S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 22:37

రామ్‌చరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ధ్రువ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ శరవేగంగా జరుగుతోందనీ, ఇటీవలే కాశ్మీర్‌లో మెలోడి సాంగ్ చిత్రీకరణ చేసామనీ రాంచరణ్ ఈ క్యారెక్టర్‌లో చాలా ఫ్యాషన్‌గా కనిపిస్తాడని తెలిపారు.

07/23/2016 - 22:36

వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బాబు బంగారం’. చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఆగస్టు 12న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు.

07/23/2016 - 22:34

అంజలి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రాంగద’. ప్రస్తుతం ఈ చిత్రం అమెరికాలో పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

07/23/2016 - 22:32

థియేటర్స్ లీజు, డిజిటల్ టెక్నాలజీపై చిన్న నిర్మాతలు ధర్నా చేశారు. క్యూబ్, యుఎస్‌ఒ రేట్లు తగ్గించాలని పోరాటం చేస్తున్న నిర్మాత ఆర్.కె.గౌడ్‌కు మిగతా నిర్మాతలు సంఘీభావం ప్రకటించారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ దగ్గర ధర్నా నిర్వహించారు.

07/22/2016 - 21:14

పవన్‌కళ్యాణ్ హీరోగా నటించనున్న కొత్త సినిమా విషయంలో కొద్దికాలంగా అయోమయం నెలకొన్న విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాల్సి ఉండగా, చివరి నిమిషంలో ఆయన తప్పుకోవడంతో ప్రస్తుతం డాలీ ఈ సినిమాకు దర్శకుడిగా ఎంపికయ్యారు. ఇక జూలై మొదటివారంలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళేలా టీమ్ పక్కాగా ప్లాన్ చేసినా, దర్శకుడు మారడంతో మళ్లీ ప్రీ ప్రొడక్షన్ కొత్తగా మొదలైంది.

07/22/2016 - 21:11

‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఆ సినిమా విడుదలై చాలారోజులు అవుతున్నా కూడా ఇంకా అఖిల్ రెండో సినిమా మాత్రం కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు వినిపిస్తున్నా కూడా ఏది ఓకే అవ్వడం లేదు.

07/22/2016 - 21:09

సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో శిక్షణనిస్తూ టాప్ మీడియా స్కూల్ లక్ష్యంగా సాగుతున్న అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ మీడియా నేతృత్వంలో అన్నపూర్ణ స్టూడియోలో ఫిలిం మేకింగ్, గ్రాఫిక్స్ డిజైనింగ్, సినిమాటోగ్రఫి, యానిమేషన్ వంటి కోర్సులలో మాస్టర్ డిగ్రి శిక్షణా తరగతులను నిర్వహించనున్నారు.

07/22/2016 - 21:07

రామ్‌శంకర్, నికిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్‌వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తికావస్తున్నాయి.

07/22/2016 - 21:04

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్‌లు పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. శ్రీయ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ని ఆపేసాడట బాలయ్య!! అసలు విషయం ఏమిటంటే.. ఈ సినిమా దర్శకుడు క్రిష్ పెళ్లి త్వరలోనే ఉన్న నేపథ్యంలో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చాడట!!

07/22/2016 - 21:02

చెన్నమనేని శ్రీ్ధర్, జ్యోతిసేథీ, సంజన, శరవణ్ కీలక పాత్రధారులుగా శ్రీ నందన్ మూవీస్ పతాకంపై పల్లెల వీరారెడ్డి దర్శకత్వంలో మహేష్ కల్లే నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’. జి.సంతోష్‌రెడ్డి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర మేయర్ బొంతు రామ్మోహన్ థియేట్రికల్ ట్రైలర్, బిగ్ సీడీని విడుదల చేశారు.

Pages