S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/27/2019 - 04:36

పాయకాపురం, నవంబరు 26: మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఒక యువకుడు మానసిక వైద్య కేంద్రంలో ఉరేసుకుని మృతి చెందాడు. ఈ సంఘటన నున్న గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. నున్న సీఐ ప్రభాకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. కడప ప్రాంతానికి చెందిన రజనీకాంతరెడ్డి కుమారుడు సుజిత్‌రెడ్డి(18) కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు.

11/27/2019 - 04:33

షాద్‌నగర్, నవంబర్ 26: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన షాద్‌నగర్ పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు ఝామున పటణ సమీపంలోని పాత జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు షాద్‌నగర్ పోలీసులు తెలిపారు.

11/27/2019 - 01:59

న్యూఢిల్లీ, నవంబర్ 26: తెలుగుదేశం నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎన్నికల ఖర్చుపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోమని ఆదేశించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్ట చేసింది. జేపీ దివాకర్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలపై అనంతపురం లోక్‌సభ సీపీఐ అభ్యర్థి దేవరగుడి జగదీశ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ సంజీవ్ సచ్‌దేవ్ ధర్మాసనం విచారించింది.

11/27/2019 - 01:12

హైదరాబాద్: యూనియన్లు, జేఏసీ పిలుపు మేరకే ఆర్టీ కార్మికులు సమ్మె చేశారని, ఇప్పుడు వారిని ఉద్యోగాల్లోకి తీసుకోమని ప్రభుత్వాన్ని ఏ క్లాజు కింద ఆదేశించగలమని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. సమ్మెకు యూనియనే్ల బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఇందులో ప్రభుత్వానికి ఏం సంబంధమని నిలదీసింది. ప్రభుత్వ వైఖరి కారణంగా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు,

11/25/2019 - 04:44

గుంతకల్లు : నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రూ. 50 వేల నగదు దోచుకుని ఆ తర్వాత కిందకు తోసేసిన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని తిమ్మనచెర్ల రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. జీఆర్‌పీ పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు..

11/25/2019 - 00:52

న్యూఢిల్లీ/ముంబయి, నవంబర్ 24: మహారాష్టల్రో శుక్రవారం అర్ధరాత్రి నుంచి సాగిన ఉత్కంఠ, ఆసక్తికర సంచలన రాజకీయ పరిణామాలు ఆదివారం మరో మలుపు తిరిగాయి. ఈ మొత్తం వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టి పెట్టింది.

11/25/2019 - 00:32

విజయవాడ (క్రైం), నవంబర్ 24: నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో ఓ భారీ బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయింది. ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల్లో గండి కొడుతూ ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమ మార్గంలో నగలు నల్లమార్కెట్‌కు తరలించే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

11/24/2019 - 07:23

పుట్లూరు, నవంబర్ 23: అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూ వివాదం హత్యకు దారితీసింది. తమ్ముడి కళ్లలో కారం చల్లి కొడవలితో తల నరికాడు ఓ అన్న. ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనగలగూడూరు గ్రామానికి చెందిన గొల్ల హనుమన్నకు ముగ్గురు కుమారులు. తన భూములను కుమారులకు సమానంగా పంచాడు.

11/24/2019 - 15:12

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు కోరు తూ దాఖలైన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. 2016 సంవత్సరం లో రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేసినందున ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పిటీషనర్ తరపున న్యాయవాది జోగిందర్ తులి పిటీషన్‌లో కోరారు.

11/24/2019 - 02:10

హైదరాబాద్, నవంబర్ 23: గ్రేటర్ హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం సృష్టించాయి. కేవలం 12 గంటల వ్యవధిలో మూడు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి నిందితులకోసం గాలిస్తున్నారు. గచ్చిబౌలి పరిధిలోని కొండాపూర్‌లో సత్యనారాయణ(40) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్యచేసి పారిపోయారు. కత్తులతో పొడిచి కిరాతకంగా చంపారు.

Pages