S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/20/2016 - 21:06

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అందరికీ క్రేజ్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ సినిమాలు బాలయ్య మాస్ ఫాలోయింగ్‌ను ఓ రేంజ్‌కి తీసుకెళ్లిపోయారు. బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని హిట్లుగా నిలిచాయి. బోయపాటి కూడా ఈ సినిమాలతో సీనియర్ స్టార్ హీరోల ఇమేజ్‌ను మోయగల అతికొద్దిమంది దర్శకుల్లో ఒకడిగా నిలబడిపోయాడు.

11/20/2016 - 21:04

నటుడుగా ఉన్నత శిఖరాలను అధిరోహించి, ‘జనసేనాని’గా ఎదుగుతున్న పవన్‌కళ్యాణ్ తాజాగా పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. పెద్దనోట్ల రద్దువల్ల సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయపడిన పవన్‌కల్యాణ్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిందని అన్నారు. కొత్తనోట్లు పూర్తిస్థాయిలో ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో కేంద్రప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు.

11/20/2016 - 21:02

బాలీవుడ్‌లో వచ్చిన సంచలన సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. ఈ సినిమా మొదటి భాగం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’, ‘లగేరహో మున్నాభాయ్’ సినిమాలతో దుమ్ములేపిన సంజయ్‌దత్.. ఇప్పుడు మూడో మున్నాభాయ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘మున్నాభాయ్ చలే అమెరికా’ అంటూ అప్పట్లోనే చిన్న టీజర్ కూడా వదిలారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో విధు వినోద్‌చోప్రా నిర్మించే ఈ మూడో సీక్వెల్ ఫైనల్ అయిందట.

11/20/2016 - 21:01

అందాల భామ త్రిష... ఈమధ్య సెకండ్ ఇన్నింగ్ మొదలుపెట్టి కానె్సప్టు ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. క్రేజ్ తెచ్చుకోవడానికి సిద్ధం అయింది. ఇప్పటికే ‘మోహిని’ చిత్రంలో నటిస్తున్న ఈ భామ సాధురంగా వెట్టై సినిమాలో నటిస్తుంది. ఇక లేటెస్ట్‌గా త్రిషకు మరో బంపర్ ఆఫర్ దక్కింది. ఇదేమిటో తెలుసా. పవన్‌కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందట!! ఇప్పటికే ఈ అమ్మడు ‘తీన్మార్’ సినిమాలో పవన్‌తో కలిసి నటించింది..

11/20/2016 - 20:59

శ్రీనివాస్‌రెడ్డి, పూర్ణ ప్రధాన తారాగణంగా శివరాజ్ కనుమూరి రూపొందించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను ఎఫ్‌ఎం రేడియోలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రవిచంద్ర మాట్లాడుతూ.. కార్తీక్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్‌గా ఉంటుందని, దర్శకుడు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని తెలిపారు.

11/20/2016 - 20:57

తమిళ హీరోయిన్ వరలక్ష్మి అంటే తెలుసా? ఈ పేరుచెబితే ఎవరికీ తెలియదు. కానీ హీరో విశాల్ లవర్ అంటే మాత్రం అందరు గుర్తుపడతారు. స్టార్ హీరో శరత్‌కుమార్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విశాల్ లవర్‌గానే పాపులర్ అయింది. ఈమధ్య విశాల్, వరలక్ష్మిల మధ్య ఎందుకు చెడిందో తెలియదు కానీ ఇద్దరిమధ్య దూరం బాగా పెరిగింది. లేటెస్ట్‌గా వరలక్ష్మి..

11/20/2016 - 20:55

ఒక సినిమాలో ఒక లిప్‌లాక్ సీన్ ఉండడం అనేది ఎంత క్రేజో అందరికి తెలుసు. ఆ సినిమాలో ఆ ముద్దు సన్నివేశం ఎప్పుడు వస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూసే ఆడియెన్స్ ఉంటారు. ఇక ఈమధ్య ప్రతి సినిమాలో ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల్లో ఈ ఘాటు లిప్‌లాక్‌లకు కొదవే లేకుండా పోయింది. జనరల్‌గా ఒక్క లిప్‌లాక్ ఉంటేనే అంత క్రేజ్ ఉంటే... ఈ సినిమాలో ఏకంగా 40 లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయట!!

11/19/2016 - 21:47

రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘ధ్రువ’. స్టైలిష్ ఎంటర్‌టైనర్‌గా హై బడ్జెట్, టెక్నికల్ విలువలతో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 9న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. రామ్‌చరణ్ పవర్‌ఫుల్ ఐపిఎస్ అధికారిగా కనిపించనున్నాడు.

11/19/2016 - 21:46

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న హాట్ భామ తమన్నా..
మంచి జోరుమీదుంది. ఓవైపు హీరోయిన్‌గా క్రేజీ స్టార్స్‌తో సినిమాలు చేస్తూనే మరోవైపు.. సెలెక్టివ్‌గా ఐటెం సాంగ్స్ చేస్తోంది. ప్రస్తుతం
తమిళంలో విశాల్ సరసన ‘కత్తిసందై’ (తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’),
తెలుగులో ‘బాహుబలి-2’ చిత్రాల్లో నటిస్తున్న తమన్నా, మరోవైపు
బాలీవుడ్‌లో కూడా ప్రయత్నాలు చేస్తోంది. లేటెస్టుగా ఈ భామకు

11/19/2016 - 21:33

* గోవాలో నేటినుంచి ఇఫి-2016
* 90 దేశాల ప్రతినిధుల రాక
* 300 సినిమాల మధ్య పోటీ
* ఇండియన్ పనోరమాలో 22 సినిమాలు
* నేపథ్య గాయకుడు బాలూకు సెంటినరీ అవార్డు

Pages