S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి

11/20/2016 - 06:57

‘ఏరా! శ్రీకాంత్ ఎప్పుడొచ్చావ్?’ కొడుకుని చాలా రోజులకి చూస్తూ ఆనందంగా అడిగాడు రాఘవరావు. బయట నుండి వస్తున్నట్టున్నారాయన. ‘బాబు గారూ! మంచినీళ్లు’ అంటూ అందించింది గంగ. ‘నీ పిహెచ్‌డి అయిపోయింది కదా! మరిప్పుడు ఏం చేద్దామని?’ అడిగారాయన. ‘నాన్నగారూ! నాకు విదేశాలు వెళ్లి ఇంకా ఇంకా చదవాలని ఏంలేదు. లక్షలు లక్షలు సంపాదించాలని కూడా లేదు.

11/12/2016 - 22:30

ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్
సెల్ మోగింది. కళ్లు నులుముకుంటూ...

11/12/2016 - 22:27

దీపం
నిశీధిలో వికసించే వెలుగుల
చిరునవ్వుల పువ్వు
చీకటి కాలాన్ని మోస్తున్న
ప్రమిద హృదయం నిండా
తైల కాంతులు
అనుక్షణం క్షణక్షణం ఉదయం కోసం
తిమిరంతో సమరం
శూన్యంలో చురకత్తితో
గత అనుభవాల జ్ఞాపకాలతో
దీపావళి మతాబుల వెలుగుల్లో
కళ్లుపెట్టి గుడిసెలోకి చూస్తే
ఆకలి చమురులో
నిరాశల జ్యోతి వెలుగుతోంది
పేదల కలలన్నీ

11/12/2016 - 22:22

ప్రతులకు
యస్.బి.చౌదరి,
విజయా రెసిడెన్సీ-1,
54-4-7/6, శీలానగర్,
ఎ.వి.రోడ్,
రాజమహేంద్రవరం
**

11/06/2016 - 08:14

ముత్యాలరావు ఒక ప్రభుత్వ శాఖకి జిల్లా అధికారి. ఆఫీసు పనులు కోసం వచ్చిన పౌరులను మాటలతో బోల్తాకొట్టించి పలుమార్లు తిప్పించుకుంటాడు. అందుకు కితాబుగా తాను ఒక మంచి మాటకారి ఆఫీసరనుకుంటాడు. అప్పుడప్పుడు సందర్భానుసారం సమయస్ఫూర్తితో ఇతరులను ఎద్దేవా చేస్తాడు. గొప్ప చమత్కారి అని అనుకుంటాడు.

10/29/2016 - 23:57

బలరాముడు శయన మందిరంలో రత్నఖచిత ఆసనముపై ఆసీనుడయి వుండి తన తోబుట్టువు ముద్దరాలు సుభద్ర ఇంద్రప్రస్థ నగరములో సుఖ సంతోషములతో హాయిగా ఆనందముగా వుందా లేదా? అని సోదర వాత్సల్యముతో ఆరాటపడిపోతున్నాడు.

10/29/2016 - 23:51

కాలాన్ని పరీక్షించడం
సాధ్యంకాదు
పరిశీలించడం
సాహసం కాదేమో!

ప్రకృతిలో పరవశించడం
మోహనమో కాదో కాని
ఆరాధించడం, ఆరాటపడటం
పాపం కాదు

సహానుభూతిని వ్యక్తం చేయడం
మనిషితనం
సాయమించకపోవడం
చేయూతను ప్రకటించకపోవడం
మానవీయం అన్పించదు

10/29/2016 - 23:53

గ్రంథాలయాలు వౌన విశ్వవిద్యాలయాలు. చైతన్య స్ఫూర్తికి, విజ్ఞానానికి, వికాసానికి గ్రంథాలయాలు సోపానాలు. గ్రంథాలయోధ్యమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంఘం తాజాగా ప్రచురించిన ‘గ్రంథాలయ కుసుమాలు’ కవితా, కథా సంకలనం ఆకట్టుకుంటుంది. మహమ్మద్ రఫీ (ఈవేమన), డబ్బీరు శ్రీనివాసరావు సంపాదకత్వాన విడుదలైన ఈ పుస్తకంలో 35 కవితలు, 7 కథలకు స్థానం కల్పించారు. పాఠశాల విద్యార్థుల రచనలకు ప్రోత్సాహం కల్పించారు.

10/29/2016 - 23:52

తెలుగువాళ్లకి ఓ ప్రత్యేక రాష్ట్రం కావాలని అశువులు బాసిన పొట్టి శ్రీరాములు పుట్టిన గడ్డపై పుట్టిన మరో తెలుగు సాహితీ దిగ్గజం ఆర్వీఎస్ సుందరం. తెలుగు నుడికారం మీద ప్రేమే కాదు ఆయనకు మమకారం కూడా. 1948 ఏప్రిల్‌లో నెల్లూరులో జన్మించిన ఆయన ఉన్నత పాఠశాల విద్య అక్కడే జరిగింది. ఆ తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలోను సాగింది.

10/23/2016 - 04:28

నాగావళి నది ఒడ్డున ఉన్న గ్రామం అది. పేరు కరజాడ. ఆ వూర్లోని గ్రామీణ బ్యాంకు మేనేజరుగా వరప్రసాద్ బదిలీపై వచ్చాడు. వచ్చీ రావడంతోనే బ్యాంకులో పాత రుణాలు ఇంకా ఎవరెవరు చెల్లించారో లేదో అని ఓ లిస్టు ముందేసుకు పరిశీలిస్తున్నాడు. పాతబకాయిల వసూలులో అశ్రద్ధగా ఉంటే ప్రధాన కార్యాలయం వారు పీక్కు తినేస్తారు. అందుకే ఆ బ్యాంకు శాఖలో ఉన్న ముదరా కేసుల్ని వరప్రసాద్ పరిశీలించడం మొదలుపెట్టాడు.

Pages