S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/20/2018 - 01:50

న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణానదీ జలాలను తెలుగు రాష్ట్రాలకు విభజించేందుకు ఉద్దేశించిన జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తదుపరి విచారణ అక్టోబరు 3కు వాయిదా పడింది. బుధవారం ట్రిబ్యునల్‌లో జరుగుతున్న క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఏపీ తరపు సాక్షిగా ఉన్న హైడ్రాలజీ నిపుణుడు విశే్వశ్వరరావును తెలంగాణ సీనియర్ న్యాయవాది వైధ్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

09/20/2018 - 01:44

గచ్చిబౌలి, సెప్టెంబర్ 19: చదివింది ఎంబీఏ... ఎంతో తెలివి తేటలు ఉండి కూడా అక్రమార్గంలో సులువుగా డబ్బులు సంపాదించాలని మోసాలకు తెరతీసిన నిందితుడిని అతనికి సహకరించిన మరు ఇద్దరు వ్యక్తులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు.

09/20/2018 - 01:14

న్యూఢిల్లీ: అర్హులైన వారికి ఓటర్ల జాబితాలో అవకాశం కల్పించిన తరువాతే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఓట్ల జాబితాలో అవకతవకల జరిగినట్టు ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

09/20/2018 - 01:10

కైకలూరు, సెప్టెంబర్ 19: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోదక శాఖ అధికారులు బుధవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్రభుత్వం లెక్కల్లోకి రాని రూ.64,500లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎసీబీ డీఎస్పీ ఎస్‌వివి ప్రసాద్ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రికార్డులు, కంప్యూటర్లను పరిశీలించారు. అనుమతి లేని లేఖర్లు ఐదుగురిని విచారించారు.

09/19/2018 - 23:55

అమీన్‌పూర్, సెప్టెంబర్ 19: సంచలనం రేకెత్తించిన రామచంద్రాపురం మినీ ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులకు సంగారెడ్డి జిల్లా జడ్జీ సాయికళ్యాన్ చక్రవర్తి బుధవారం శిక్షలు విధించారు.

09/19/2018 - 23:06

కొత్తపట్నం,సెప్టెంబర్ 19: కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో ప్రేమించిన యువతి బంధువులు వేధింపులకు గురిచేస్తున్నారన్న మనస్థాపంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈతముక్కలలోని ఎస్‌సి కాలనీకి చెందిన వెంకటకృష్ణ అదే కాలనీకి చెందిన ఒక యువతితో ప్రేమలో పడ్డాడు.

09/19/2018 - 22:12

ఉరవకొండ/బెళుగుప్ప, సెప్టెంబర్ 19: నియోజకవర్గంలోని రెండు మండలాల్లో బుధవారం తెల్లవారుజామున పిచ్చికుక్క వీరంగం చేసింది. పిచ్చికుక్క దాడి చేసిన సంఘటనలో దాదాపు 22 మంది గాయపడిన సంఘటనకు సంబందించిన వివరాలిలా వున్నాయి. గాయపడిన ఇరువురి పరిస్థితి విషమంగా వున్నట్లు, ఉరవకొండ మండలం వై రాంపురం గ్రామానికి చెందిన అంజనేయులు, అక్కమ్మలకు తీవ్ర గాయాలు కావడంతో ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

09/19/2018 - 05:49

పెదవేగి, సెప్టెంబర్ 18 : వినాయక నిమజ్జనం అనంతరం తిరిగి చెరువుకు వెళ్లిన యువకుడు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన పెదవేగి మండలం కొప్పాకలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పెదవేగి ఎస్‌ఐ వి కాంతిప్రియ తెలిపిన వివరాల ప్రకారం కొప్పాకలో ఒకే ఇంటి పేరుతో వున్న అయిదు కుటుంబాలు వినాయక ప్రతిమను ఏర్పాటు చేసుకుని అయిదు రోజులపాటు పూజలు చేశారు.

09/19/2018 - 05:24

మహబూబాబాద్, సెప్టెంబర్ 18: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో గత కొంత కాలంగా తాళాలు వేసిన ఇళ్ళలోకి చాకచక్యంగా దూరి బంగారు ఆభరణాలు, నగదును దోచుకొపోతున్న నలుగురు దోపిడీ దొంగలతో పాటు 17 తులాల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.

09/19/2018 - 04:56

శావల్యాపురం, సెప్టెంబర్ 18: మండలంలోని గంటావారిపాలెం సమీపంలోని అద్దంకి బ్రాంచి కెనాల్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుం ది.

Pages