S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

06/25/2017 - 21:33

‘నువ్విలా’, ‘రామ్‌లీల’, ‘జీనియస్’ లాంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించిన హవీష్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘నన్ను వదిలి నీవు పోలేవులే’. జవహర్ బాబు, రమేశ్‌వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా హీరో హవీష్ వివరాలు తెలియజేస్తూ...

06/25/2017 - 21:32

యువ హీరో రాజ్‌తరుణ్ బాబా అవతారమెత్తాడు. తాజాగా అమలాపురంలో షూటింగ్ జరుగుతుండగా ఇటీవల విడుదలైన డిజె చిత్రం చూడటానికి ఆయన బాబా గెటప్‌లో ఓ థియేటర్‌లో సినిమా చూశాడు. తాజాగా ఈ ఫొటోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో రాజ్‌బాబా వచ్చాడంటూ హంగామా చెలరేగింది.

06/25/2017 - 21:30

చిన్మయానంద ఫిలింస్ పతాకంపై శ్రీనాధ్ మాగంటి, సాక్షి కక్కర్, రచ్చరవి, కిరాక్ ఆర్పీ ప్రధాన తారాగణంగా రవివర్మ.వి దర్శకత్వంలో ఎమ్.వి.రమణమూర్తి సమర్పణలో ఎస్.సరిత రూపొందిస్తున్న చిత్రం ‘ఇదేం దెయ్యం’ (ముగ్గురమ్మాయిలతో). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు.

06/24/2017 - 23:29

చైనా-ఇండియా యుద్ధ నేపథ్యంతో రూపొందించిన ‘ట్యూబ్‌లైట్’ సినిమాకు విమర్శకులు, సమీక్షకులు ఇచ్చిన రేటింగ్‌పై సల్మాన్ పరోక్ష విమర్శలు చేశారు. కబీర్‌ఖాన్ దర్శకత్వంలో నిర్మించిన ట్యూబ్‌లైట్ ఈనెల 23న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రతి రంజాన్ సందర్భంగా సల్మాన్ సినిమా రిలీజ్ కావడం ఆనవాయితీగా మారింది. ఈసారి ట్యూబ్‌లైట్‌తో సల్మాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

06/24/2017 - 23:28

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందించిన డిజె - దువ్వాడ జగన్నాథమ్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. చిత్ర కథానాయిక పూ జా హెగ్డే చిత్ర విశేషాలను వివరించారు.
సినిమాకు ఆదరణ ఎలా ఉంది?
-సినిమా రెస్పాన్స్ బాగుం ది. నేను నటించిన సినిమా ల్లో ఈ సినిమాకు వ స్తున్న రెస్పా న్స్ చూస్తుంటే ఉద్వేగంగా ఉంది. ఈ విజయాన్ని చూసి ఆనందిస్తున్నా.

06/24/2017 - 23:27

అటు దక్షిణాదిలో ఇటు ఉత్తరాదిలో తనకంటూ ఇమేజ్ సృష్టించుకున్న కథానాయిక శ్రుతిహాసన్. మొదట్లో సరైన అవకాశాలు రాని ఈమెకు ప్రస్తుతం వరుసబెట్టి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఇటీవల ఆమె జోరుకు చుక్కెదురైనట్లుంది. తమిళంలో తేనాండాల్ ఫిలింస్ సంస్థ ‘సంఘమిత్ర’ పేరుతో భారీ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్‌ను ఎంపికచేశారు.

06/24/2017 - 23:26

అలనాటి అందాల నాయిక నిరోష, రాధిక చెల్లెలుగా పరిచయమైన ఆమె, కొన్ని సినిమాల తరువాత తెరమరుగయ్యారు. చాలాకాలం తరువాత మళ్లీ యునైటెడ్ ఫిలిం పతాకంపై సుధాకర్ కోమాకుల హీరోగా రూపొందిస్తున్న ‘నువ్వు తోపువురా’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. నిత్యాశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.శ్రీకాంత్, హరనాధ్‌బాబు.బి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.

06/24/2017 - 23:23

వెంకీ, లాస్య జంటగా పి.యు.కె ప్రొడక్షన్స్ పతాకంపై నిర్ణయం దీపికా కృష్ణ రూపొందిస్తున్న చిత్రం 3తొలి పరిచయం2. ఇంద్రగంటి సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం ఉదయం జరిగింది. నటుడు మురళీమోహన్ బిగ్ సీడీ, సీడీని విడుదల చేసి సినిమా యూనిట్‌కు అందించారు.

06/24/2017 - 23:23

రానా ప్రధాన పాత్రలో సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ పానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తేజ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 3నేనే రాజు నేనే మంత్రి2. ఈచిత్రానికి సంబంధించి ట్రైలర్లు ఇటీవల విడుదలయ్యాయి. నిర్మాతలు సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ- కేవలం 24 గంటల్లోనే 4 మిలియన్ల వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలు పెంచాయని, నేటితో షూటింగ్ పూర్తిచేస్తున్నామని అన్నారు.

06/24/2017 - 23:22

బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 3పైసా వసూల్2కు సంబంధించిన షూటింగ్ చివరిదశలో ఉంది. పోర్చుగల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. రెండు పాటలు కూడా అక్కడే చిత్రీకరించారు. తాజాగా రెయిన్ ఫైట్‌ను బాలయ్య విలన్లతో భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సినిమాకే హైలెట్‌గా వుంటుందని యూనిట్ చెబుతోంది.

Pages