్నికల అథారిటి డా.బి.జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. ఒకవైపు ఫిబ్రవరి 2న జరగనున్న పోలింగ్‌కు ఏర్పాట్లు చేసుకుంటూనే మరోవైపు ఎన్నికల కోడ్ అమలును పకడ్బందీగా అమలు చేస్తున్నామని వివరించారు.

01/22/2016 - 07:26

మెల్బోర్న్, జనవరి 21: అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైరవుతున్న ఆస్ట్రేలియా సీనియర్ టెన్నిస్ ఆటగాడు లేటన్ హెవిట్ గురువారం ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్ల పర్యంతమవుతూ అభిమానులకు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో డేవిడ్ ఫెరర్‌తో చివరి వరకూ పోరాటం సాగించి, 6-2, 6-4, 6-4 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.

01/22/2016 - 05:42

నెల్లూరు, జనవరి 21: రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు వచ్చిన వెంటనే స్పందించి వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

01/22/2016 - 05:42

ఆత్మకూరు, జనవరి 21: కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సల వ్యవహారం జిల్లాలో కుంటుపడుతోంది. గత కొనే్నళ్లుగా జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశిస్తున్న లక్ష్యం ఏటేటా తగ్గిపోతుండటం గమనార్హం. మూడేళ్ల క్రితం వరకు 24 వేల శస్తచ్రికిత్సలు కాగా, ఇరవై వేలకు మించి శస్తచ్రికిత్సలు చేయలేకపోతూ వచ్చారు. దీంతో ప్రభుత్వమే ఆ లక్ష్యాన్ని 20,900గా తగ్గుముఖం పట్టించింది. అయినా దిగదుడుపు దుస్థితే దాపురిస్తోంది.

01/22/2016 - 05:39

శ్రీశైలం, జనవరి 21: దేవస్థానంకు వచ్చే భక్తుల వసతి, దర్శన విషయాల్లో ఎటువంటి లోటుపాట్లు రానివ్వకుండా చూడాలని రాష్ట్ర శాసనసభ వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి, సభ్యులు రమణమూర్తి, పీరుకుంట విశ్వప్రసాదరావు అన్నారు. గురువారం శ్రీశైల మల్ల దర్శనార్థం వచ్చిన బిసి సంక్షేమ కమిటీ అధ్యక్షులు, సభ్యులు శ్రీశైలం దేవస్థానం పరిపాలన సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

01/22/2016 - 05:37

ఆదోని, జనవరి 21: చౌక దుకాణాల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందించి డీలర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇపాస్ మిషన్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. అయినప్పటికీ డీలర్లు తమ చేతివాటాన్ని చూపిస్తున్నారు. తూకాల్లో పెద్ద ఎత్తున సరుకుల దోపిడీ కొనసాగిస్తూ ప్రజలకు డీలర్లు శఠగోపం పెడుతున్నారు.

01/22/2016 - 05:34

రాజమహేంద్రవరం, జనవరి 21: రాజమహేంద్రవరంలోని దానవాయిపేట, ప్రకాష్‌నగర్, ఎవి అప్పారావురోడ్డు, జెఎన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సెల్లార్ల కూల్చివేత తప్పదని కమిషనర్ వి విజయరామరాజు స్పష్టం చేశారు. గురువారం తన చాంబర్‌లో జరిగిన అఖిలపక్ష నాయకులతో ఈవిషయాన్ని స్పష్టం చేశారు. సెల్లార్ల కూల్చివేత, మెయిన్‌రోడ్డు విస్తరణపై అఖిలపక్ష నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు.

01/22/2016 - 05:33

కాకినాడ, జనవరి 21: పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ, పునరావాస పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ సంబంధిత శాఖల అధికారులను కోరారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో గురువారం పోలవరం ప్రాజెక్ట్ పునరావాస పనుల ప్రగతిపై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages