S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/14/2017 - 20:53

రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ పతాకంపై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో ఐతం ఎస్ కమల్ రూపొందించిన చిత్రం ఉందా లేదా. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల దర్శకుడు మారుతి విడుదల చేశారు.

02/14/2017 - 20:51

ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, లవ్‌లీ వంటి లవ్‌స్టోరీస్‌ని అందించిన ఆర్.జె. సినిమాస్ బేనర్‌నుంచి మరో ప్రేమకథా చిత్రం ‘వైశాఖం’ వస్తోంది. హరీష్, అవంతిక జంటగా ఆర్.జె. సినిమాస్ పతాకంపై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ.బి దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

02/14/2017 - 20:46

నోరా ఫతేహిని టాలీవుడ్ జనాలకు ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ‘టెంపర్’, ‘బాహుబలి’, ‘కిక్-2’, ‘షేర్’, ‘లోఫర్’, ‘ఊపిరి’... ఇలా వరుసగా తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి తెలుగు ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించేసుకుంది. అయితే ఎంత స్పీడ్‌గా సినిమాలు చేసిందో ఇప్పుడు కొత్త సినిమాల విషయంలో అంతగా అలర్ట్‌గా వుంది.

02/12/2017 - 21:07

‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్, ఈ సినిమా కోసం తన మూడేళ్ల కెరీర్‌ను పణంగా పెట్టాడు. ప్రస్తుతం ‘బాహుబలి-2’ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్, తన తదుపరి చిత్రాలపై దృష్టిపెట్టాడు. ఆయన నెక్స్ట్ సినిమా సుజిత్ దర్శకత్వంలో వుంటుందని ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభాస్ కూడా తెలిపాడు.

02/12/2017 - 21:05

మెగాస్టార్‌గా తెలుగుతెరపై తిరుగులేని ఇమేజ్‌ని స్వంతం చేసుకున్న చిరంజీవి ఎనిమిదేళ్ల గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇస్తూ నటించిన ‘ఖైదీ నెం 150’ చిత్రంతో తన సత్తా తగ్గలేదని, ప్రేక్షకుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ చిత్రం విడుదలై 100 కోట్ల మార్కెట్ దాటి సంచలనం రేపింది. ప్రస్తుతం వున్న హీరోలకు ఈ సినిమాతో తాను పోటీ ఇస్తున్నానని చెప్పకనే చెప్పాడు.

02/12/2017 - 21:02

అక్కినేని నాగార్జున, ప్రగ్యాజైస్వాల్, అనుష్క ముఖ్యపాత్రల్లో సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం మంచి హిట్ టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.

02/12/2017 - 21:00

నారారోహిత్, సందీప్‌కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న శమంతకమణి చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల క్లాప్‌నివ్వగా, నిర్మాత ఆనంద ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు రాజేంద్ర ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.

02/12/2017 - 20:57

గత ఏడాది చేసిన సినిమాలు తమన్నాకు అంతగా ఉత్సాహాన్ని అందించలేకపోయాయి. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న అభినేత్రి చిత్రం భారీ పరాజయాన్ని సాధించడంతో కాస్త కృంగిపోయింది. మళ్లీ మంచి సక్సెస్‌తో తన సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్న తమన్నాకు మరో క్రేజీ అవకాశం దక్కింది. ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ తరువాత కొంత గ్యాప్ తీసుకుని తన తదుపరి చిత్రాన్ని ఇటీవలే మొదలుపెట్టాడు ఎన్టీఆర్.

02/12/2017 - 20:55

సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న విన్నర్ చిత్రం ఈనెల 24న విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు.

02/12/2017 - 20:53

నాని, కీర్తి సురేష్ జంటగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘నేను లోకల్’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా రన్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి తమ విజయాన్ని పంచుకున్నారు.

Pages