S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/02/2016 - 21:15

అందాల భామ రాశిఖన్నా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన ప్రేమలో పడేసింది. ఇక ఆ తరువాత గ్లామర్ పాత్రలు చేసి యువ హృదయాలను కొల్లగొట్టింది. ఈమె అందాలకు పడని ప్రేక్షకుడే లేడు. ఇక గ్లామర్ భామ రాశిఖన్నా తెలుగులో స్టార్ హీరోయిన్స్‌కు పోటీగా దూసుకుపోతోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ భామ లేటెస్ట్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

11/02/2016 - 21:09

రామ్‌చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ధ్రువ’ సినిమా షూటింగ్ పూర్తికావచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల చేస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత సినిమాకు అప్పుడే ప్లాన్ చేస్తున్నాడట చరణ్. ఈసారి ఆయన కౌబోయ్‌గా కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

11/02/2016 - 21:08

‘నేను చేసిన ప్రతి సినిమాలోను ఏదో ఒక విషయాన్ని చొప్పించడానికి ప్రయత్నిస్తాను. నెగెటివ్ పాత్రని చేసినా ఆ పాత్రని ఒక దుర్యోధనుడిగా, రావణాసురుడిగా భావిస్తాను. విలన్ పాత్రలో నేనున్నప్పుడు ఛస్తే వీడి చేతిలో చావాలి, చంపితే వీడిలాంటి వాడిని చంపాలి, అని అనుకునేలా నటిస్తాను’ అని నటుడు సాయికుమార్ తెలిపారు. ఆర్.పి.పట్నాయక్ నటిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మనలో ఒకడు’.

11/02/2016 - 21:05

హీరో హీరోయిన్లిద్దరూ ప్రేమలో మునిగిపోయి తమ ఆశయాన్ని ఎలా నెరవేర్చుకున్నారు? వారు చేసిన సాహసం ఏమిటి? ప్రేమే శ్వాసగా సాగే ప్రేమికుల కథనం ఎలా ఉంటుంది? అన్న పాయింట్‌తో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాన్ని గౌతమ్ వాసుదేవమీనన్ అద్భుతంగా తెరకెక్కించారని హీరోయిన్ మంజిమ మోహన్ అన్నారు.

11/02/2016 - 21:01

‘నరుడా.. డోనరుడా’ అనే పేరు సినిమాకు పెట్టినప్పుడు ఇదేదో మసాలా చిత్రం అనుకున్నారని, కానీ సినిమా చూశాక ఈ విషయం తప్పని నిరూపిస్తుందని నటుడు సుమంత్ తెలిపారు. సుమంత్ కథానాయకుడుగా రూపొందించిన నరుడా.. డోనరుడా చిత్రం ఈనెల 4న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలిపారు.
అందుకే గ్యాప్

11/01/2016 - 22:32

ప్రఖ్యాత నటుడు కమల్‌హాసన్, బహుభాషా నటి గౌతమిల బంధానికి తెరపడింది. పదమూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట ఇప్పుడు విడిపోతోంది. ఈ విషయాన్ని స్వయంగా గౌతమి ప్రకటించింది. తన బ్లాగ్‌లో ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. పదమూడేళ్లుగా కమల్‌తో సాగించిన బంధం నుంచి విడిపోతున్నట్లు ఆమె పేర్కొంది.

11/01/2016 - 22:31

సూపర్ స్టార్ రజనీకాంత్, సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రోబో 2.0’. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే శంకర్ అన్నివిధాలా ఈ సినిమాని చాలా ఖచ్చితత్వంతో రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రజనీకాంత్‌పై కేవలం ఒకే ఒక్క పాట ఉంటుందట.

11/01/2016 - 22:30

సూపర్‌స్టార్ మహేష్ తమిళ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్‌లో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. మురుగదాస్ చిత్రం కంప్లీట్ కాగానే మహేష్ మరో సినిమాని అప్పుడే లైన్నో పెట్టేసాడు. అది శ్రీమంతుడితో ఇండస్ట్రీకి టాప్ 2 హిట్ ఇచ్చిన కొరటాల శివతో ఉంటుందని ఎప్పుడో ప్రకటన వచ్చేసింది. వీరిద్దరి హిట్ కాంబినేషన్ మరోసారి తెరకెక్కబోతుంది. ఇక ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

11/01/2016 - 22:33

విజయ్ ఆంటోని కథానాయకునిగా తమిళంలో రూపొందుతున్న ‘సైతాన్’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు ‘బేతాళుడు’గా త్వరలో విడుదల కానుంది. ‘బేతాళుడు’ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెల 6న ‘బేతాళుడు’ ఆడియో ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరగనుంది. తెలుగు, తమిళంలో చిత్రం 18న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని నిర్మాత ఎస్.వేణుగోపాల్ అన్నారు.

11/01/2016 - 22:29

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. ఆర్.నారాయణమూర్తి, జయసుధ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదలవాడ పద్మావతి నిర్మాత. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ సందర్భంగాపాత్రికేయుల సమావేశంలో ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘దేశంలో ప్రజల సమస్యలకు కారణమైన నల్లధనానికి మూలమేంటి?

Pages