S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/03/2019 - 05:53

బెజ్జూరు, డిసెంబర్ 2: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపెల్లి మండలం గూడెం ప్రాణహిత నదిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి.

12/03/2019 - 05:49

నల్లగొండ, డిసెంబర్ 2: నల్లగొండ జిల్లాలో ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో దగ్ధమైంది. నార్కట్‌పల్లి-అద్దంకి మార్గంలో హైద్రాబాద్ నుండి ఒంగోలు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా రేగిన మంటలతో బస్సు పూర్తిగా దగ్ధమవ్వగా డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

12/03/2019 - 05:46

నేరేడుచర్ల, డిసెంబర్ 2: సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలో ప్రముఖ వ్యాపారవేత్త రాచకొండ శ్రీనివాస్‌రావు గృహంలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు భారీ చోరీకి పాల్పడ్డారు. సుమారు 423 గ్రాముల బంగారు అభరణాలు, 3 లక్షలకు పైగా నగదుతో పాటు మొత్తం సుమారు 20 లక్షల సొత్తును అపహరించుకొని పోయారు.

12/03/2019 - 02:01

గన్నవరం, డిసెంబర్ 2: గన్నవరం మండలం ముస్తాబాద్‌లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కడుపు నొప్పి భరించలేక ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి, తాను ఆత్మహత్యా యత్నం చేసుకుంది. ఈ సంఘటనలో చిన్న కొడుకు కొండా శంకర్ (5) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం కొండా కోటేశ్వరరావు, అంకమ్మ భార్యాభర్తలు. వీరికి హేమంత్, శంకర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంకమ్మ కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది.

12/03/2019 - 01:59

ఖమ్మం (క్రైం), డిసెంబర్ 2: పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తెలంగాణలోని ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

12/03/2019 - 05:28

విజయవాడ (క్రైం) : బాలికపై లైంగిక దాడి కేసులో నిందితునిపై నేరం రుజువు కావడంతో 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న దిశ అత్యాచార, హత్య ఘటన నేపథ్యంలో వెలువడిన ఈ తీర్పు చర్చనీయాంశమైంది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..

12/03/2019 - 01:52

షాబాద్, డిసెంబర్ 2: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం షాబాద్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడలో జరిగింది. షాబాద్ ఇన్‌స్పెక్టర్ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లింగారెడ్డిగూడ గ్రామానికి చెందిన మహేందర్(25) అదే గ్రామానికి చెందిన కర్రె పల్లవి(19) రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ విషయం గతంలో పెద్దలకు తెలియడంతో మందలించి విదిలేశారు.

12/03/2019 - 01:51

షాద్‌నగర్, డిసెంబర్ 2: మద్యం మత్తులో రోకలిబండతో మోది తల్లిని చంపిన తనయుడి ఉదంతం ఫరూక్‌నగర్ మండలం కంసాన్‌పల్లిలో వెలుగుచూసింది. ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన కుమారుడు బైండ్ల నర్సింలుని తల్లి వెంకటమ్మ(50) మందలించడంతో ఇంటి నుంచి బయడికి వెళ్లాడు. మళ్లీ మద్యం సేవించి వచ్చి నిద్రిస్తున్న తల్లిని రోకలి బండతో మోదడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

12/03/2019 - 01:50

సికిందరాబాద్, డిసెంబర్ 2: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. ఇద్దరు వ్యక్తులను సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.7లక్షల విలువైన 45 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

12/02/2019 - 06:46

గుంటూరు (అరండల్‌పేట), డిసెంబర్ 1: గుంటూరు నగర శివారు అడ్డాగా విదేశాల నుంచి మత్తు పదార్థాలు దిగుమతి చేసుకుని నగరంలోని యువత, కళాశాల విద్యార్థులకు సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నల్లపాడు స్టేషన్ పరిధిలోని అపార్ట్‌మెంట్లు కేంద్రంగా టాంజానియా, సిరియా, యెమెన్ దేశాల నుంచి డ్రగ్స్‌ను తెప్పించి ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్న ఇద్దరు విదేశీయులను అరెస్టు చేశారు.

Pages