S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/21/2016 - 03:53

ప్రముఖ నటుడు చిరంజీవి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఎనిమిదేళ్ల తరువాత హీరోగా రీఎంట్రీ ఇస్తోన్న ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సూపర్‌హిట్ ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బుధవారంనుంచి రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది.

07/21/2016 - 03:51

తొలి చిత్రం ‘దబాంగ్’తో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శత్రుఘ్నసిన్హా తనయ సోనాక్షి సిన్హా. బాలీవుడ్ సరికొత్త మహారాణిగా ఆమెను గౌరవించారు. ఆ తర్వాత ఆమె ఏ చిత్రం చేస్తే ఆ చిత్రం హిట్టై కూర్చుంది. ఆమె చెప్పిందే కథ, చేసిందే సన్నివేశం అన్నట్లుగా సాగింది. ఒకానొక సమయంలో ఆమె కాల్షీట్లకోసం క్యూలో నిలబడే పరిస్థితి. అప్పట్లో ఎక్స్‌పోజింగ్ అనేమాటకు తావు లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

07/21/2016 - 03:47

తొలి సినిమా ‘ఒక మనసు’ సమయంలో ‘నిహారిక’ను మీడియా బాగా హైప్ చేసింది. మెగా కుటుంబంనుండి వస్తున్న హీరోయిన్ కనుక ప్రేక్షకులు ఆసక్తిగా గమనించారు. దానికి తోడు ఆమె అశ్లీల చిత్రాల్లో నటించననీ, కుటుంబానికి మచ్చతెచ్చే పాత్రలు చేయనని చెప్పడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మినిమమ్ గ్యారంటీ అనుకున్న ‘ఒక మనసు’ కాస్తా ఒక్కరినీ మెప్పించకపోవడంతో, హీరోయిన్‌గా తొలి చిత్రంతోనే చేదు అనుభవాన్ని చవిచూసింది.

07/21/2016 - 03:46

ఈమధ్య స్టార్ హీరోలు గాయకులుగా మారుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓ హీరో కోసం మరో హీరో పాట పాడుతూ ఆ సినిమాకు ఇంకాస్త క్రేజ్‌ను తెస్తున్నారు. తాజాగా అలాంటి ప్రయత్నమే సాయిధరమ్‌తేజ్ నటిస్తున్న ‘తిక్క’ సినిమాలో జరిగింది. ఇటీవలే సుప్రీమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సాయిధరమ్ తదుపరి చిత్రం ‘తిక్క’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రముఖ తమిళ హీరో ధనుష్ టైటిల్ సాంగ్ పాడాడు.

07/21/2016 - 03:45

దీపక్ సరోజ్, మాళవిక మీనన్ జంటగా కందిమళ్ల మూవీ మేకర్స్ పతాకంపై కోటపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ కె రన్’. కందిమళ్ల వెంకట చంద్రశేఖర్ నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

07/21/2016 - 03:44

జైహింద్ పిక్చర్స్ పతాకంపై జైహింద్ గౌడ్ హీరోగా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి తమ 90వ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్’. ఈ చిత్రాన్ని పి.జైహింద్‌గౌడ్ నిర్మిస్తున్నారు.

07/21/2016 - 03:43

అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

07/21/2016 - 03:42

సువర్ణా క్రియేషన్స్ పతాకంపై జె.జాన్‌బాబు దర్శకత్వంలో పి.డి.రాజు, అభినయ, సాయికిరణ్, భానుచందర్ ప్రధాన పాత్రల్లో టి.సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలికిరణం’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో ఆడియో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా దర్శకుడు జాన్‌బాబు వివరాలు తెలియజేస్తూ, సినిమా మొత్తం పూర్తయిందని, అలాగే బిజినెస్ కూడా జరిగిందని అన్నారు.

07/19/2016 - 21:10

రాంచరణ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ‘ధ్రువ’ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కాశ్మీర్‌లో షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ వివరాలు తెలియజేశారు. ‘ఇటీవలే కాశ్మీర్‌లో ఓ మెలోడీ సాంగ్‌ను చిత్రీకరించాం.

07/19/2016 - 21:09

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కబాలి సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ అభిమానుల్లో ఉత్సాహం ఎక్కువైంది. ప్రపంచ వ్యాప్తంగా కబాలి ప్రభంజనం మామూలుగా లేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా గంటల్లోనే ఖాళీ అవుతున్నాయి.

Pages