S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

07/10/2016 - 22:44

సాహిత్యం సమాజానికి అద్దం వంటిదని మన ప్రియతమ నాయకుడు, మొట్టమొదటి ప్రధాని నెహ్రూ అన్నారు. సమాజంలో చోటు చేసుకున్న సామాజిక పరిస్థితులు, బలాలు, బలహీనతలు, ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బడుగు జీవుల జీవన పోరాటం, జరుగుతున్న మోసాలు, కుట్రలు అన్నీ సాహిత్యంలో మనకు కనిపిస్తాయి.

07/10/2016 - 22:40

ఇదొక అపూర్వమైన, అద్భుతమైన వచన రచన. స్వామి వివేకానంద తన జీవితకాలంలో ఆధ్యాత్మిక, చారిత్రక, సామాజిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారు. స్వామి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అవన్నీ గ్రంథస్థం అయ్యాయి. కాని శివాజీ గురించి ప్రస్తావించిన ప్రసంగం ఆ సంకలనంలో ఎక్కడా లేదు. ఇది కాకతాళీయమో, మరొకటో తెలియదు.

07/10/2016 - 22:37

‘‘రమ్యా! ప్లీజ్ ఏడవకు. నీకేం కాదు. త్వరగా కోలుకుని మళ్లీ మామూలు అవుతావు. నేనున్నానుగా’’ అంటూ బెడ్ మీదున్న తన భార్యకి ధైర్యం చెబుతూ ఓదారుస్తున్నాడు రమ్య భర్త విశాల్.

07/03/2016 - 06:03

‘‘వేదవతీ! వేగంగా నిద్ర లేవమ్మా. ఆడపిల్ల పొద్దెక్కే వరకూ నిద్రపోకూడదు’’ అనసూయమ్మ కోడల్ని నిద్ర లేపుతోంది.
‘‘అవునే తల్లీ! ఆడపిల్ల బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోతే ఆ ఇంటికి అరిష్టం’’ అనసూయమ్మ అత్త ఆండాలమ్మ పిలుపు.
‘‘కొత్త కోడలు కదా! ఆ మాత్రం మొద్దునిద్ర తప్పదు కాసేపు నిద్రపోనివ్వండి’’ ఆండాలమ్మ భర్త ముక్తాయింపు.

06/27/2016 - 07:21

భూమి తల్లి కట్టుకున్నది
ఆకుపచ్చని చీరులు ఎన్నో
చీర మధ్యలో ఉన్నవి
రంగుల పువ్వులు ఎన్నో
పువ్వుల మధ్యలో ఉన్నవి
మకరంద గ్రంథులు ఎన్నో
గ్రంథుల మద్యన ఉన్నది
ఎంతో మధురమైన తేనె
ఆ నేనెను స్వీకరించడానికి
వస్తున్నవి తుమ్మెదలు ఎన్నో
చుట్టూ ఉన్న రంగు రంగుల
పూలతోటలు ఎన్నో
పూలతోటలో ఉన్నవి
రంగురంగుల సీతాకోకచిలుకలు ఎన్నో

06/27/2016 - 07:13

జీవితం పొడుగునా అనేక భావాల కలబోత కదలికలు మనల్ని వెంటాడుతుంటాయి. ఈ ఊగిసలాటలోంచి భిన్నకోణాల సంఘర్షణలు సమ్మేళనంతో మిళతమవుతాయి. ఇలా మనసులో చిగురించిన ఊహలు పరిణతి చెందిన అనుభవాలతో మొగ్గ తొడిగి విప్పారిన చూపులతో వికసించినపుడు ఆ అనుభూతుల పరిమళమే వేరు. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా ఉంటుంది. అలాంటి తపనలోంచి వెలుగు చూసిన కవితా సంపుటే ‘273 డిగ్రీల సి నుండి ఒక సరళ నిర్వచనం’.

06/27/2016 - 07:11

తరతరాల నుండి సంప్రదాయం పేరుతో మనల్ని పీల్చి పిప్పి చేస్తున్న విభిన్న రంగాలలోని వ్ఢ్యౌన్ని, మూర్ఖత్వాన్ని ఎదిరించడానికి నడుం బిగించుకున్న వ్యక్తిగా ‘తాపీ ధర్మారావు జీవితం - రచనలు’ అను పుస్తకం ద్వారా తెలుస్తుంది. దీనిని విశాలాంధ్ర వారు ప్రచురించారు. సాహిత్య, సాంస్కృతిక విలువలు సమూలంగా మార్చాలన్న ఆలోచనతో దేవాలయాల మీద శిల్పాలను, ఇనుప కచ్చడాలను, పెళ్లి తంతును శాస్ర్తియ దృక్పథంలో పరిశీలించారు.

06/27/2016 - 07:15

అది రిటైర్ ఐఎఎస్ ఆఫీసర్ గారికి కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయం. పరీక్షల నిర్వహణ మీద వేసిన కమిటీ అది.
ఒక్కొక్కరుగా ఆ గదిలోకి వస్తుండడం వల్ల కాన్ఫరెన్స్ హాలు క్రమంగా నిండసాగింది.

06/27/2016 - 07:05

నగరంలోని అతిపెద్ద కంపెనీలో సూపర్‌వైజర్ పోస్టుకిగాను నిర్వహించిన పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ కోసం బయలుదేరాడు దివాకర్. బస్టాండు దగ్గరవుతుండగా కారొకటి స్పీడుగా వచ్చి దివాకర్ పక్క నుండి వెళ్లింది. రోడ్డు మీద బురద నీరు బురద నీరు దివాకర్ షర్టు మీద పడింది.
అది చూసి కారాపి అందులో ఉన్న వ్యక్తి కిందకి దిగి ‘‘క్షమించండి చూసుకోలేదు’’ అన్నాడు.

06/19/2016 - 08:59

మోహనరావు ఒక ప్రముఖ డాక్టర్. అతని దగ్గరకి వెళ్లిన వాళ్లకి ఇట్టే నయం చేస్తాడని అతనికి పేరుంది.
ఒకసారి అతని దగ్గరకి శ్రీను అనే కారు మెకానిక్ వెళ్లాడు.
‘‘డాక్టర్‌గారూ! నాకు విపరీతమైన దురదలు, ఆయాసం, కడుపులో మంటగా ఉంటుంది’’ అంటూ తన బాధ చెప్పుకున్నాడు.
‘‘అలాగా’’ అని మోహనరావు అతన్ని బాగా పరీక్షించాడు.
కొన్ని రకాల మాత్రలు, టానిక్ ఇచ్చి ఇంజెక్షన్ చేశాడు.

Pages