S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/11/2019 - 03:26

షాద్‌నగర్ టౌన్, డిసెంబర్ 10: చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో రోడ్డుపై లారీ నిలిచి ఉండటంతో అది గమనించకుండా వెనుక నుంచి టాటా ఏస్ వాహనం వచ్చి ఢీకొనడంతో నలుగురు వ్యక్తులతోపాటు ఒక చిన్నారి తీవ్రంగా గాయపడింది.

12/11/2019 - 02:44

శ్రీకాళహస్తి, డిసెంబర్ 10: శ్రీకాళహస్తీశ్వరాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సూర్యనారాయణ భక్తులను మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ప్రాథమిక విచారణ జరిపి ఆయనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సూర్యనారాయణను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈ ఓ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

12/11/2019 - 02:43

బెళుగుప్ప, డిసెంబర్ 10: అనంతపురం జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కళ్యాణదుర్గం-అనంతపురం జాతీయ రహదారిపై కాలవపల్లి సమీపంలో మంగళవారం బొలెరో వాహనం బోల్తా పడడంతో నగరానికి చెందిన బంగారప్ప(55), వెంకటప్ప(44) అక్కడిక్కడే మృతిచెందారు.

12/11/2019 - 02:32

కొత్తకోట, డిసెంబర్ 10: 8 ఏళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఎస్ ఐ సతీష్ తెలిపారు.

12/11/2019 - 02:32

నిర్మల్, డిసెంబర్ 10: రెండు వర్గాల మధ్య 2012 డిసెంబర్ 24న నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు భైంసాలో విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన ఎంఐ ఎం శాసన సభా పక్షనేత, ఎమ్మెల్యే అక్బరుద్ద్దీన్ ఓవైసీ మంగళవారం నిర్మల్ కోర్టులో విచారణకు హజరయ్యారు. గతంలో నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో 121 ఏ, 153 ఏ, 290 ఏ, 505, 188 ఐపీసీ సెక్షన్‌ల కింద ఆయనపై సుమోటో కేసులు నమోదై ఉన్నాయి.

12/11/2019 - 02:18

హైదరాబాద్, డిసెంబర్ 10: రామగోపాల్ వర్మ నిర్మించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రానికి ఇంకా సర్ట్ఫికెట్ జారీ చేయలేదని సెన్సార్ బోర్డు రాష్ట్ర హైకోర్టుకు వివరణ ఇచ్చింది. రివ్యూ కమిటీ సెన్సార్ సర్ట్ఫికెట్ జారీకి నిరాకరించిందని, దాంతో చిత్ర బృందం రివిజన్ కమిటీకి అప్పీలు చేశారని, రివిజన్ కమిటీ చిత్రాన్ని తిలకించి కొన్ని మార్పులను సూచించిందని సెన్సార్ బోర్డు కౌన్సిల్ హైకోర్టుకు వివరించారు.

12/11/2019 - 02:17

హైదరాబాద్, డిసెంబర్ 10: గచ్చిబౌలి బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన కారుప్రమాదం కేసులో నిందితుడ్ని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు పేర్కొంది. ఫ్లైఓవర్‌పై ప్రమాదానికి కృష్ణమిలన్‌రావు కారణమని రాయదుర్గం పోలీసులు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రమాద సమయంలో 104 కిలోమీటర్లకు పైగా వేగంతో ఆయన వెళ్తున్నారని పోలీసులు తమ కౌంటర్‌లవో పేర్కొన్నారు.

12/11/2019 - 01:35

హైదరాబాద్: ‘దిశ’ కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర హైకోర్టులో మంగళవారం మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను సివిల్ లిబర్టీస్ నేత లక్ష్మణ్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు అన్నింటినీ హైకోర్టు ఈ నెల 12వ తేదీన విచారణ చేపట్టనుంది. అంతకంటే ముందు ఈ నెల 11న దిశ కేసులో ఎన్‌కౌంటర్ అంశంపై
సర్వోన్నత న్యా యస్థానం విచారణ చేపట్టనుంది. నిందితుల

12/11/2019 - 01:34

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: దిశను రేప్ చేసి హతమార్చిన నలుగురు కిరాతకుల ఎన్‌కౌంటర్‌పై స్వతం త్ర దర్యాప్తుకు ఆదేశించాలంటూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వాజ్యాలను బుధవారం వినేందు కు సుప్రీం కోర్టు అంగీకరించింది. తెలంగాణ పోలీసులు డిసెంబర్ ఆరో తేదీ జరిపిన ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలంటూ న్యాయవాదులు

12/05/2019 - 02:54

సనత్‌నగర్, డిసెంబర్ 4: తల్లిదండ్రులను కాదని, తనకు నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహిత పట్టుమని పక్షం రోజుల కూడా గడవక ముందే తనువుచాలించింది. హృదయవిదారక సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్‌లో నివాసం ఉండే ప్రసాద్ ఓ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. ఇతని కుమార్తె పూర్ణిమ అన్నపూర్ణ (25)ను ఇంజనీరింగ్ చదివించాడు.

Pages