S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/22/2016 - 12:11

దిల్లీ: దిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టడంతో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. దీంతో రోడ్లపై వాహనాలే కాక రైళ్లు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. దిల్లీ ఎయిర్‌పోర్టులో 11 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 25 రైళ్లు ఆలస్యంగా బయల్దేరాయి.

01/22/2016 - 12:11

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీని వారణాసిలో కలిసేందుకు వికలాంగులు ఓ బస్సులో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డుపక్క విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం వారణాసి పర్యటనలో మోదీని కలిసేందుకు వీరంతా బస్సులో బయలుదేరారు.

01/22/2016 - 12:10

ముంబై: రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపై గురువారం అర్ధరాత్రి కారు దూసుకుపోగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలో జరిగిన ఈ ఘటనకు కారణమైన కారు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. కారును సంఘటన స్థలంలో వదిలేసి వెళ్లిన డ్రైవర్‌ను కొద్ది గంటల సమయంలోనే పోలీసులు అరెస్టు చేశారు.

01/22/2016 - 12:10

కడప: పొద్దుటూరు ఆటో నగర్‌లో బాణసంచా నిల్వచేసిన ఓ గోడౌన్‌లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని, సుమారు 8 లక్షల రూపాయల మేరకు ఆస్తినష్టం జరిగిందని పోలీసులు తెలిపారు.

01/22/2016 - 12:09

గుంటూరు: నగర శివారులోని లాం ఫారమ్ సమీపంలో శుక్రవారం ఉదయం అతి వేగంగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

01/22/2016 - 12:09

గుంటూరు: ఎ.పి. వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం మోకీలు శస్తచ్రికిత్స చేయించుకున్నారు. కార్పొరేట్ ఆస్పత్రికి బదులు ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడం గమనార్హం. హైదరాబాద్ కేర్ ఆస్పత్రి వైద్యులు, తిరుపతి, గుంటూరుకు చెందిన ఎముకల వైద్య నిపుణులు శస్తచ్రికిత్సలో పాల్గొన్నారు.

01/22/2016 - 12:08

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం అధికారులు సోదాలు చేసి ఓ వ్యక్తి నుంచి 1.5 కోట్ల రూపాయల విలువచేసే భారత, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆ నిందితుడు భారీ కరెన్సీతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా తనిఖీ చేసి పట్టుకున్నారు.

01/22/2016 - 07:53

హైదరాబాద్, జనవరి 21: ఒకప్పుడు ఎన్నికలంటే రోజుల తరబడి ప్రక్రియ..ఇందులో ముఖ్యంగా పోలింగ్ ముగిసిన తర్వాత జరిగే ఓట్ల లెక్కింపు సైతం రోజుల తరబడి జరిగేది. కానీ మన దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పోలింగ్, ఓట్ల లెక్కింపు అనే ఎన్నికల్లోని రెండు కీలకమైన ప్రక్రియలు గంటల్లోనే ముగిసిపోతున్నాయి.

01/22/2016 - 07:52

హైదరాబాద్, జనవరి 21:జిహెచ్‌ఎంసి ఎన్నికలు ప్రధాన రాజకీయపార్టీల్లో చిచ్చుపెట్టాయి. ఏ పార్టీలో చూసినా అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని టికెట్ల కోసం ప్రయత్నాలు చేసిన ఆశావాహుల్లో కొందరికి బి ఫారాలు దక్కకపోవటంతో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.

01/22/2016 - 07:46

గచ్చిబౌలి, జనవరి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థుల ఆందోళనకు స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు పత్రికలకు మీడియా ప్రతినిధులకు మెయల్స్ చేశారు. దీనిని వ్యతిరేకించిన విద్యార్థులు నిరసన ప్రాంతానికి వచ్చి యూనివర్సిటీ అధికారులు సస్పెన్షన్‌ని ఎత్తివేతను ప్రకటించాలని విద్యార్థులు పట్టుపట్టారు.

Pages