S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/21/2019 - 00:18

నందికొట్కూరు, మార్చి 20: కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. బేడ బుడగజంగం కాలనీలో ఉంటున్న వీరాంజనేయులు (28), అతని భార్య వసంత (26), పిల్లలు రామలక్ష్మి (7), రమేష్ (5) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం ఇంటినుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు కిటికీలోంచి చూడగా నలుగురు ఉరికి వేలాడుతూ కనిపించారు.

03/20/2019 - 04:15

విజయవాడ, మార్చి 19: ఎన్నికల వేళ ఇప్పటి వరకు దాదాపు పది కోట్ల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రెండు లక్షల యాభైవేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోగా, ఐడీ లిక్కర్ 33వేల లీటర్లు, ఎస్‌డీపీఎల్ రెండు వేల రెండు వందల లీటర్లు, ఐఎంఎస్‌ఎల్ విభాగంలో రెండు లక్షల లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో మొత్తం రూ.

03/20/2019 - 04:14

న్యూఢిల్లీ, మార్చి 19: దేశంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రెండు వేల బిలియన్ డాలర్ల మేరకు ముంచి లండన్‌లో తలదాచుకుంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీని యూకే నుండి స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన పకడ్బందీ చర్యలు చేపడతామని సీబీఐ అధికార వర్గాలు తెలిపాయి.

03/20/2019 - 04:10

కార్వేటినగరం, మార్చి 19: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కొల్లాగుంట చెక్‌పోస్ట్ వద్ద రూ. 4 కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి నేపథ్యంలో కొల్లాగుంట చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో రూ.

03/20/2019 - 03:59

న్యూఢిల్లీ, మార్చి 19: జమ్మూకాశ్మీర్‌లో నిషేధిత పాక్ హిజ్‌బుల్ ముజాహిద్దీన్, సయ్యద్ సలాఉద్దీన్ అనే ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్న కేసుకు సంబంధించి బండిపురాకు చెందిన మహమ్మద్ షఫీ షాతోపాటు మరో ఆరుగురు స్థానికులకు చెందిన 13 ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.

03/20/2019 - 03:40

న్యూఢిల్లీ, మార్చి 19: యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు మనీలాండరింగ్ కేసులో కాస్త ఊరట లభించింది. వాద్రా ముందస్తు బెయిల్‌ను ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

03/20/2019 - 02:21

శంషాబాద్, మార్చి 19: శంషాబాద్ మండల పరిధిలోని తొండుపల్లి గ్రామ సమీపంలోని ఓ వెంచర్‌లో మహిళను అత్యాచారంతో పాటు హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

03/20/2019 - 02:20

కొందుర్గు, మార్చి 19: రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థిని గాయాలకు గురైంది. మంగళవారం ఉదయం కొందుర్గు గ్రామ సమీపంలోని తుంపల్లి రహదారి మలుపు వద్ద రెండు బైకులు ఢీకొని విద్యార్థినికి గాయాలయ్యాయి.

03/20/2019 - 02:19

ఉప్పల్, మార్చి 19: అతి వేగం..డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవింగ్‌తో ఓ యువకుడు అక్కడిక్కడే మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

03/20/2019 - 02:19

ఖైరతాబాద్, మార్చి 19: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి సహాయకుడిగా ఉన్న వ్యక్తి డబ్బు చోరీకి గురైంది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం మర్పల్లికి చెందిన జగన్నాథ రెడ్డి తన బావ నర్సింహా రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండటంతో నిమ్స్‌కు తీసుకువచ్చారు. ఎమర్జెన్సీ వార్డులో నర్సింహా రెడ్డి చికిత్స పొందుతుండగా, విశ్రాంతి శాలలో జగన్నాథ రెడ్డి వేచి ఉన్నారు.

Pages