S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/12/2017 - 20:50

విజయ్ ఆంటోని కథానాయకుడిగా ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై జీవశంకర్ దర్శకత్వంలో మిర్యాల రవిందర్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా ‘యమన్’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో శనివారం రాత్రి జరిగింది.

02/12/2017 - 20:49

మహేష్‌బాబు భార్య, ఒకప్పటి మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ మళ్లీ సినిమాల్లో నటించనున్నారు. 2005లో ‘బ్రైడ్ అండ్ ప్రిజుడీస్’ అనే ఆంగ్ల సినిమాలో నటించిన ఆమె, ఆ తరువాత ఏ చిత్రంలో నటించలేదు. ఇన్నాళ్లూ భర్త మహేష్‌బాబుకు సంబంధించిన వ్యవహారాలు, వ్యాపార విషయాలు, కుటుంబ పరమైన విషయాలను చూసుకుంటూ వచ్చిన ఆమె ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

02/11/2017 - 21:08

ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నోసార్లు వాయిదా పడినా సింగం-3 విడుదలైన అన్ని కేంద్రాల్లో గర్జిస్తోంది. ప్రతి షో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సాగుతూ తన స్టామినాను చూపిస్తోంది అని నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలిపారు. సూర్య, అనుష్క, శ్రుతిహాసన్ ప్రధాన తారాగణంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలుగులో అందించిన చిత్రం ‘సింగం-3’. ఈ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలు తెలిపారు.

02/11/2017 - 21:06

వెంకటేష్ కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘గురు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వేసవి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు సుధ మాట్లాడుతూ- స్ట్రాంగ్ ఎమోషన్‌లతో వుండే ఆటలకు సంబంధించిన డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించామని, ఈ నెల 17న పాటను విడుదల చేయనున్నామని తెలిపారు.

02/11/2017 - 21:04

సందీప్‌కిషన్, రెజీనా జంటగా నటించిన ‘మాననగరం’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రభు రూపొందించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది. మార్చి 10న విడుదల చేయనున్నారు. ధ్రిల్లర్ జోనర్‌లో రూపొందించిన ఈ సినిమా తాము గతంలో నిర్మించిన మాయ చిత్రంకన్నా విజయవంతం అవుతుందని నిర్మాత తెలిపారు.

02/11/2017 - 21:02

అంజలి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషలో రూపొందిస్తున్న చిత్రం చిత్రాంగద. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా, క్రియేటివ్ ద్రావిడన్స్ పతాకాలపై అశోక్.జి. దర్శకత్వంలో గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్‌లు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

02/11/2017 - 21:00

రాహుల్ హీరోగా గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారథ్యంలో ఐదో చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం వెంకటాపురం. మహిమా మక్వాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాశీవిశ్వనాథ్, అజయ్, జోగిబ్రదర్స్, అనితా, శశాంక్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ అండ్ సెకెండ్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. పోస్టర్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ విడుదల

02/11/2017 - 20:58

కామసూత్ర సినిమాతో ప్రేక్షకులకు హీటెక్కించిన హాట్‌గాళ్ షెర్లిన్‌కు ఆ సినిమా విడుదల కాకపోవడంతో ఎంతో క్రేజ్ తెచ్చుకుంటాననుకున్న కలలు కల్లలయ్యాయి. ఇండియానుండి మొదటిసారి ప్లేబాయ్ మేగ్‌జైన్‌కోసం మోడల్‌గా మారి న్యూడ్ ఫొటోలతో అదరగొట్టిన ఈ అమ్మడికి బాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. పోనీ తెలుగులో ట్రై చేద్దామా అంటే ఇక్కడా పరిస్థితి బాగోలేదు. మొత్తానికి ఓ హిందీ సినిమా చేస్తోంది.

02/11/2017 - 20:55

సత్యదేవ్ హీరోగా, ప్రియాలాల్ హీరోయిన్‌గా ఆకార్ మూవీస్ పతాకంపై మోహన్ బొమ్మిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దాము కొసనం, జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం ‘గువ్వా గోరింక’. ఈ చిత్రానికి ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు.

02/11/2017 - 20:54

బాలీవుడ్‌లో పేరుమోసిన నటులు అమీర్‌ఖాన్, షారుక్‌ఖాన్ పాతికేళ్లుగా ఒకరికొకరు తెలిసినవారే. అయితే వారి మధ్య పెద్దగా సంబంధాలు లేవు. సల్మాన్‌ఖాన్‌తోనూ షారుక్‌కు అంతంతమాత్రం సంబంధాలే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో సల్మాన్, షారుక్‌ల స్నేహబంధం చిగురించింది. విబేధాలు లేవంటూ ఇద్దరూ కలసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. కూడా కానీ అమీర్‌తో అలాంటి చనువు షారుక్‌కు లేదు.

Pages