S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/26/2019 - 04:00

గరిడేపల్లి : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దారుణం చోటుచేసుకుంది. పొనుగోడు గ్రామానికి చెందిన సన్నాయిల సైదులు అతని కుమారుడు ఉపేందర్, మనవడు వెంకటేశ్వర్లుతో కలిసి మోటర్ సైకిల్‌పై గరిడేపల్లి వైపునకు వస్తుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సన్నాయిల సైదులు(70) అక్కడికక్కడే మృతి చెందాడు.

07/26/2019 - 03:30

న్యూఢిల్లీ, జూలై 25: షాద్‌నగర్ జంట హత్యల కేసులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ కేసులో రామసుబ్బారెడ్డిని నిర్దోషిగా ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. షాద్‌నగర్ జంట హత్యల కేసు గురువారం జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ నవీన్ సిన్హాతో కూడిన బెంచ్ విచారించింది. కేసు విచారణను కొనసాగించాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

07/26/2019 - 02:46

చల్లపల్లి, జూలై 25: మామ చేతిలో అల్లుడు హతమైన విషాద సంఘటన మండల పరిధిలోని మంగళాపురం ఎస్టీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డకు చెందిన సాలా మురళీకృష్ణ (26) గత రెండేళ్లుగా మామ గారి ఊరైన మంగళాపురం ఎస్టీ కాలనీలో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి భార్య నాగమణితో ఏర్పడిన స్వల్ప వివాదం ఘర్షణకు దారి తీసింది.

07/26/2019 - 02:30

ఇబ్రహీంపట్నం, జూలై 25: క్రిమిసంహారక మందు తాగి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గురవా రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంచాల మండలం బోడకొండ గ్రామానికి చెందిన కాట్రోత్ శ్రీధర్, నీలమ్మ దంపతుల కుమార్తె కాట్రోత్ అఖిల(17) ఇబ్రహీంపట్నంలోని శ్రీగాయత్రి జూనియర్ కళాశాలలో సీఈసీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

07/26/2019 - 02:30

జీడిమెట్ల, జూలై 25: భార్యాభర్త ఇద్దరి మధ్య మనస్పార్థలతో కొంతకాలంగా దూరంగా ఉంటున్న వ్యక్తి.. మరో వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయం తెలుసుకుని ఏకంగా భర్తను పట్టుకుని చితకబాదిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రగతినగర్ గ్రామంలో నివాసముండే లక్ష్మణ్‌కు మంచిర్యాల, కొమ్ముగూడెం గ్రామానికి చెందిన సౌజన్యతో 2010లో వివాహం జరిగింది.

07/26/2019 - 02:27

హయత్‌నగర్, జూలై 25: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి యువతిని అపహరించిన కేసును త్వరలో చేదిస్తామని, ముమ్మర గాలింపులు చర్యలు చేపట్టినట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. గురువారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణతో కలిసి డీసీపీ మాట్లాడారు.

07/26/2019 - 02:26

ఉప్పల్, జూలై 25: బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మేడిపల్లి పోలీసులు పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి గురువారం కోర్టుకు రిమాండ్ చేశారు. చెంగిచర్ల నుంచి సికింద్రాబాద్‌కు 21 క్వింటాళ్ల బియ్యం బస్తాలను తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు బోడుప్పల్‌లో పట్టుకుని బియ్యంను తరలిస్తున్న సయ్యద్ అలీమ్, టాటా ఏసీ వ్యాన్ డ్రైవర్ చందర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ రఘురామ్ తెలిపారు.

07/26/2019 - 02:05

విజయవాడ (క్రైం) : గత ప్రభుత్వ హయాంలో ఏపీలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పీపీఏల మీద సమీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై నాలుగు వారాలు స్టే విధించింది. చంద్రబాబు హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో సుమారు రూ.2,600 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.

07/26/2019 - 02:05

విజయవాడ (క్రైం) : రాష్ట్రంలో గ్రామ వలంటీర్ల ఉద్యోగాల ఎంపిక ప్రక్రియపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రభుత్వ సేవలను ఇంటింటికి చేరవేసేందుకు ఏపీ ప్రభుత్వం దాదాపు నాలుగు లక్షలమంది గ్రామ వలంటీర్లను నియమించేందుకు ఇప్పటికే ఇంటర్వ్యూలు జరుపుతున్న విషయం తెలిసిందే.

07/25/2019 - 22:42

న్యూఢిల్లీ, జూలై 25: సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పనితీరులో ఏదో పెద్ద లోపం వుందని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీరియస్ కేసులను అత్యవసర విచారణ కోసం లిస్టింగ్ చేయకపోవడాన్ని ప్రస్తావించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Pages