S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/18/2019 - 02:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: నిర్భయ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో మరణశిక్ష పడిన దోషి అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎస్‌ఏ బోబ్డే తనంత తానుగా తప్పుకున్నారు.

12/18/2019 - 01:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ఉన్నావ్ అత్యాచార కేసులో దోషి అయిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని దర్యాప్తు సంస్థ సీబీఐ మంగళవారం న్యాయస్థానాన్ని కోరింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్ గ్రామంలో 2017లో ఒక మహిళపై సెంగార్ అత్యాచారానికి పాల్పడినట్టు కోర్టు ఇదివరకే నిర్ధారించింది.

12/18/2019 - 01:53

మద్దిపాడు, డిసెంబర్ 17: ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పనిచేస్తున్న వీర్రరాజు విజయవాడకు చెందిన ఎన్‌హెచ్‌బి ట్రాన్స్‌పోర్టుకు చెందిన మేనేజర్ కరీంఖాన్ వద్ద నుండి 5వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు మంగళవారం నాడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

12/18/2019 - 01:22

ఉన్నావో (ఉత్తరప్రదేశ్), డిసెంబర్ 17: ఉన్నావో రేప్ కేసులో శశి సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించడం పట్ల బాధితురాలి తల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రేప్ కేసులో నిందితుడైన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా ప్రకటించిన ఢిల్లీ కోర్టు సహ నిందితురాలైన శశి సింగ్‌ను ఎందుకు వదిలేశారని బాధితురాలి తల్లి ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలో ఆమె విలేఖరులతో మాట్లాడారు.

12/17/2019 - 04:55

విజయవాడ (క్రైం), డిసెంబర్ 16: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నిర్మించిన స్థలం ఆక్రమిత స్థలం అంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానంలో పిటిషన్ దాఖలైంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌పై విచారణ అనంతరం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం నిర్మాణంపై నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

12/17/2019 - 04:25

కోరుట్ల, డిసెంబర్ 16: అర్థరాత్రి కొంతమంది యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన కాలనీవాసులు దొంగలుగా భావించి వారిపై దాడి చేశారు. దాడిలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు.

12/17/2019 - 04:17

ఆదిలాబాద్: సంచలనం రేపిన సమత హత్యాచార ఘటనలో సత్వర న్యాయం అందించే ‘దిశ’గా అడుగులు పడుతున్నాయి. లింగాపూర్ మండలం ఎల్లాపటార్ అటవీ ప్రాంతంలో చిరువ్యాపారం సాగించే సమతపై ముగ్గురు నిందితులు గత నెల 24న సామూహికంగా అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చిన ఘటన నేపథ్యంలో పోలీసులు నిందితులైన షేక్‌బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుమ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే.

12/17/2019 - 04:15

హుజూరాబాద్, డిసెంబర్ 16 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఆర్‌డీవో కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్ సందీప్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

12/17/2019 - 02:23

చందర్లపాడు, డిసెంబర్ 16: భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్త గొంతు పిసికి భార్యను చంపేశాడు. ఈ సంఘటన మండలంలోని కొడవటికల్లులో సోమవారం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం రాచబంటి ప్రసాద్ (40)కు, పున్నవల్లికి చెందిన పోరుగంటి పద్మావతి (30)తో వివాహం జరిగింది. కొద్ది కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న ప్రసాద్ సోమవారం ఉదయం పద్మావతిని గొంతు పిసికి చంపాడు.

12/17/2019 - 02:22

విజయవాడ (క్రైం), డిసెంబర్ 16: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 42మందికి జరిమానా, మ రికొందరికి కోర్టు జైలుశిక్ష విధించింది. నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో నగరం లో కొనసాగుతున్న స్పెషల్ డ్రంకెన్ డ్రై వ్‌లో భాగంగా రెండో ట్రాఫిక్, నాలు గో ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన 42 మందిని సోమవారం మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. 42మందికి రూ.

Pages