S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/17/2017 - 20:20

అభి, ఢీ ఆకాష్, అభిషేక్, అనూష ప్రధాన తారాగణంగా ధృవ ఆర్ట్ ఫిలిం పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ఒక రాధ ముగ్గురు కృష్ణులు’. పరకోటి బాలాజీ దర్శకత్వంలో శ్రీరంగ సతీష్‌కుమార్ సమర్పణలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ సారధి స్టూడియోలో జరిగింది. క్లాప్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఇవ్వగా, సాయి వెంకట్ స్విచ్చాన్ చేశారు.

11/17/2017 - 20:19

నూతన నటులు మేఘన, సంతోషి శర్మ, సల్మా న్, హిమజ, మానస, అజయ్ ప్రధాన తారాగణంగా లాగిన్ మీడియా పతాకంపై కృష్ణ కార్తీక్ దర్శకత్వం లో వై.విజయకుమార్ గౌడ్ రూపొందించిన చిత్రం ‘హెచ్‌బిడి’ (హ్యాక్‌డ్ బై డెవిల్). ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ‘ఏ’ సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రానికి సంబంధించిన పాత్రికేయల సమావేశం హైదరాబాద్‌లో శుక్రవారం ఉద యం నిర్వహించారు.

11/17/2017 - 20:17

సినీ రంగంలో మహిళల వేధింపులపై మహిళలు బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అని అంటోంది నేహా ధూపియా. ఇటీవల అన్ని చిత్ర పరిశ్రమల్లో లైంగిక వేధింపులపై చర్చ జరుగుతున్న విషయం విదితమే. పలువురు కథానాయికలు ఈ అంశంపై తమ అనుభవాలను ఏదో ఒక మాథ్యమం ద్వారా బాహాటంగా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో బాలీవుడ్ కథానాయిక నేహా ధూపియా స్పందించింది.

11/17/2017 - 20:16

అనుష్క ప్రధాన పాత్రలో యు.వి.క్రియేషన్స్ పతాకంపై అశోక్.జి దర్శకత్వంలో వంశి, ప్రమోద్ రూపొందించిన ‘్భగమతి’ చిత్రం జనవరి 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో అనుష్క గెటప్ అందరినీ ఆకర్షిస్తోందని, ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూడాలన్న క్రేజ్ తెచ్చుకుందని తెలిపారు.

11/16/2017 - 20:01

మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథపై దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ సినిమా ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. లక్ష్మీపార్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగే ఈ కథలో లక్ష్మీపార్వతి పాత్రలో సౌత్ హాట్ భామ లక్ష్మీరాయ్ నటిస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆ పాత్రకోసం రాజశేఖర్ హీరోయిన్‌ని దింపుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? పూజాకుమార్!

11/16/2017 - 20:00

బాలీవుడ్ సంచలన తార విద్యాబాలన్.. అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ దుమారం రేపడం మనం చూస్తున్నదే. తాజాగా ఆమె భారతీయ సంస్కృతి గురించి ఘాటుగా స్పందించింది. వివాహం అనేది కేవలం పిల్లలను కనడానికి మాత్రమే అని.. అదే భారతీయ సంస్కృతి అని పేర్కొంది. సన్నిహిత్యంలోనే ఆనందం ఉందని, సెక్స్ అనేది ఓ భావన మాత్రమే అని, అది చర్య కాదనే సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యం ఉందని చెప్పింది.

11/16/2017 - 19:56

‘డిటెక్టివ్’ చిత్రంలో నేను చేసిన మూడు ఫైట్ సీన్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. డైలాగ్ చెప్పినపుడు ఎంత పవర్‌ఫుల్‌గా వుంటుందో ఈ మూడు ఫైట్ సీన్లు అంత పవర్‌ఫుల్ దర్శకుడు రూపొందించారు. గోడౌన్ ఫైట్, చైనీస్ రెస్టారెంట్ ఫైట్, మూడోది క్లైమాక్స్ ఫైట్ సినిమాలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అంశాలుగా వౌత్ టాక్‌తో ఈ చిత్రం ఆదరణ పొందింది అని కథానాయకుడు విశాల్ తెలిపారు.

11/16/2017 - 19:54

హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో మరో చిత్రాన్ని అందిస్తున్నారు. విశాల్, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అభిమన్యుడు పేరు ఖరారు చేశారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ వైవిధ్యమైన పాత్రలో నటిస్తుండడం విశేషం. సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఈనెల 18న విడుదల చేయనున్నారు.

11/16/2017 - 19:52

హాస్య కథానాయకుడు హీరోగా సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో డా.రవికిరణ్ రూపొందించిన తాజా చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. హిందీలో విజయవంతమైన ‘జాలీ ఎల్‌ఎల్‌బి’ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను యువ కథానాయకుడు రామ్‌చరణ్ విడుదల చేయనున్నారు.

11/16/2017 - 19:51

ఆలూరి క్రియేషన్స్ పతాకంపై వాయుతనయ్, శశి, దేవి ప్రసాద్ కీలక పాత్రల్లో మోహన్ రావిపాటి దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న చిత్రం ‘నేనే ముఖ్యమంత్రి’. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎన్.శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, జీవిత రాజశేఖర్ క్లాప్‌నిచ్చారు.

Pages