S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/15/2019 - 03:24

హనుమాన్ జంక్షన్,డిసెంబరు 14: బాపులపాడు మండలం మల్లవల్లిలో శనివారం ఉదయం దారుణం జరిగింది. కట్టుకున్న వాడే భార్యను అనుమానంతో గొడ్డలితో నరికి చంపాడు. గ్రామంలో తీవ్ర అలజడి రేపిన ఈ సంఘటనకు సంబంధించి హనుమాన్ జంక్షన్ సి.ఐ రమణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్లవల్లికి చెందిన కట్టుబోయిన వెంకటరత్నంకు, ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి(31)కి 12 సంవత్సరాల క్రితం వివాహమైంది.

12/15/2019 - 02:59

తోట్లవల్లూరు, డిసెంబర్ 14: మండలంలోని దేవరపల్లి గ్రామం వద్ద కరకట్టపై శనివారం కారు- మోపెడ్ ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

12/15/2019 - 02:58

జి.కొండూరు, డిసెంబర్ 14: గూడ్స్ రైలు టిప్పరును ఢీకొట్టిన సంఘటన మండల పరిధిలోని గడ్డమణుగు లోయలో చెరువుమాధవరం రైల్వేస్టేషను పరిధిలో శనివారం ఉదయం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద టిప్పరును హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్‌కు పెట్రో ఉత్పత్తులు రవాణా చేసే గూడ్స్ రైలు ఢీకొట్టింది. టిప్పరులోని క్లీనరుకు స్పల్పగాయాలయ్యాయి. టిప్పరు పాక్షికంగా దెబ్బతింది.

12/15/2019 - 02:57

కంచికచర్ల, డిసెంబర్ 14: మండలంలో గల పరిటాలలో బాలికపై అత్యాచారం జరిగింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం పరిటాలకు చెందిన తంగిరాల రాంబాబు (56) 14 ఏళ్ల బాలికపై సంవత్సర కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక తల్లికి బాలికపై అత్యాచారం చేసిన రాంబాబుతో అక్రమ సంబంధం ఉంది. పది సంవత్సరాల నుండి ఈ ఇద్దరికి సంబంధాలు ఉన్నాయి.

12/15/2019 - 02:51

కీసర, డిసెంబర్ 14: లారీని, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో తల్లి, కొడుకు మృతి చెందిన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మల రామారం మండలం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొందెల ఉపేందర్ (19) తల్లి లక్ష్మీ (46), తండ్రి సత్తయ్యలతో కలిసి ద్విచక్ర వాహనంపై కీసర మీదుగా తిమ్మాపూర్ వెళుతున్నాడు.

12/15/2019 - 01:04

న్యూఢిల్లీ: మూడు ముస్లిం దేశాల నుండి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం కల్పించే సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గత రాత్రి ఆమోదముద్ర వేయగానే శనివారం దీనిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలు ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలయ్యాయి. హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిల్ వేశారు.

12/13/2019 - 02:18

జీడిమెట్ల, డిసెంబర్ 12: అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో మరో అవినీతి చేప పడింది. రూ.5 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ డీఈ ప్రసాద్‌రావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. కొంపల్లి సర్వేనంబరు 66లో నాన్ డొమెస్టిక్ నిర్మాణం జరుగుతుంది. అందులో ఓ ట్రాన్స్‌ఫార్మర్, అండర్ గ్రౌండ్ కేబుల్ వేసేందుకు బాలనర్సింహ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు.

12/13/2019 - 02:06

నెల్లూరు: ‘ కాకినాడ నుండి చెన్నై వెళ్లే సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల 9న ఒక ప్రయాణికుడి బ్యాగును తనిఖీల పేరుతో నెల్లూరు రైల్వే డి ఎస్పీ వద్ద డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ ఆంజనేయులు మరో ముగ్గురితో కలిసి అపహరించుకుపోయాడు. ఆ బ్యాగులో రూ. 67.5లక్షల నగదు ఉంది.’

12/13/2019 - 01:26

హైదరాబాద్, డిసెంబర్ 12: దిశ కేసులో నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అంశంపై సుప్రీంకోర్టును సంప్రదించాలని అడ్వకేట్ జనరల్‌ను రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరగాలని, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు గురువారం ఉదయం విచారణ ప్రారంభించింది.

12/13/2019 - 01:23

హైదరాబాద్, డిసెంబర్ 12: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ కారు ప్రమాదం కేసులో రాయదుర్గం పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. కారు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణమిలన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం నాడు విచారణ కొనసాగించింది. కృష్ణమిలన్‌రావును జనవరి 3వ తేదీ వరకూ అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఈ సందర్భంగా పోలీసులను ఆదేశించింది.

Pages