S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/04/2018 - 02:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: త్వరలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీల ఏకకాల ఎన్నికల నిర్వహణ కోసం కొత్త ఈవిఎంల కొనుగోలుకు 4,500 కోట్ల రూపాయల అవసరమవుతాయని లా కమిషన్ తెలిపింది.

09/04/2018 - 01:58

చిత్రం.. కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం భక్తులతో కిటకిటలాడుతున్న మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలి ఆలయం

09/04/2018 - 01:55

న్యూఢిల్లీ: త్వరలో విస్తరించనున్న కర్నాటక మంత్రివర్గంలో కొత్తగా ఏడుగురిని తీసుకోనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్లకు 30 మంది ఎమ్మెల్యేలను చైర్మన్‌లుగా నియమించనున్నారు. కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ఈనెల మూడో వారంలో జరుగనుంది.

09/04/2018 - 02:04

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కర్నాటకలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మరోసారి తన పట్టు నిరూపించుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న ఈ కూటమి స్థానిక ఎన్నికల్లోనూ విజయభేరి మోగించడం ద్వారా తన సత్తాను మరోసారి చాటుకుంది. శనివారం ఎన్నికలు జరుగగా, సోమవారం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

09/04/2018 - 01:50

మనుషులంటూ మిగిలితేనే కదా...
మతమూ, మట్టిగడ్డా!

09/04/2018 - 01:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: దేశంలోని 10 రాష్ట్రాల్లో గల అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు విడుదల చేసింది. సుదూరంగా ఉండే ఆయా ప్రాంతాల్లో నివసించేవారి అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

09/04/2018 - 01:47

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కేసుల్లో క్రిమినల్ కేసులతోబాటే క్రమశిక్షణా చర్యలనూ తీసుకోవాలని ప్రభుత్వ శాఖలను, సంస్థలకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సూచించింది. కేసుల సత్వర పరిష్కారానికే ఈ సూచనలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

09/04/2018 - 02:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని చక్కగా అమలు చేయడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, దీని నిమిత్తం తమ శాఖ ఇప్పటికే తగిన కృషి చేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ విషయంలో తమ దేశం ఎంతో చొరవ చూపిన ఘనత ఉందని అన్నారు.

09/04/2018 - 00:08

జన్మాష్టమి వచ్చిందంటే చిన్ని కృష్ణుడి వేషంలో పిల్లలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. నంద గోపాలుడ్నే చూస్తున్నామా అన్నంత ఆనందాన్ని వారి ముగ్ధ మనోహర వేషాలు అలరిస్తాయి. బాల గోపాలుడి బాల్య చేష్టలేమో గానీ.. ఈ చిన్ని కృష్ణులు మాత్రం కొంత ఆధునికంగానే అల్లరి చేశారు. సెల్ఫీలతో కృష్ణాష్టమిని సాంకేతిక మలుపు తిప్పారు. అజ్మీర్‌లో సోమవారం జరిగిన వేడుకల్లో చిన్నారులు ఇలా అలరించారు.

09/03/2018 - 17:31

చెన్నై: మద్రాస్ మెరీనా బీచ్‌లో ధర్మాలు, ఆందోళనలు నిర్వహించరాదని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ప్రజా భద్రత దృష్ట్యా ధర్మాలు వంటివాటిని నిర్వహించరాదని పేర్కొంది.

Pages