S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

12/20/2016 - 22:36

ఉన్నట్లుండి ఎందుకో కథలు రాయాలనిపించింది వికాస్‌కి. డిగ్రీ అయ్యాక చెయ్యడానికి ఏ పనీ లేకపోవడంవల్లనేమో. కారణం ఏదైనప్పటికి ఓ మంచి రచన చెయ్యాలన్న సంకల్పం కలిగింది. ఠపీమని పెన్ను, కాగితం తీసాడు. ఎంత ప్రయత్నించినా కలం ముందుకు సాగడంలేదు. ఇక లాభం లేదనుకుని లైబ్రరీకి వెళ్లాడు. ఏక బిగిన ఓ అరడజను వార, మాస పత్రికలు తిరగేసాడు. లీలగా మదిలో ఏదో థీము మెదిలింది. మరి ఆలశ్యం చేయకుండా మదిలో అక్షర రూపమిచ్చాడు.

12/17/2016 - 00:08

ఫెళఫెళలాడుతున్న ఎర్రని రెండు గాంధీబొమ్మ నోట్లు పైజేబులో పెట్టుకుని హుషారుగా నా పల్సర్ బైక్‌పై స్నేహితుడు నరహరి పెళ్లికి వెళుతున్నాను.
‘ఒరేయ్ శేఖర్ పెళ్లి ఆదివారం కదా. నీకు సెలవు. పెళ్లి రాత్రి అయినా తెల్లవారినప్పటి నుండి నువ్వు నా పక్కన ఉండాలి. అసలే నీకు మతిమరుపు. మరిచిపోగలవు జాగ్రత్తరోయ్’ అంటూ హెచ్చరించిన స్నేహితుడి హెచ్చరిక గుర్తుకొచ్చింది.

12/16/2016 - 23:54

అసలే వేసవికాలం.
సముద్రం ఒడ్డున కూడా చల్లదనం లేదు. సముద్రం వైపు నుండి వెచ్చని గాలులు వస్తున్నాయి. సాగరతీరం సందడిగా ఉంది. కింద సముద్రం నీలం పైన ఆకాశం నీలం. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆ కెరటాల వైపు నిశితంగా చూస్తున్న గోపాలంలో భావోద్వేగం. దానితో పాటే అతని ఆలోచనలు కూడా.

12/11/2016 - 02:34

శే్వత బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... అందం, చదువు సాంప్రదాయం మెండుగా వుండే శే్వతను పెళ్లి చేసుకోడానికి, పెళ్లి కొడుకులు క్యూకట్టారు. మంచి మంచి సంబంధాలు వచ్చినా మేనత్త కొడుకు మధుసూదనరావునే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది శే్వత.
మధుసూదనరావు పక్కా పల్లెటూరు వ్యక్తి. పదెకరాల పొలం, ఒక పెంకుటిల్లు అతని ఆస్తి. తలిదండ్రులకు ఒకడే కొడుకు. బికాం చేశాడు.

12/11/2016 - 02:31

కవితా శీర్షికలోనే అభ్యుదయ కాంక్ష, ఆశావాదం, చైతన్యాన్ని, నవతను ఆహ్వానించడం వంటి అర్థాలున్నాయి. నిరాశ, నిస్పృహ, నిర్వీర్యతలను నిరసించడం అంతర్లీనంగా కనిపిస్తుంది. చేయి తిరిగిన రచయిత్రి బి. కళాగోపాల్ రచన ఇది. 74 కవితలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. చదివిస్తాయి, అలరిస్తాయి. వైవిధ్యభరిత కవితల్లో భావాలు వెల్లివిరుస్తాయి.

12/11/2016 - 02:24

ఆఫీసుకు వెళ్లి వస్తానని మోహన్ భార్య సుజాతకి చెప్పి తన మోటారు బైక్‌పై బయలుదేరాడు.
‘‘ఏమండీ సాయంకాలం ఆఫీసు అయ్యాక మా ఫ్రెండ్ అనసూయ వాళ్లింటికి రండి. నేను వాళ్లింట్లో ఫంక్షన్‌కి వెళతాను’’ అంది సుజాత.
‘‘అలాగేలే’’ అని చెప్పి మోహన్ ఆఫీసుకి వెళ్లిపోయాడు.

11/29/2016 - 00:29

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.

11/20/2016 - 07:16

‘‘అమ్మా ఒక్కసారి నీ సెల్ ఇవ్వమ్మా, కాసేపు గేమ్ ఆడుకుని వెంటనే ఇచ్చేస్తాను’’
‘‘సుధా నీకెన్నిసార్లు చెప్పాలి సెల్ వాడడం మంచిది కాదని. నీది సెల్ వాడే వయసు కాదు. పెద్దయ్యాక మంచి సెల్ కొనిస్తాను’’ కూతురితో అంది సరోజ.
‘‘అబ్బా ఏమిటమ్మా... నీవు ఎప్పుడు అడిగినా ఇదే మాట చెబుతున్నావు. నేను చిన్నపిల్లను కాదులే ఒక్కసారి ఇవ్వమ్మా. ఇవ్వకపోతే డాడీతో చెబుతాను’’ బుంగమూతి పెట్టింది సుధ.

11/12/2016 - 23:26

ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్
సెల్ మోగింది. కళ్లు నులుముకుంటూ...

11/12/2016 - 23:24

మీరు అక్షరాలను కవితగా కూర్చేవేళ
నేను దీనుల కన్నీటిని తుడవ చూస్తాను
మీరు మనసును మధించి కవిత రాసేవేళ
నేను రోగుల కన్నులలో ఆనందమై నిలుస్తాను
మీరు వేదికలపై కవితాగానం చేసే వేళ
నాలోకి నేను తొంగి చూస్తూ
నన్ను నేనే వెతుక్కుంటాను
మీరు కవులుగా భుజకీర్తులు తగిలించుకున్న వేళ
నేను మనిషిని అని దృఢంగా చెప్పుకుంటాను
సందేహం లేదు మీరు గొప్పవారు

Pages