S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/23/2016 - 21:53

రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్క సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకురోడ్డులో’.

11/23/2016 - 21:51

బాలీవుడ్‌లో ప్రేమాయణాలు, డేటింగ్‌లు సర్వసాధారణం. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఈ విషయంలో సంచలనం రేపుతున్నారు. నచ్చినోడితో డేటింగ్ చేస్తూ.. ‘అబ్బే మాకేం తెలియదు’ అంటూ బుకాయించడం మామూలే! తాజాగా మరో గ్లామర్ భామ సోనమ్ కపూర్ డేటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిందట! నిన్నటితరం హీరో అనిల్‌కపూర్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్ విజయాలైతే దక్కడం లేదు.

11/23/2016 - 21:50

జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ కొత్త సినిమాపై ఇంకా సరైన నిర్ణయం తీసుకున్నట్టు లేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో కథా చర్చలు జరుపుతూనే ఉన్నాడు. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ అంటూ పెద్ద లిస్టే తయారైంది. త్రివిక్రమ్ సినిమాకు ఇంకాస్త టైం పట్టేలా ఉంది. పూరి సిద్ధంగానే ఉన్నాడు కానీ, ఎన్టీఆరే ముందుకు రావడం లేదట. ఎన్టీఆర్ దర్శకుల లిస్టులోకి మరో కొత్త దర్శకుడు చేరాడు.

11/23/2016 - 21:47

రామ్‌చరణ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, వి.ఎన్.ప్రసాద్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ధ్రువ’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తవగా దీనికి యు/ఎ సర్ట్ఫికెట్ లభించడంతో వచ్చే నెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, అందరి అంచనాలకు తగ్గట్టుగా ‘ధ్రువ’ విజయవంతం అవుతుందని తెలిపారు.

11/23/2016 - 21:45

ఆ మధ్య బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ హీరోగా వచ్చిన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జరీన్‌ఖాన్ గుర్తుందిగా.. అలా అనేకంటే లేటెస్టుగా ‘హేట్‌స్టోరీ-3’లో బ్రాతో అందాలు హాట్ హాట్‌గా ఆరబోసి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామకు ఆ సినిమా తరువాత అచ్చం అలాంటి అవకాశాలే వస్తున్నాయి. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ భామ ‘వాజహ్ తుమ్ హూ’లో ఓ హాట్ హాట్ ఐటెం సాంగ్ చేసింది.

11/23/2016 - 21:39

టీవీ తెరపై ఇప్పుడు అందాలు ఆరబోస్తూ మత్తెక్కిస్తున్నారు యాంకర్స్ అనసూయ, రష్మి. ఇప్పటికే వీరి ధాటికి చాలామంది యాంకర్స్ వెనుకపడిపోయారట! జబర్దస్త్ ప్రోగ్రాంతో పాపులర్ అయిన వీరిద్దరికి గట్టిపోటీ ఇవ్వడానికి రెడీ అవుతోందో తెలుగు హీరోయిన్. ఆ మధ్య ‘నచ్చావులే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హాట్ క్యూటీ మాధవీలత తాజాగా ఓ షార్ట్ఫిల్మ్‌లో హాట్ హాట్‌గా నటించి షాక్ ఇచ్చింది.

11/23/2016 - 21:37

దశాబ్దకాలంగా తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ శ్రీయ. ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్న ఈమెకు ఈమధ్య సినిమాలు తగ్గాయి. గ్లామర్ హీరోయిన్‌గా చాలామంది స్టార్ హీరోలతో నటించి సంచలనం రేపిన శ్రీయ, ప్రస్తుతం బాలకృష్ణ సరసన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తోంది.

11/23/2016 - 21:34

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా జర్నీ అంతా ఎమోషనల్‌గా సాగింది. ఈ కథ నా హృదయానికి దగ్గరైన కథ. ఇది హిట్ అయినందుకు ఆనందంగా వుంది’అని చిత్ర దర్శకుడు వి.ఐ.ఆనంద్ తెలిపారు. నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శే్వత, అవికాగోర్ ప్రధాన తారాగణంగా మేఘన ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.

11/23/2016 - 21:33

నాని కథానాయకుడిగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్‌ఎల్‌పి పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య రూపొందిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్ ఫిలింనగర్‌లో బుధవారం ప్రారంభమైంది. నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టిలపై తొలి సన్నివేశంపై క్లాప్‌ను దర్శకుడు వి.వి. వినాయక్ ఇచ్చారు. మరో దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్చాన్ చేశారు.

11/22/2016 - 21:02

‘వౌనమే నీ భాష ఓ మూగమనసా..’ ఇప్పటికీ ఈ పాట వింటే ఎవరి మనసైనా భావోద్వేగాలతో నిండిపోతుంది. మదిని హాయి గొలుపుతూ తనదైన గాత్రంతో ఆకట్టుకోవడంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణది ప్రత్యేక శైలి. కర్నాటక సంగీతాన్ని తనదైన గాత్రంతో సామాన్యుడికి సైతం దగ్గర చేసింది మురళీ గానమే. సంగీతాన్ని ఔపోసన పట్టిన మహా వాగ్గేయకారుడు, కర్నాటక సంగీతానికి ఖండాంతరాల ఖ్యాతితెచ్చిన తెలుగుతేజం మంగళంపల్లి.

Pages