S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/22/2019 - 04:21

నాగాయలంక, డిసెంబర్ 21: మండల కేంద్రం నాగాయలంకలో స్థానిక 6వ వార్డుకు చెందిన ఓ అయ్యప్ప భక్తుడు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలను ఎస్‌ఐ చల్లా కృష్ణ విలేఖర్లకు వివరించారు. మత్స్యకారుల కుటుంబానికి చెందిన ఓలేటి యుగంధర్ (48) అప్పుల బాధ భరించలేక శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు.

12/22/2019 - 04:20

పటమట, డిసెంబర్ 21: ఆటోనగర్‌లోని మహానాడు రోడ్డులో లైలా ఇంపెక్స్ కంపెనీలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీ సిబ్బంది వెంటనే సమాచారం అందించటంతో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు గుర్తించారు. కంపెనీలో ఒక పక్కన ఉన్న వేస్ట్ మెటీరియల్ నుంచి అగ్నికీలలు రేగి దట్టమైన పొగ వ్యాపించటంతో కంపెనీ సిబ్బంది ఆటోనగర్‌లోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.

12/22/2019 - 00:59

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. సికింద్రాబాద్ విశాల్ ఎంటర్ ప్రైజెస్‌కు చెందిన పందిరి భూపాల్‌రెడ్డి, వసుధ మార్కెటింగ్ ఏజెన్సీకి చెందిన నాగేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

12/22/2019 - 00:27

హైదరాబాద్, డిసెంబర్ 21: దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు వైద్య శాఖను ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహాలకు ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా రీ పోస్టుమార్టం ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. మృతదేహాలకు ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణులతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది.

12/20/2019 - 06:19

ఆదిలాబాద్,డిసెంబర్ 19: సంచలనం రేపిన సమత హత్యాచార ఘటన కేసులో నాలుగో రోజు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితులపై అభియోగాలు నమోదు చేసింది. గురువారం సమత కేసులో నిందితులైన షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, ముగ్దుమ్‌లను పోలీసులు కోర్టుకు హాజరుపర్చగా నవంబర్ 24న లింగాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఎల్లాపటార్ అటవీ ప్రాంతంలో సమతపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి.

12/20/2019 - 02:25

విజయవాడ (క్రైం), డిసెంబర్ 19: పేరుమోసిన క్రిమినల్‌గా పోలీసు రికార్డులకెక్కిన రౌడీషీటర్ ఖల్ నాయక్‌కు దొంగతనం కేసులో జైలుశిక్ష పడింది. ఖల్‌నాయక్‌తోపాటు అతని కుటుంబ సభ్యులపై కూడా నేరం రుజువుకావడంతో న్యాయస్థానం జైలు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఫ్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేదారేశ్వరరావుపేటకు చెందిన ఎలిక శ్రీను అనే వ్యక్తి కార్పొరేట్ టెక్నాలజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.

12/20/2019 - 02:25

విజయవాడ (క్రైం), డిసెంబర్ 19: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 37 మందికి కోర్టు జరిమానా విధించింది. వీరిలో 8మందికి జైలుకూడా పడింది. పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో ట్రాఫిక్ అదనపు డీసీపీ టీవీ నాగరాజు పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించింది.

12/20/2019 - 02:15

ఖైరతాబాద్, డిసెంబర్ 19: వినోదం మాటున అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.. బేగంపేటలోని ఓక్లబ్ ఆవరణలోని పబ్‌పై దాడులు చేశారు. బుధవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ సీఐ గట్టుమల్లు ఆధ్వర్యంలోని పోలీసుల బృందం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరపడంతో పాటు విచ్చలవిడిగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.

12/20/2019 - 01:15

హైదరాబాద్: ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన ప్రజాసంఘాల నేతలను శుక్రవారం ఉదయం ఉన్నత న్యాయస్థానంలో హాజరుపరచాలని హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ , జస్టిస్ ఎ అభిషేక్‌రెడ్డిలతో కూడిన బెంచ్ పోలీసులను ఆదేశించింది. ప్రజా సంఘాల నాయకుల అరెస్టుపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత దాఖలు చేశారు.

12/20/2019 - 01:02

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో సిద్దిపేట డీసీపీ గోవింద్ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గురువారం నర్సింహారెడ్డిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మహబూబ్‌నగర్, జహీరాబాద్, హైదరాబాద్, అయ్యవారిపల్లి, సిద్దిపేటల్లో ఆయన బంధువుల్లో సైతం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దాదాపు 10 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అంచనా.

Pages