S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/20/2019 - 00:34

విశాఖపట్నం(క్రైం): ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు ఫిర్యాదు అందడంతో ఇక్కడి ఏపీఈపీడీసీఎల్‌లో చీఫ్ విజిలెన్స్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న తంగెళ్ల హరికృష్ణ ఇంటిపై అవినీతి నిరోధక శాఖాధికారులు గురువారం దాడులు చేశారు. దాడుల్లో రూ. రెండు కోట్ల విలువైన ఆస్తులు బయట పడగా వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.ఐదు కోట్ల మేరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

12/19/2019 - 23:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో మరణశిక్ష పడిన నలుగురు దోషుల్లో పవన్ కుమార్ గుప్తా అనే ఒకతను తాను నేరం జరిగిన సమయంలో బాలుడినని పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. 2012 డిసెంబర్‌లో నేరం జరిగిన సమయంలో తాను బాల్యదశలో ఉన్నానని దోషి పవన్ కుమార్ గుప్తా తన పిటిషన్‌లో చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

12/19/2019 - 05:14

పాచిపెంట, డిసెంబర్ 18: విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పి. కోనవలస చెక్‌పోస్టు వద్ద బుధవారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో ఒక కంటైనర్‌లో భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి నుంచి ఢిల్లీకి కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.

12/19/2019 - 05:04

వరదయ్యపాలెం/తడ, డిసెంబర్ 18: ఏసీబీ వలలో శ్రీసిటీ పారిశ్రామిక వాడలో ఉన్న హైటెక్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సుబ్బారెడ్డి బుధవారం సాయంత్రం ఏసీబీ వలలో చిక్కుకున్నారు. అవినీతిని నిరోధక శాఖ విజయశేఖర్ ఆధ్వర్యంలోని ఏసీబీ బృందం వల పన్ని ఎస్‌ఐ సుబ్బారెడ్డిని పట్టుకున్నారు. ఇసుక మాఫియా, పలు కేసులలోని పేర్లను తారుమారు చేసేందుకు ఎస్‌ఐ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

12/19/2019 - 04:50

ఆదిలాబాద్, డిసెంబర్ 18: ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సమత హత్యాచార కేసులో నిందితులు షేక్‌బాబా, షేక్ షాబోద్దీన్, షేక్ ముగ్దుంలను బుధవారం ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందు హాజరుపర్చారు.

12/19/2019 - 04:50

సిద్దిపేట : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో సిద్దిపేట అడిషనల్ డీసీపీ గోవిందు నర్సింహారెడ్డి ఇంటిపై బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ అనూష, డీఎస్పీ భద్రయ్య, ముగ్గురు సీఐలు, సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 7-30 గంటల వరకు దాడులు కొనసాగాయి.

12/19/2019 - 04:22

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార, హత్య కేసులో నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. గతంలో నిందితులకు మరణశిక్షను విధించడాన్ని పాటియాలా హౌస్ కోర్టు వ్యతిరేకించింది. అంతేకాకుండా న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకునే అవకాశాలను దోషులకు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.

12/19/2019 - 04:18

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) చెల్లుబాటును పరిశీలించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే, ఈ చట్టం అమలు కాకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో తమపై జరుగుతున్న హింస, దౌర్జన్యాలను భరించలేక భారత్‌కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, జైనులు, పార్శీలకు పౌరసత్వం ఇచ్చేందుకు వీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.

12/19/2019 - 04:13

న్యూఢిల్లీ: నిర్భయ వంటి అత్యంత కీలకమైన సీరియస్ కేసులో వాదనలు జరుగుతున్నపుడు ఢిల్లీలో నెలకొన్న కాలుష్యం గురించి ప్రస్తావించడం దురదృష్టకరమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో దోషిగా ఉన్న అక్షయ్ కుమార్ సింగ్ వేసిన రివ్యూ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నపుడు సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది.

12/19/2019 - 04:12

న్యూఢిల్లీ: మీడియాలో వచ్చే వార్తలను ఆధారంగా చేసుకుని ఎలాంటి నిర్ధారణలకు రాకూడదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. నిర్భయ కేసు వాదనల సందర్భంగా కోర్టు ఈ విధంగా స్పందించడం గమనార్హం. ఒక క్రిమినల్ కేసులో ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అనేది మీడియా వార్తలను ఆధారంగా చేసుకుని నిర్ధారించుకోవడం సమంజసం కాదని హితవు పలికింది.

Pages