S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/30/2019 - 02:01

మచిలీపట్నం, జూలై 29: రైస్ పుల్లింగ్, బంగారాన్ని తక్కువ రేటుకు అమ్ముతామని ప్రచారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్న ముఠాను మచిలీపట్నం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం మీడియా ముందు హాజరుపరిచారు. సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను సీసీఎస్ ఇన్‌ఛార్జ్ డీఎస్పీ ఎస్కే అబ్దుల్ అజీజ్ వివరించారు.

07/30/2019 - 01:50

గచ్చిబౌలి, జూలై 29: హైటెక్ సిటీని ఆనుకుని ఉన్న 100 గజాల స్థలం ఐదు లక్షలకే.. నడుచుకుంటూ హైటెక్ సిటీకి వెళ్లవచ్చు అంటూ గత దశాబ్ద కాలం నుంచి పేద, మధ్య తరగతి ప్రజలను మోసం చేస్తు కోట్ల రూపాయలు మోసం చేసిన ముఠాలో 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గ సీఐ రవీందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/30/2019 - 00:46

చేబ్రోలు : కట్టుదిట్టమైన భద్రతతో ఉండే గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో భారీ దొంగతనం జరిగింది. రూ.44 లక్షలకు పైగా సొమ్మును చోరులు అపహరించారు. ఇంత పెద్దమొత్తంలో నగదు దోచుకెళ్లడంతో డెయిరీ యాజమాన్యం, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. పోలీసుల కథనం మేరకు... వడ్లమూడి సంగం డెయిరీలోని మొదటి అంతస్తులోని క్యాష్ కౌంటర్ గదిలోని బీరువాలో 70 లక్షలకు పైగా నగదు ఉంది.

07/29/2019 - 23:09

భద్రాచలం టౌన్, జూలై 29: అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపునిచ్చిన మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. వారోత్సవాల విజయవంతం కోసం మావోలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే భద్రతా బలగాలు వారిని ఆత్మరక్షణలోకి నెడుతున్నాయి. ఈ క్రమంలో రెండురోజుల క్రితం చత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే.

07/29/2019 - 22:54

న్యూఢిల్లీ, జూలై 29: ‘దేశ వ్యాప్తంగా 33 శాతం మంది ప్రజలు వివిధ సందర్భాల్లో నీటిని వృథా చేస్తున్నారు.. ఇది కచ్చితంగా నేరం చేసినట్లే అవుతుంది.. దీనిని అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారో నివేదిక ఇవ్వండి’ అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటి) కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బ్రష్ చేసేటప్పుడు, స్నానం చేసే సమయంలో ఇంకా అనేక సందర్భాల్లో నీరు వృథాగా పోతోంది..

07/29/2019 - 22:23

న్యూఢిల్లీ, జూలై 29: కర్నాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రమేష్ ఎల్ జార్ఖిహోలి, మహేష్ కుమథల్లి సోమవారంనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ ఈనెల 25న ఈ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.

07/29/2019 - 03:46

హైదరాబాద్, జూలై 28: ఓ వాహనం అదుపు తప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో ఓ హోంగార్డు మృతి చెందిన సంఘటన నగరంలవని బేగంపేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డ్రైవర్‌కు మూర్చరావడంతో అదుపుతప్పిన కారు ముందున్న దాదాపు 10 వాహనాలపేకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విధి నిర్వహణలో భాగంగా ద్విచక్ర వాహనంపై వెళుతున్న ప్రభాకర్ అనే హోంగార్డు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

07/29/2019 - 01:43

కూచిపూడి, జూలై 28: చెరువులో పడిన బంతి కోసం నీటిలో దిగి చిన్నారి మృతి చెందిన విషాధ సంఘటన ఆదివారం మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో చోటు చేసుకుంది. మొవ్వ పీహెచ్‌సీ వైద్యులు డా. శొంఠి శివరామకృష్ణ వివరాలు ప్రకారం అయ్యంకి గ్రామానికి చెందిన రాజులపాటి నాగబాబు, నాగలక్ష్మి దంపతుల మొదటి సంతానమైన హేమలత అఖిల్ (10) కారకంపాడు రోడ్డులోని చెరువు పక్కన ఆడుకుంటున్నాడు.

07/29/2019 - 01:42

చల్లపల్లి, జూలై 28: అల్లుడిపై కర్రతో దాడి చేసి అతని మరణానికి కారణమైన మామ కూతాడి వెంకటేశ్వర్లుతో పాటు అతనికి సహకరించిన మృతుని భార్య సాలా నాగలక్ష్మి అలియాస్ మల్లీశ్వరిలను చల్లపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో అవనిగడ్డ డీఎస్పీ రమేష్‌రెడ్డి కేసు పూర్వాపరాలను మీడియాకు తెలిపారు.

07/29/2019 - 01:36

గచ్చిబౌలి, జూలై 28: మద్యం సేవించి వాహనం నడపడం మీతో పాటు ఇతరుల ప్రాణాలకు ఇబ్బందికరం... అని పోలీసులు నెత్తి నోరు బాదుకుని చెప్తున్నా మద్యం ప్రియుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.

Pages