S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

02/18/2017 - 21:08

అక్కినేని నాగార్జున, హథీరామ్‌బాబా జీవిత కథతో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేష్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షిస్తూ దూసుకుపోతోంది.

02/18/2017 - 21:06

అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ శనివారం విడుదలైంది. భిన్నమైన లుక్‌లో అల్లు అర్జున్ కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పటికే ఈ లుక్ సంచలనం రేపుతోంది.

02/18/2017 - 21:04

నవదీప్, కావ్య జంటగా లెజెండ్ పిక్చర్స్ పతాకంపై ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వం లో రమేష్‌బాబు కొప్పుల రూపొందిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ధ్రిల్లర్ చిత్రం నటుడు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడుతూ- ఈ కథ చాలా థ్రిల్లింగ్‌గా వుంటుందని, తనను నటుడిగా మరో మెట్టు ఎక్కించే విధంగా రూపొందిందని తెలిపారు.

02/18/2017 - 21:02

‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విజయ్ ఆంటోని. ఆయన తదుపరి చిత్రంగా రాజకీయ నేపథ్యంలో రూపొందిన చిత్రం యమన్.

02/18/2017 - 20:59

రాజేష్ రాధోడ్, మోనికాసింగ్, షాలు చౌరాసియా ప్రధాన తారాగణంగా కిశోర్ స్వీయ దర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోన్న ‘ఓ పిల్లా నీవల్లా’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ సీడిని విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- పాటలు బాగున్నాయి, తప్పకుండా సినిమా విజయం సాధించాలి అన్నారు. మరో నిర్మాత రాజ్ కం దుకూరి మాట్లాడుతూ- టైటిల్ బాగుంది.

02/18/2017 - 20:57

గ్లామర్ భామ తమన్నాకు గత ఏడాది అంతా కలిసి రాలేదు. చేసిన సినిమాలు పెద్దగా కమర్షియల్ విజయాలు సాధించకపోవడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘అభినేత్రి’ భారీ పరాజయం పాలవడంతో ఈమధ్య అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తమిళంలో రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న తమన్నాకు తెలుగులో కూడా ఓ మంచి అవకాశం దక్కింది.

02/18/2017 - 20:53

రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య జంటగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము రూపొందించిన చిత్రం ‘నేత్ర’ (మై స్వీట్ హార్ట్). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ- అన్ని వర్గాల ప్రజలకు నచ్చేలా ఈ సినిమాను రూపొందించామని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

02/18/2017 - 20:52

ఓం శ్రీ క్రియేషన్స్ పతాకంపై అనీల్‌కుమార్, శృతిలయ జంటగా ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో ఎం.ఎస్.బైరారెడ్డి, నాగరాజు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమభిక్ష’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.

02/18/2017 - 20:50

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో భిన్నమైన సినిమా రోగ్. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న చిత్రం ‘రోగ్’. మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమైంది.

02/17/2017 - 20:55

ప్రముఖ నటుడు చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ తొమ్మిదేళ్ల తరువాత నటించిన ‘ఖైదీ నెం 150’వ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై అనూహ్య విజయాన్ని స్వంతం చేసుకుని ఏకంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. 100 కోట్ల మార్కెట్‌ని క్రాస్ చేసి మెగాస్టార్ హవా తగ్గలేదని రుజువుచేసింది. ఇక ఈ సినిమా ఇచ్చిన ఊపుతో మరిన్ని చిత్రాలు చేయడానికి జోరు పెంచాడు చిరంజీవి.

Pages