S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/04/2019 - 05:14

సూర్యాపేట, డిసెంబర్ 3: హైదరాబాద్ - విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

12/04/2019 - 05:11

గోదావరిఖని టౌన్, డిసెంబర్ 3: దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పెడుతున్న వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకొని సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో సంచలనం రేపింది. గోదావరిఖని అశోక్ నగర్‌లో నివాసముండే సల్లం సరోజ మల్లేష్ దంపతుల దత్త పుత్రిక సల్లం జ్యోతి (14) సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

12/04/2019 - 05:09

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 3: జిల్లా మైనింగ్ అసిస్టెండ్ డైరక్టర్ శ్రీనివాస్ ఓ వ్యక్తి నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

12/04/2019 - 02:12

హైదరాబాద్, డిసెంబర్ 3: పాతబస్తీలో ఓ పోలీసు కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఈశ్వరయ్య ఫలక్‌నుమా పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి పీకల దాకా మద్యం సేవించి షంషీర్‌గంజ్ గోశాల రోడ్డులో హల్‌చల్ చేశాడు. రోడ్డుపై తూలి పడిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్డుపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

12/04/2019 - 02:08

జీడిమెట్ల, డిసెంబర్ 3: దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నేపాల్‌కు చెందిన ధానిరామ్ పద్మరాజ్ బండారి (30) చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంటాడు. లాల్ బహదూర్ బిస్ట్ (40) సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తాడు. చంద్రకాంత్ బండారి (32) మార్కెటింగ్ వర్క్ చేస్తాడు.

12/04/2019 - 02:04

ఖైరతాబాద్, డిసెంబర్ 3: బంజారాహిల్స్ రోడ్డుపై ఓ కారు దగ్ధం అయింది. మంగళవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 మీదుగా ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాటిని గమనించేలోపే మంటలు కారు మొత్తం వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్ శ్రావణ్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి దిగి, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. ఫైరింజన్లు వచ్చే లోపే పెద్ద ఎత్తున మంటలు కమ్ముకొని కారు పూర్తిగా దగ్ధం అయింది.

12/04/2019 - 02:03

జీడిమెట్ల, డిసెంబర్ 3: కొంపల్లి మున్సిపల్ పరిధిలోని బిగ్‌బజార్ షాపింగ్ మాల్‌లో కొంపల్లి మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. షాపింగ్ మాల్‌లో విక్రయిస్తున్న ప్రొడక్ట్‌లను పరిశీలించారు. తనిఖీల్లో పళ్లు, టమోటాలు, ఉల్లిగడ్డలు, జీరా చిప్స్, పాపడాలు వంటి తినుబండారాలు తేదీ ముగిసి ఉన్నాయి.

12/04/2019 - 01:34

కర్నూలు, డిసెంబర్ 3: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంపై సస్పెన్షన్‌కు గురైన కర్నూలు జిల్లా సంజామల తహశీల్దార్ గోవింద్‌సింగ్ అక్రమాస్తులు రూ. 10 కోట్లు అని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం కర్నూలు నగరంలోని కృష్ణానగర్‌లో ఉన్న తహసీల్దార్ గోవింద్‌సింగ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.

12/03/2019 - 23:48

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడి యా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం బెయిల్ మంజూరుపై సుప్రీం కోర్టు బుధవారం తీర్పును వెలువరించనుంది. న్యాయమూర్తి ఆర్ బానుమతి నేతృత్వంలోని ధర్మాసనం గత నెల 28న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. బెయిల్ కోసం చిదంబరం చేసుకున్న పిటిషన్‌ను గత నెల 15న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

12/03/2019 - 06:04

న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ తొలి రివ్యూ పిటిషన్ దాఖలైంది. బాబ్రీ మసీదును కూల్చివేసిన వారికి బహుమతి ఇచ్చినట్టుగా తీర్పు ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. తీర్పును పునఃసమీక్షించాలని అయోధ్య స్థల వివాదంలో అసలు కక్షిదారుడు సిద్దిఖీ చట్టబద్ధమైన వారసుడు వౌలాలా సయ్యద్ అషాద్ రషీదీ ఆరోపించారు.

Pages