S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/17/2019 - 04:21

పరిగి, నవంబర్ 16: బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరిగి సిఐ మొగులయ్య తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పూడూరు మండలం సోమన్‌గుర్తి గ్రామానికి చెందిన బాలిక పరిగిలోని కళాశాలలో చదువుతుంది.

11/17/2019 - 01:10

హైదరాబాద్, నవంబర్ 16: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం చట్టవిరుద్ధమని, ఈ దిశగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సంస్థ తాత్కాలిక ఎండీ సునీల్‌శర్మ శనివారం నాడు హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయడం హక్కుగా భావిస్తున్నారని, ముందుగానే నోటీసు ఇచ్చామని వాదిస్తున్నారని ఆయన ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

11/15/2019 - 01:41

విజయవాడ (క్రైం), నవంబర్ 14: డిపాజిట్‌ల పేరుతో నగదు కట్టించుకు ని మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులపై నేరం రుజువుకావడంతో ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.30వేలు జరిమానా విధిస్తూ ఎనిమిదో ఫాస్ట్రాక్ కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..

11/15/2019 - 01:39

పెనమలూరు, నవంబర్ 14: ఆన్‌లైన్ ద్వారా చోరీల మాయాజాలం రోజు రోజుకూ పెరిగిపోతోంది. పెనమలూరు స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ చోరీ గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం గంగూరు గ్రామానికి చెందిన వడ్డీ మోహన కృష్ణ బిగ్ బాస్కెట్ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. అతనికి ఆర్‌బీసీ బ్యాంక్‌లో ఖాతా ఉంది. బ్యాంకు నుండి క్రెడిట్ కార్డు కొత్తగా తీసుకున్నాడు.

11/15/2019 - 01:35

రాజేంద్రనగర్, నవంబర్ 14: కలుషిత నీరు తాగి అక్కాచెల్లెళ్లు మృతిచెందిన సంఘటన హృదయ విషాదకరమైన ఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకేసారి ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

11/15/2019 - 01:05

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ సంస్థ దసార్ట్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి నరేంద్ర మోదీ సర్కార్‌కు సుప్రీం కోర్టు రెండోసారి కూడా క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ కొనుగోలు వ్యవహారంలో కమిషన్లు చేతులు మారాయని, వీటిని నిగ్గు దేల్చేందుకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలంటూ సిబిఐ చేసిన అప్పీలును తిరస్కరించింది.

11/15/2019 - 01:02

హైదరాబాద్, నవంబర్ 14: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై గురువారం హైకోర్టులో విచారణ కొనసాగింది. సుదీర్ఘవాదనల అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు, రూట్ల ప్రైవేటీకరణపై స్టే తదుపరి ఆదేశాల వరకూ కొనసాగుతుందని ప్రకటించిం ది.

11/15/2019 - 00:48

న్యూఢిల్లీ, నవంబర్ 14: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన తన వ్యాఖ్యలను న్యాయస్థానానికి ముడిపెట్టిన కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. అయితే, రాహుల్‌కు ఇకమీదట జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ.. ఈ కోర్టు ధిక్కార విచారణను ముగించింది.

11/15/2019 - 00:43

న్యూఢిల్లీ, నవంబర్ 14: సుప్రీంకోర్టు కేరళలోని శబరిమల ఆలయంలోకి రుతుస్రావ వయసులో ఉన్న మహిళలు, బాలికల ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ 2018లో ఇచ్చిన తన చరిత్రాత్మక తీర్పును సమీక్షించాలని దాఖలయిన పిటిషన్లను గురువారం ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదలాయించింది. శబరిమల తీర్పును సమీక్షించాలని దాఖలయిన పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం 3:2 మెజారిటీ తీర్పును ఇచ్చింది.

11/15/2019 - 01:55

న్యూఢిల్లీ: కాశ్మీర్‌లో అమలైన 370 అధికరణ రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకొంది. దీనిపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తే విచారణ పరిష్కారానికి దారి తీస్తుందన్న అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది.

Pages