S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/19/2019 - 04:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఇండియా గేట్ లాన్స్‌లో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. 90 శాతం కాలిన గాయాలతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగానే 25 ఏళ్ల కార్తీక్ మహెర్ ఆత్మహత్యాయత్నం చేశాడని అంటున్నారు. అయితే, పోలీసులు ఈ వాదనను ఖండించారు. సీఏఏపై చోటుచేసుకుంటున్న నిరసనలతో అతనికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు.

12/19/2019 - 01:04

హైదరాబాద్: ప్రముఖ విద్యాసంస్థలు నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదికలను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు ఇంటర్ బోర్డును ఆదేశించింది. ఈ రెండు కాలేజీలు అనేక నిబంధనలను ఉల్లంఘించాయని సా మాజిక కార్యకర్త రాజేష్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగిం ది. శ్రీ చైతన్య

12/19/2019 - 00:57

హైదరాబాద్, డిసెంబర్ 18: హైదరాబాద్‌లోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. మంగళ్‌హాట్ పోలీసులు రౌడీషీటర్ల జాబితాలో రాజాసింగ్ పేరును చేర్చా రు. ఒక పనిపై మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన కొందరు బీజేపీ కార్యకర్తలు దీనిని గమనించి రాజాసింగ్‌కు సమాచారం అందించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలావుండగా, ఇంకా తన పేరు రౌడీషీటర్

12/19/2019 - 01:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: మనీ లాండరింగ్ కేసులో భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్ నీరజ్ సింఘాల్‌పై బలవంతపు చర్యలేవీ చేపట్టరాదని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను ఆదేశించింది. రెండు వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో నీరజ్ సింఘాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.

12/18/2019 - 05:18

కరీంనగర్, డిసెంబర్ 17: దిశపై హత్యాచారం జరిపిన కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినా కానీ, కామాంధుల్లో ఎలాంటి భయం కన్పించటం లేదు. ఇందుకు నిదర్శనం తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో నిండు గర్భిణిపై ఓ కామాంధుడు జరిపిన అత్యాచారం.

12/18/2019 - 04:55

వీపనగండ్ల, డిసెంబర్ 17: తాగిన మైకంలో కొడుకు తండ్రిపై రాయ విసిరి చంపిన సంఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. వీపనగండ్ల మండలంలోని పుల్గర్‌చర్ల గ్రామానికి చెందిన మాల చిన్నకిష్టన్న (80) ఈ దుర్ఘటనలో మృతి చెందాడు. కిష్టన్న భార్య, చిన్న కుమారుడు కొన్ని రోజుల క్రితం చనిపోయారు. మిగిలిన ఒక్క కుమారుడు మద్దిలేటి మద్యానికి బానిసై ఎలాంటి పనులు చేయకుండా గ్రామంలో తిరిగేవాడు.

12/18/2019 - 04:55

ఆదిలాబాద్, డిసెంబర్ 17: సంచలనం సృష్టించిన సమత అత్యాచారం, హత్య ఘటనలో మంగళవారం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు రెండో రోజు నిందితులు హాజరయ్యారు. ఆదిలాబాద్ కోర్టు ప్రాంగణంలో సమత కేసులో సత్వర విచారణ సాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిన విషయం విదితమే.

12/18/2019 - 04:54

లక్ష్మిదేవిపల్లి, డిసెంబర్ 17: ఎనిమిదేళ్ళ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం గడ్డిగుట్ట గ్రామానికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాలికపై అదే గ్రామానికి చెందిన నూనవత్ హనుమంతు (27) అనే వ్యక్తి ఆదివారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో విషయం బయటకు పొక్కింది.

12/18/2019 - 04:53

ఆదిలాబాద్, డిసెంబర్ 17: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్ మిత్తల్ నివాసం, జిన్నింగ్‌మిల్లులో మంగళవారం ఆదాయపన్ను శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

12/18/2019 - 02:08

షాద్‌నగర్, డిసెంబర్ 17: నాలుగేళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కిడ్నాప్ చేసినట్లు షాద్‌నగర్ టౌన్ సీఐ శ్రీ్ధర్‌కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం షాద్‌నగర్ పురపాలక సంఘం పరిధిలోని చటాన్‌పల్లి గ్రామంలో నివాసం ఉంటున్న శివ కుమార్తె స్నేహిత (4) అనే చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు సీఐ వివరించారు.

Pages