S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/05/2017 - 04:49

హాలీవుడ్‌లో రూపొందిన ప్యాసెంజర్స్ చిత్రం తెలుగులో విడుదలకు ముస్తాబవుతోంది. మార్టెన్ ట్రైయిడమ్ దర్శకత్వంలో క్రిష్ ప్రాట్, జెన్నిఫర్ లారెన్స్ నటించిన రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ అడ్వంచర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల ఆరున విడుదలకు సిద్ధమైంది.

01/04/2017 - 06:10

అక్కినేని నాగార్జున యువహీరోలతో నటిస్తుండడం మంచి పరిణామం అని సినీ విశే్లషకులు భావిస్తున్నారు. యువ కథానాయకుడు నిఖిల్ ప్రధాన పాత్రలో రూపొందించే చిత్రంలో నాగ్ నటిస్తారని సమాచారం. ప్రేమమ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారని, పేరు ఇంకా నిర్ణయించని ఈ చిత్రాన్ని అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై రూపొందించనున్నట్టు తెలుస్తోంది.

01/03/2017 - 21:05

జయ.బి దర్శకత్వంలో ఆర్.జె.సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న చిత్రం వైశాఖం. ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసిన సందర్భంగా దర్శకురాలు జయ.బి. మాట్లాడుతూ, ‘లవ్‌వీ తర్వాత హిట్ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా ఇది. ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ కలసిన ఈ చిత్రం అపార్ట్‌మెంట్స్ నేపథ్యంలో సాగుతుంది.

01/03/2017 - 21:01

‘మెగాస్టార్’ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం.150’ ముందస్తు విడుదల వేడుకను గుంటూరు జిల్లా చిన్నకాకాని వద్ద హాయ్‌లాండ్‌లో నిర్వహిస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఈనెల 7న సాయంత్రం ‘బాస్ ఈజ్ బాక్’ పేరుతో జరిగే ఈ వేడుకలో దాదాపు 5వేల మంది అభిమానులు వస్తున్నారని, చిరంజీవి కుటుంబ సభ్యులంతా హాజరవుతారని, పవన్‌కళ్యాణ్ అందుబాటులో వుంటే తప్పక వస్తారని అన్నారు.

01/03/2017 - 20:59

రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల జంటగా రెడ్డెమ్ యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము రూపొందిస్తున్న చిత్రం నేత్ర (మై స్వీట్ హార్ట్). ఉదయ్ నాగ్త్రన్ అందించిన ఆడియో ఇటీవల విడుదలైంది. నిర్మాత రాము మాట్లాడుతూ, ట్రైలర్‌కు, పాటలకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు.

01/03/2017 - 20:58

శ్రీ శ్రీనివాసా ఫిలింస్ బ్యానర్‌లో ఎస్.పి.నాయుడు నిర్మాతగా టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో అశోక్ చంద్ర, రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య హీరో హీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. దర్శకుడు కరణ్‌రాజ్ మాట్లాడుతూ- ‘ప్రియుడికి ఇచ్చిన మాటకోసం తన వాళ్ళను వదులుకుని, ఓ రాతి మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే ఓ మేఘమాల కథ. ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి ప్రేమకథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుంది’ అన్నారు.

01/03/2017 - 20:56

మేఘన, సంతోషి, సల్మాన్, హిమజ ప్రధాన తారాగణంగా కృష్ణకార్తిక్ దర్శకత్వంలో లాగిన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై వై.ఉదయభాస్కర్ రూపొందిస్తున్న చిత్రం ‘హ్యాక్డ్ బై డెవిల్’ (హెచ్‌బిడి). ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఇటీవల విడుదల చేశారు. పాటలకు బాణీలు మహి మదన్ అద్భుతంగా అందించారని నిర్మాత ఉదయభాస్కర్ తెలిపారు. దెయ్యం కౌగిలిలో సేద తీరితే ఎలా వుంటుంది?

01/03/2017 - 20:53

ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం టీమ్ 5. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దీన్ని రూపొందిస్తున్నారు. నిర్మాత రాజ్ జకారియాస్ మాట్లాడుతూ- ‘ఇండియన్ మాజీ స్టార్ క్రికెటర్ శ్రీశాంత్‌ని సిల్వర్ స్క్రీన్ మీద చూపించే అవకాశం మాకు దక్కింది. ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా ఉండే క్యారెక్టర్ కావడంతో మంచి ఎనర్జీతో చేస్తున్నాడు.

01/03/2017 - 20:52

పెళ్లిచూపులు చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్, అల్లు అరవింద్ కాంబినేషన్‌లో గీతా ఆర్ట్స్ పతాకంపై ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. నిర్మాత బన్నీవాసు విశేషాలను తెలుపుతూ తమ సంస్థలో గత సంవత్సరంలో నిర్మించిన మూడు సినిమాలు విజయవంతమయ్యాయని, దర్శకుడు పరశురామ్ మంచి కథ చెప్పడంతో సింగిల్ సిటింగ్‌లోనే నచ్చి సినిమా షూటింగ్ ప్రారంభించనున్నామని తెలిపారు.

01/03/2017 - 20:51

ఎస్.ఆర్.పి. విజువల్ పతాకంపై రాం కార్తీక్, భాను త్రిపాఠి జంటగా బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ నిర్మించిన చిత్రం ‘ఇద్దరిమధ్య 18’. చిత్ర నిర్మాత శివరాజ్‌పాటిల్ మాట్లాడుతూ, ‘యూత్‌ని ఆకట్టుకునే అంశంతో, చక్కని మెసేజ్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు నాని ఆచార్య తెరకెక్కించారు.

Pages