S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

10/17/2017 - 19:56

ప్రముఖ హాస్య నటుడు గౌతంరాజు తనయు డు కృష్ణ హీరోగా బిజెఆర్ సమర్పణలో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మిస్తోన్న చిత్రం ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’. శ్రీనాథ్ పులకురం దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఎల్సా ఘోష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రా రంభోత్సం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది.

10/15/2017 - 21:07

అర్జున్‌రెడ్డి...టాలీవుడ్‌లో సంచలనం రేపిన చిత్రం. ఈ మధ్యకాలంలో ఈ రేంజ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా మరొకటి లేదు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ దర్శకుడిగా మారాడు సందీప్. ఆయనకు ఇప్పుడు భారీ అవకాశాలు వస్తున్నాయి. నిర్మాతలు క్యూ కడుతూ ఎంతంటే అంత అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే సందీప్ నెక్స్ట్ ఫోకస్ పవన్ కల్యాణ్‌పై పడింది.

10/15/2017 - 21:05

చిన్న సినిమాలకోసం ప్రత్యేకంగా ఐదో ఆటను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణాగౌడ్, నిర్మాత సాయి వెంకట్ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు.

10/15/2017 - 21:03

రవితేజ, మెహరీన్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న చిత్రం రాజా దిగ్రేట్. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాటల్ని విడుదల చేసారు.

10/15/2017 - 21:00

గోపీచంద్, రాశీఖన్న, అనుఇమాన్యుయెల్ హీరో హీరోయిన్లుగా ఎఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ఆక్సిజన్.

10/15/2017 - 20:58

ఆది సాయికుమార్, రష్మి ముఖ్య పాత్రల్లో నటుడు పి.ప్రభాకర్ దర్శకత్వంలో వి4 మూవీస్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన చిత్రం నెక్స్ట్ నువ్వే. ఈ చిత్రానికి సంగీతం అందించాడు సాయి కార్తీక్. ఇటీవలే విడుదలైన ఈ పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రం ఈనెల 18న విడుదలైన సందర్భంగా సాయి కార్తీక్ చెప్పిన విశేషాలు...

10/15/2017 - 20:56

బాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న ఊర్వశి రౌతాల హేట్ స్టోరీ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే అందరికీ షాకిచ్చింది. ఆ సిరీస్‌లో భాగంగా వస్తున్న హేట్‌స్టోరీ-4 సీక్వెల్ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసారు. మరి ఈ నాలుగో సిరీస్‌తో ఊర్వశి ఇంకెలాంటి సంచలనాలు రేపుతుందో చూడాలి.

చిత్రం..ఊర్వశి రౌతాల

10/15/2017 - 20:54

‘రంగితరంగ’ చిత్రం చూసి ఇన్‌స్పైర్ అయి ‘రాజరథం’ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన ఆర్య, తన మొదటి సినిమాతోనే ఆస్కార్ అవార్డు నామినేషన్ వరకు వెళ్లిన దర్శకుడు అనూప్ భండారీ ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్ మూవీ చేస్తున్నారు. జాలీహిట్స్ ప్రొడక్షన్స్ అధినేత అజయ్‌రెడ్డి గొల్లపల్లి ‘రంగితరంగ’ చిత్రాన్ని తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ అనూప్ భండారీని ‘రాజరథం’ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తున్నారు.

10/15/2017 - 20:52

విజెవైఎస్ ఆర్ట్స్ పతాకంపై పి.ఆర్.బాబు దర్శకత్వంలో కామెడీ, సెంటిమెంట్, హారర్ ప్రధానాంశాలుగా రూపొందనున్న ‘కాళరాత్రి’ చిత్రం షూటింగ్ ఈ నెల 27న గుంటూరు పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. సంగీత దర్శకుడు సత్య కాశ్యప్ (ఐస్‌క్రీమ్ ఫేమ్) సంగీతం సమకూర్చగా గీతామాధురి, అక్షయ్, స్వరరాజ్ గానం చేయగా, నాలుగు పాటలు ఇటీవల రికార్డింగ్ చేసారు.

10/15/2017 - 20:50

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడంతా హిస్టారికల్ మూవీస్ హవా నడుస్తోంది. సౌత్, నార్త్ అని తేడాలేకుండా భారీ నిర్మాణ సంస్థలన్నీ చారిత్రాత్మక చిత్రాల నిర్మాణంపై దృష్టిపెడుతూ భారీ విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పుడదే కోవలో రాబోతున్న చిత్రం ‘సువర్ణ సుందరి’. చరిత్ర భవిష్యత్తును వెంటాడుతుందనేది ట్యాగ్‌లైన్. సూర్య దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్ బానర్‌పై ఎమ్.ఎల్.

Pages