S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/22/2016 - 21:00

తమిళ, తెలుగు భాషల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్య, హన్సిక జంటగా మగిల్ తిరుమేని దర్శకత్వంలో తమిళంలో రూపొందిన మీగమాన్ చిత్రాన్ని సర్వల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సూర్య సాకేత్ పిక్చర్స్ పతాకాలపై మండే సూర్యుడు పేరుతో విడుదల చేస్తున్నారు. బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కొలన ఎల్లారెడ్డి, సర్వల గణేష్ యాదవ్ నిర్మాతలు.

11/22/2016 - 20:58

ప్రముఖ నటుడు చిరంజీవి, కాజల్ జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఖైదీ నెం.150. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే యూరప్‌లో రెండు పాటల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ‘ఇటీవలే పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లాం. అక్కడ క్రొయేషియా, స్లోవేనియా వంటి అద్భుతమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించాం.

11/22/2016 - 20:57

రాఘవేంద్ర లారెన్స్, రితికా సింగ్ జంటగా ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి.పిళ్లై నిర్మిస్తున్న చిత్రం ‘శివలింగా’. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పాత్రికేయుల సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ- ‘పదేళ్ల క్రితం కన్నడంలో ఆప్తమిత్ర సినిమా తీశాను. అది పెద్ద హిట్ కావడంతో దానే్న చంద్రముఖి పేరుతో రీమేక్ చేశాను.

11/22/2016 - 20:54

పెళ్లికి ముందు డేటింగ్ చేయడం తప్పని అందరూ అనుకుంటారు. కానీ అలా గమనిస్తేనే కాబోయే భర్తకు సంబంధించిన విషయాలను గుర్తించవచ్చు. నచ్చితేనే పెళ్లి, లేదంటే నచ్చినవాణ్ని వెతుక్కోవటమే అని చెబుతోంది అందాల నటి విద్యాబాలన్! పెళ్లై సంసార జీవితం గడుపుతున్న ఈ అమ్మడు ఇప్పుడు డేటింగ్ గురించి చెప్పటం ఏమిటా? అని అనుకోకండి. ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో విద్యాబాలన్‌కు సాటి ఎవరూ లేరు.

11/22/2016 - 20:52

అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మలయాళంలో రూపొందిన పులి మురుగన్ చిత్రం కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ప్రముఖ నటుడు మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వైశాఖ్ దర్శకత్వం వహించాడు. దీన్ని శ్రీ సరస్వతీ ఫిలింస్ పతాకంపై మన్యం పులి పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

11/22/2016 - 20:50

నవీన్‌చంద్ర, పృథ్వీ నటించగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందించిన చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. శృతిసోధి, సలోని కథానాయికలుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది.

11/22/2016 - 20:48

చేసింది రెండు మూడు సినిమాలు అయినాగానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో కీర్తిసురేష్ గురించే మాట్లాడుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు సరసన ఒకేసారి హీరోయిన్‌గా ఛాన్సులు కొట్టేయడంతో అందరి దృష్టీ కీర్తి సురేష్‌పై పడింది. పూర్తి బిజీలో వుంటూనే తన సినిమాలతో పరిశ్రమను ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా కీర్తి సురేష్ ‘నేను లోకల్’ అనే సినిమాకు సంబంధించిన షూటింగ్‌కు సంబంధించి హైదరాబాద్‌లో నటిస్తోంది.

11/22/2016 - 20:46

విజయ్ ఆంటోని కథానాయకుడిగా మానస్ రుషి ఎంటర్‌ప్రైజెస్, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకాలపై ఎస్.వేణుగోపాల్, కె.రోహిత్ అందిస్తున్న చిత్రం ‘బేతాళుడు’. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.

11/20/2016 - 21:10

చిరంజీవి, కాజల్ జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొణిజెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్, ఎ.సుభస్‌కరన్ రూపొందిస్తున్న చిత్రం ‘ఖైదీ నెం.150’. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను యూరప్‌లో పూర్తిచేశారు. చిత్ర యూనిట్ తిరిగి భారతదేశానికి వచ్చింది.

11/20/2016 - 21:08

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో నా పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపు 90 శాతం రాత్రి పూటే చేశారు. రాత్రి అవడంతో నా కళ్లు కూడా పాత్రకు బాగా సూటయ్యాయి. అందుకే చిత్రం చూస్తున్న ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారని కథానాయిక నందితా శే్వత అంటోంది. నిఖిల్, హెబ్బాపటేల్, నందితాశే్వత ప్రధాన తారాగణంగా వి.ఐ.

Pages