S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/05/2019 - 02:51

షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 4: దిశ సంఘటన నిందితుల పోలీస్ కస్టడీపై సస్పెన్స్ వీడింది. బుధ వారం సాయంత్రం ఏడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సోమవారం నుంచి సాగుతున్న ప్రక్రియను పోలీసులు మంగళవారం రాత్రి కూడా గోప్యంగా ఉంచుతున్నారు.

12/05/2019 - 02:50

ఉప్పల్, డిసెంబర్ 4: డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవింగ్‌కు నిండు ప్రాణం బలైంది. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొనడంతో డిగ్రీ ఫస్టయిర్ చదువుతున్న విద్యార్థి దుర్మణం చెందారు. స్థానికులు ఆగ్రహించి బస్సుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. సంఘటన బుధవారం ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

12/05/2019 - 01:27

చండీగఢ్, డిసెంబర్ 4: హర్యానాలోని రోహతక్ జిల్లాలో తండ్రి చేతిలో అత్యాచారానికి గురయిన తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందిందని పోలీసులు బుధవారం తెలిపారు. బాధితురాలి తల్లి కథనం ప్రకారం, ఆమె, కుమార్తెతో కలిసి విడిగా జీవిస్తోంది. నవంబర్ 27వ తేదీన తన భర్త కుమార్తెను తన ఇంటికి తీసికెళ్లి రేప్ చేశాడని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

12/05/2019 - 01:25

కాసరగోడ్, డిసెంబర్ 4: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక అత్యాచారానికి పాల్పడిన 46 ఏళ్ల వ్యక్తికి ఇక్కడి సెషన్స్ కోర్టు బుధవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ముద్దాయి సహజ మరణం పొందేంత వరకు కారాగార శిక్ష అనుభవించాలని సెషన్స్ కోర్టు జడ్జి పీఎస్ శశికుమార్ తీర్పు చెప్పారు. అలాగే ముద్దాయి వీఎస్ రవీంద్రన్ రూ. 25వేల జరిమానా చెల్లించాలని కూడా జడ్జి తన తీర్పులో ఆదేశించారు.

12/05/2019 - 02:38

హైదరాబాద్ / మహబూబ్‌నగర్: శంషాబాద్ వద్ద అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ కేసులో ప్రత్యేక త్వరితగతిన విచారించే న్యాయస్థానం ( ఫాస్ట్‌ట్రాక్ కోర్టు) ఏర్పాటైంది. ఈ కోర్టు నిర్వహణకు వౌలిక సదుపాయాలతో పాటు స్పెషల్ పీపీ నియామకాన్ని కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వ ప్రతిపాదనలను హైకోర్టు ఆమోదించింది.

12/05/2019 - 01:07

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న పోలీస్ బెటాలియన్‌లో ఐదుగురు జవాన్లను కాల్చి చంపిన ఒక జవాన్ తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కడేనార్‌లో ఉన్న ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ల మధ్య బుధవారం వివాదం చెలరేగింది. ఈ వివాదంలో రహ్మన్‌ఖాన్ అనే జవాన్ తన సహచర జవాన్లు ఐదుగురిని కాల్చడంతో వారు అక్కడిక్కడే మరణించారు.

12/05/2019 - 02:05

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు సమయంలో చిదంబరంను ముఖాముఖిగా ఎదుర్కోవడానికి తిరస్కరించిన సాక్షులను చిదంబరం కాని ఆయన తరపున మరెవరయినా కాని అడ్డుకున్నట్టు కాని, బెదిరించినట్టు కాని ఆధారాలు లేవని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.

12/04/2019 - 23:10

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి వెళ్ళేందుకు ప్రయత్నించి అక్కడి అధికారులు అడ్డుకోవడంతో వెనుదిరిగిన ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణకు స్వీకరించనున్నది. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలు ఎవరైనా శబరిమల ఆలయానికి వెళ్ళవచ్చన్న సుప్రీం కోర్టు ఆదేశాలను కేరళ పోలీసులు, ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బిందు అమ్మినీ అనే మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

12/04/2019 - 05:32

ఐ పోలవరం, డిసెంబర్ 3: ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న 55 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమేకాక, చీర మెడకు చుట్టి ఊపిరి ఆడకుండాచేసి హత్యచేసి, ఇంట్లో నగదు దోచుకున్న అమానుష ఘటన తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం జి వేమవరం గ్రామంలో మంగళవారం ఉదయం వెలుగుచూసింది.

12/04/2019 - 05:18

కోయిలకొండ , డిసెంబర్ 3:దేశ రాజధాని ఢిల్లీలో జీవనం కొనసాగిస్తూ సొంత గ్రామంలో అక్క వివాహానికి వచ్చి పెళ్లి జరిగిన మూడో రోజే ప్రమాదవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు కోయిల్‌సాగర్ పెద్ద వాగులో పడి మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కోయలకొండ మండలంలో చోటు చేసుకుంది.

Pages