S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/25/2016 - 21:21

భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ దర్శకుడు రాజవౌళికి కూడా ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టింది. ప్రస్తుతం బాహుబలి-2 సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న ఆయన హాట్ దర్శకుడిగా మారిపోయాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ అనే భాషాభేదం లేకుండా ఏ హీరో, హీరోయిన్ అయినా ఆయన దర్శకత్వంలో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాజవౌళి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. అనే దిశగా వారి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

11/25/2016 - 21:20

బాహుబలి సంచలన విజయం తరువాత బాహుబలి-2 చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం తను మూడేళ్ల సినీ జీవితాన్ని త్యాగం చేసిన ప్రభాస్ బాహుబలి తరువాత తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ప్రభాస్ తరువాతి సినిమా రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో రూపొందనుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

11/25/2016 - 21:19

అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘ఓం నమో వేంకటేశాయ’ ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత హారర్ నేపథ్యంలో రూపొందే చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. బుల్లితెర యాంకర్‌గా పాపులర్ అయిన ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది’ చిత్రం ఘన విజయం సాధించింది.

11/25/2016 - 21:18

జీవా, కాజల్ జంటగా డి.కె. దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘కావలైవేండామ్’ చిత్రాన్ని తెలుగులో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ ‘ఎంతవరకు ఈప్రేమ’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం తమిళంలో నిన్న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ- ‘యువతరం మెచ్చే అద్భుతమైన ప్రేమకథా చిత్రమిది.

11/25/2016 - 21:16

చందన్‌కుమార్, సంగీత చౌహాన్ జంటగా సమీస్ మ్యాజిక్ సినిమా పతాకంపై ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘లవ్ యు ఆలియా’. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల సందర్భంగా దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ మాట్లాడుతూ,-‘అందర్నీ ఆకట్టుకునే చక్కని ప్రేమ కథా చిత్రమిది. యువజంట చందన్‌కుమార్, సంగీత చౌహాన్‌లతోపాటు ప్రముఖ నటి భూమిక, సుదీప్, సన్నీలియోన్ ప్రత్యేక పాత్రలు పోషించారు.

11/25/2016 - 21:16

ఖమ్మం క్రియేషన్స్ బ్యానర్‌పై చిత్రం శ్రీను, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులుగా నెప్పలి కృష్ణ దర్శకత్వంలో సరోజిని, దేవా, కోటయ్య, రమణారెడ్డి నిర్మాతలుగా తెరకెక్కుతున్న చిత్రం మయసభ. ఈ సందర్భంగా చిత్రం శ్రీను మాట్లాడుతూ- ‘ఒకే షెడ్యూల్‌లో సినిమా పూర్తిచేయాలని సంకల్పించి ఖమ్మం, కృష్ణా జిల్లా మైలవరం, హైదరాబాద్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. ఈ చిత్రంలో నాలుగు పాటలుంటాయి.

11/25/2016 - 21:15

ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చలకు తెరలేపిన వార్త ఇదే. నాచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నానితో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా సినిమా చేస్తుందట. అయితే ఈ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా కాదు నిర్మాతగానట. ఆ వివరాల్లోకి వెళితే, బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతూ, మరోవైపు హాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగా అడుగులేస్తోంది.

11/25/2016 - 21:14

వికాస్, కళ్యాణి జంటగా దుర్గాదేవి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై ఎన్.డి.ఉదయ్ కుమార్ దర్శకత్వంలో కనవరెడ్డి నాగేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీ జాన్’. దర్శకుడు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ-‘ఇదొక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనింగ్ మూవీ. చిన్న సినిమా అయినా అందరూ ఇష్టపడి చేసిన సినిమా. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది.’అని చెప్పారు.

11/25/2016 - 21:13

అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తూ ‘అఖిల్’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ సినిమా వచ్చి ఏడాదికిపైగా అయినా ఇప్పటికీ అఖిల్ తదుపరి చిత్రం ఏమిటన్నది ప్రశ్నగానే మిగిలింది. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరిపిన అఖిల్ ఫైనల్‌గా మనం ఫేం విక్రంకుమార్‌కు ఓకె చెప్పాడు.

11/25/2016 - 03:56

‘అవును’, ‘సీమటపాకాయ్’ చిత్రాలతో హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంది పూర్ణ. తాజాగా కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా శివరాజ్ ఫిలింస్ బ్యానర్‌పై శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో రూపొందిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా పూర్ణ చెప్పిన విశేషాలు...
రాణి పాత్రలో..

Pages